బాలయ్య వందో సినిమాపై భవ్య రుమాలు

బాలయ్య వందో సినిమా కాస్త ఆసక్తికరంగా మారేలా వుంది. ఈ సినిమా నిర్మించాలన్న ఆలోచనతో లెజెంట్ లాంటి సూపర్ హిట్ సినిమాను నిర్మించిన సాయి కొర్రపాటి వున్నారు. ప్రస్తుతం బాలయ్య 99వ సినిమాను దర్శకుడు…

బాలయ్య వందో సినిమా కాస్త ఆసక్తికరంగా మారేలా వుంది. ఈ సినిమా నిర్మించాలన్న ఆలోచనతో లెజెంట్ లాంటి సూపర్ హిట్ సినిమాను నిర్మించిన సాయి కొర్రపాటి వున్నారు. ప్రస్తుతం బాలయ్య 99వ సినిమాను దర్శకుడు శ్రీవాస్ రూపొందించే పనిలో వున్నారు. వందో సినిమాకు ఇంకా టైమ్ వుంది. 

కానీ ఈలోగానే సాయి కొర్రపాటికి పోటీ ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీతో మంచి సంబంధాలున్న భవ్య సంస్థ బాలయ్య వందో సినిమా మీద కన్నేసినట్లు వినికిడి. ఈ మేరకు వారు బాలయ్యను అప్రోచ్ అయినట్లు, ఆయన ఓకె అన్నట్లు వినికిడి. 

ఇప్పటికే భవ్య సంస్థ అటు మహేష్ బాబుతో ఒకటి కన్ ఫర్మ్ చేసుకుంది. మరోపక్క రామ్ చరణ్ సినిమా కోసం ట్రయ్ చేస్తోంది. ఇంకోపక్క గోపీచంద్ తో మరో సినిమా రెడీ చేస్తోంది. మొత్తానికి భవ్య వ్యవహారం చాలా జోరుగా వుంది.