బౌలింగ్ లో కోచించ్ ఇచ్చేది లెజెండరీ పాకిస్తానీ పేస్ బౌలర్ వసీం అక్రమ్.. తండ్రి ఏమో క్రికెట్ ప్రపంచంలోని రికార్డుల్లో సగానికి సగాన్ని సొంత పేరు మీద పెట్టుకొన్న వ్యక్తి.. చదువు వంటి టెన్షన్లేమీ లేవు. ఆర్థిక సమస్యలంటే కూడా తెలీదు. టార్గెట్ కేవలం క్రికెట్.
ప్రపంచ అత్యున్నత శ్రేణి ఆటగాళ్లే ఎంతో అభిమానంగా చూసుకొంటారు. ఎన్నో విషయాలు నేర్పుతారు. ఇతడిని తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తారు. ఇలాంటి నేపథ్యంలో అర్జున్ టెండూల్కర్ ఎంత పెద్ద క్రికెటరవుతాడు? అనేది క్రికెట్ ప్రియులమధ్య చర్చనీయాంశంగా మారింది.
ఐపీఎల్ సీజన్ లో అర్జున్ టెండూల్కర్ ముంబై ఇండియన్స్ జట్టుతో పాటే ఉంటాడు. ఈ సీజన్ లో మన దేశానికి వచ్చే ఎంతో మంది లెజెండరీ క్రికెటర్ల.. ప్రతిభావంతమైన ఆటగాళ్ల మధ్యన గడుపుతూ ఉంటాడు. వారి నుంచి ఎన్నో విలువైన సూచనలను పొందుతూ ఉంటాడు.
అర్జున్ టెండూల్కర్ లెఫ్టార్మ్ పాస్ట్ బౌలర్ కమ్ బ్యాట్స్ మన్. ఆల్ రౌండర్ గా ఎదిగే ప్రయత్నంలో ఉన్నాడు. ప్రస్తుతానికి అతడి వయసు 15 సంవత్సరాలు. మరో రెండు మూడు సంవత్సరాల సాన పట్టిన అనంతరం సచిన్ టెండూల్కర్ తనను ఏ ఐపీఎల్ టీమ్ ద్వారానో తనని అందరికీ పరిచయం చేసే అవకాశాలున్నాయి.
అర్జున్ అడగాలి కానీ.. చాలా ఐపీఎల్ టీమ్ లు అతడిని జట్టు సభ్యుడిగా చేసుకోవడానికి ఎంతో ఆసక్తితో ఉంటాయి. మరి టెండూల్కర్స్ ఫ్యామిలీ ఎవరికి అవకాశం ఇస్తుంది? అనేదీ ఆసక్తికరమైన విషయమే.