క్రికెటర్ అమిత్ మిశ్రా అరెస్టయ్యాడు. బెంగళూరు పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు, అనంతరం బెయిల్‌పై మిశ్రాని విడుదల చేసినట్లు పోలీసు అధికారి ఒకరు వివరించారు. ఓ మహిళను వేధించిన కేసులో పోలీసులు అమిత్ మిశ్రాని అరెస్ట్ చేశారుగానీ, ఆ మహిళ ఎవరు.? అన్నది ప్రస్తుతానికి సస్పెన్సే.
విషయమేంటంటే మ్యాచ్ సందర్భంగా అమిత్ మిశ్రా తాను బస చేసిన హోటల్లో ఓ మహిళపై దాడి చేశాడు. అసలు ఆ మహిళ, మిశ్రా బస చేసిన హోటల్లోని అతని రూమ్‌కి ఎందుకు వెళ్ళినట్లు.? ఏమోగానీ, 'తొందరపడి పోలీసులకు ఫిర్యాదు చేశాను. ఆ ఫిర్యాదుని వెనక్కి తీసుకుంటాను. ఇకపై మేమిద్దరం మామూలుగానే ఫ్రెండ్స్‌గా వుంటాం..' అని ఆ మహిళ, మిశ్రాపై తొలుత పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరం ఈ నెల 22న చెప్పుకొచ్చింది.
ఏమయ్యిందో, ఈ కేసులో ముందుకు వెళ్ళాలనే అనుకుంటోందట సదరు మహిళ. దాంతో పోలీసులు మిశ్రాని మూడు గంటలపాటు విచారించి, అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. ఆ వెంటనే 'ఇది బెయిలబుల్ కేసు కావడంతో, బెయిల్‌పై విడుదల చేశాం..' అని పోలీసులు చెబుతున్నారు.
క్రికెటర్లకి గర్ల్‌ఫ్రెండ్స్ చాలా సర్వసాధారణమైన విషయం. ఆ గర్ల్‌ఫ్రెండ్స్ తీరు 'ఓవర్'గా మారుతుండడంతోనే ఆటగాళ్ళ ఆట తీరు అటకెక్కుతుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలే టీమిండియా టీ20 సిరీస్, వన్డే సిరీస్ సౌతాఫ్రికాకి సమర్పించేసుకుందన్న ఆవేదనలో భారత క్రికెట్ అభిమానులున్నారు. ఈ టైమ్‌లో క్రికెటర్లు వివాదాల్లో ఇరుక్కుపోవడం వారిని ఇబ్బందుల్లో పడేయడం ఖాయం. బీసీసీఐ సైతం ఈ విషయంలో చాలా సీరియస్‌గా వుందట.