మహేంద్ర సింగ్ ధోనీ.. భారత క్రికెట్ జట్టుకు ఒక అరుదైన కెప్టెన్. 28 సంవత్సరాల తర్వాత టీమిండియాను ప్రపంచ చాంపియన్ గా నిలిపినా… తొలి టీ20 ప్రపంచకప్ ను గెలిచిన జట్టుకు కెప్టెన్ గా నిలిచినా.. చాంపియన్స్ ట్రోఫీని కూడా గెలిపించిన కెప్టెన్ గా .. టీమిండియాకు అత్యంత విజయవంతం అయిన కెప్టెన్ గా కూడా ధోనీ ఒక గొప్ప స్థాయిలో ఉన్నాడు.
మరి అలాంటి కెప్టెన్ ఖాతాలో ఇప్పుడు ఒక అరుదైన ఘనత జోడీ అయ్యింది. అయితే ఇది పాజిటివ్ పాయింట్ కాదు…. పూర్తిగా నెగిటివ్. బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు చేతిలో వన్డే సీరిస్ లో ఇండియా ఓటమి పాలైన నేపథ్యంలో ధోనీ ఖాతాలో ఈ రికార్డు జమ అయ్యింది. తొలిసారి బంగ్లా చేతిలో వన్డే సీరిస్ ఓటమి పాలైన భారత జట్టుకు కెప్టెన్ గా ధోనీ రికార్డు సృష్టించాడు. ఇంత వరకూ ఏ కెప్టెన్ కూ కు ఈ తరహా అనుభవం లేదు.
మరి ఈ సంగతి ఇలా ఉంటే.. బంగ్లాతో రెండో వన్డే అనంతరం ధోనీ మాట్లాడిన తీరు ఏ మాత్రం సమర్థనీయం కాదు. ఇంతకీ ఆయన ఏమంటారంటే… తప్పుకొమ్మంటే తప్పుకొంటాను, నా అవసరం లేదనుకొంటే తప్పుకొంటాను.. అంటున్నాడు. మిస్టర్ కూల్ గా పేరుపొందిన ధోనీ లాంటి కెప్టెన్ నుంచి ఇలాంటి మాటలను అయితే ఎక్స్ పెక్ట్ చేయలేం. ధోనీ ఇలా బెదిరించడం కాదు.. తన విషయం గురించి తనే జడ్జ్ చేసుకోవాలి.
జాతీయ జట్టు కెప్టెన్ ఇలా మాట్లాడటం అంటే అది జాతిని బెదిరించడమే అవుతుంది. టీమ్ గేమ్ లో ఇలాంటి మాటలకు అస్సలు స్థానం లేదు. అసలు బంగ్లా చేతిలో ఓటమి తో బాధలో ఉన్న అభిమానులను ధోనీ తన మాటలతో మరింతగా బాధపెడుతున్నాడు.