ప్రపంచకప్ విజేత ఇంగ్లండ్ ను ఐర్లండ్ 85 పరుగులకు ఆలౌట్ చేసి సంచలనం రేపింది. ప్రపంచకప్ ను నెగ్గి పది రోజులు అయినా గడవక ముందే ఇంగ్లండ్ ను ఐర్లాండ్ అలా చిత్తు చేసింది. ఏదో గాలివాటంగా ఇంగ్లండ్ ప్రపంచకప్ నెగ్గిందేమో అనే అభిప్రాయాలు కలిగించింది తన ఐర్లాండ్ ధాటితో. కనీసం ప్రపంచకప్ కు అర్హత పొందని ఐర్లండ్ చేతిలో ఇంగ్లండ్ అలా చిత్తు అయ్యింది.
అదే టెస్టు మ్యాచ్ లో ఐర్లండ్ తొలి ఇన్నింగ్స్ లో బాగానే బ్యాటింగ్ చేసింది. ఇంగ్లండ్ మీద నూటా ఇరవై పరుగులకు పైగా ఆధిక్యతను సంపాదించింది. అలా మ్యాచ్ పై పట్టు బిగించినట్టుగానే కనిపించి ఐర్లండ్ ఆట రెండో ఇన్నింగ్స్ లో పారలేదు.
రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ లో ఇంగ్లండ్ కుదురుకుంది. ఐర్లండ్ ముందు మంచి స్థాయి లక్ష్యాన్నే ఉంచింది. అయితే ఐర్లండ్ మాత్రం అతి విశ్వాసానికే పోయిందేమో కానీ రెండో ఇన్నింగ్స్ లో చిత్తు అయ్యింది. కేవలం ముప్పై ఎనిమిది పరుగులకే ఐర్లండ్ ఆలౌట్ అయ్యింది. తమను ఎనభై ఐదు పరుగులకు ఆలౌట్ చేసిన జట్టును ముప్పై ఎనిమిది పరుగులకు ఆలౌట్ చేసి ఇంగ్లంత్ తన సత్తా చూపించింది.