మెగా-పూరి సినిమా లేనట్లేనా?

మొత్తానికి బాలారిష్టాలు దాటి వరుణ్ తేజ్-పూరి జగన్నాధ్ సినిమా ప్రకటన వరకు వచ్చింది. ఓపెనింగ్ డేట్లు, షెడ్యూలు కూడా ప్రకటించేసారు. పోకిరి..ఇడియట్ ల మాదిరిగానే ఇక లోఫర్ అన్నది పాపులర్.  Advertisement సరే ఈ…

మొత్తానికి బాలారిష్టాలు దాటి వరుణ్ తేజ్-పూరి జగన్నాధ్ సినిమా ప్రకటన వరకు వచ్చింది. ఓపెనింగ్ డేట్లు, షెడ్యూలు కూడా ప్రకటించేసారు. పోకిరి..ఇడియట్ ల మాదిరిగానే ఇక లోఫర్ అన్నది పాపులర్. 

సరే ఈ సంగతి ఇలా వుంచితే, లోఫర్ షెడ్యూలు చూస్తే, ఇప్పటి నుంచి వరుసగా మూడు నెలల పాటు పూరి లాక్ అయిపోతున్నట్లు స్పష్టమవుతోంది. అంటే అక్టోబర్ కు కానీ ఫ్రీ కాడు. మరి ఆగస్టులో చిరు 150 వ సినిమా ప్రారంభం కావాల్సి వుంది. 

అంటే పూరియే చిరు సినిమా కనుక చేస్తే, కేవలం క్లాప్ కొట్టుకుని, అక్టోబర్ తరువాత పట్టాలు ఎక్కుతుందని అనుకోవాలా? లేక వినిపిస్తున్న వార్తల ప్రకారం పూరి-చిరు సినిమా కన్నా ముందుగా, వినాయక్-చిరు సినిమా స్టార్ట్ అయిపోతుందని అనుకోవాలా?

పైగా ఇంకా సెకండాఫ్ రెడీ కావాల్సి వుంది పూరి ట్వీట్ ల ప్రకారం. మరి ఈ సినిమా మీదకు పూరి వెళ్లిపోతే సెకండాఫ్ ఎప్పుడు రెడీ అవుతుంది. అంటే మరి కాస్త సమయం కావాలి. దానా దీనా ఆలోచిస్తే..కాస్త అనుమానం గానేవుంది. లేదా మళ్లీ ఎప్పుడో లోఫర్ మాదిరిగానే టక్కున ప్రకటించేస్తాడా?