వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 182 పరుగులకే ఆలౌట్ కాగా, 183 పరుగుల లక్ష్య ఛేదనలో టీమిండియా తడబాటు ప్రదర్శించింది. 20 పరుగులకే టీమిండియా రెండు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు ఇద్దరూ సింగిల్ డిజిట్ మాత్రమే సాధించగలిగారు.
కోహ్లీ కాస్సేపు వెస్టిండీస్ బౌలర్లను ప్రతిఘటించినా, 33 పరుగులకే ఔట్ అయ్యాడు. రెహానే, రైనాలదీ అదే పరిస్థితి. రెహానే 14 పరుగులకీ, రైనా 22 పరుగులకీ ఔట్ అయ్యారు. కెప్టెన్ ధోనీ టీమిండియాని విజయతీరాలకు చేర్చేందుకు శ్రమించాల్సి వచ్చింది. జడేజా (13) సైతం నిరాశపర్చాడు. అశ్విన్ 16 పరుగులు చేశాడు. వెస్టిండీస్ బౌలర్లలో టేలర్ 2 వికెట్లు, రస్సెల్ 2 వికెట్లు, స్మిత్, రోచ్ చెరో వికెట్ తీసుకున్నారు.
ఇదిలా వుంటే, ఇప్పటిదాకా వరల్డ్ కప్‌లో టీమిండియా ఏ మ్యాచ్‌నీ కోల్పోకుండా పూల్-బిలో టాప్ ప్లేస్‌కి చేరుకుంది. తాజా పరాజయంతో వెస్టిండీస్ లీగ్ దశను దాటడం ఇక దాదాపుగా కష్టంగా మారింది.