కరుణ్‌ నాయర్‌ ‘డబుల్‌ సెంచరీ’ బాదేశాడు

అయ్యో.. డబుల్‌ సెంచరీ తృటిలో మిస్సయ్యిందే.. అని కేఎల్‌ రాహుల్‌ కన్నా ఎక్కువగా భారత క్రికెట్‌ అభిమానులు బాధపడిపోయారు. నిజమే మరి, ఒకే ఒక్క పరుగు తేడాతో డబుల్‌ సెంచరీ చేజార్చుకోవడమంటే అదెంత బాధాకరం.?…

అయ్యో.. డబుల్‌ సెంచరీ తృటిలో మిస్సయ్యిందే.. అని కేఎల్‌ రాహుల్‌ కన్నా ఎక్కువగా భారత క్రికెట్‌ అభిమానులు బాధపడిపోయారు. నిజమే మరి, ఒకే ఒక్క పరుగు తేడాతో డబుల్‌ సెంచరీ చేజార్చుకోవడమంటే అదెంత బాధాకరం.? ఆ బాధ నుంచి కోలుకోవడానికి కేఎల్‌ రాహుల్‌కి చాలా సమయమే పట్టింది. 

ఇక, కేఎల్‌ రాహుల్‌ డబుల్‌ సెంచరీని చేజార్చుకున్నా, అదే మ్యాచ్‌లో మరో భారత బ్యాట్స్‌మెన్‌ డబుల్‌ సెంచరీని అందుకోవడం గమనార్హం. టెస్టుల్లో తొలి సెంచరీని నమోదు చేసిన కరుణ్‌ నాయర్‌, దాన్ని డబుల్‌ సెంచరీగా మలచడం గమనార్హం. చెన్నయ్‌లో ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న టెస్ట్‌ మ్యాచ్‌లో ఈ అద్భుతం చోటుచేసుకుంది. 

'ఓ పాతిక నుంచి 50 పరుగులు చేస్తే గొప్ప..' అన్న అంచనాలే వున్నాయి కరుణ్‌ నాయర్‌పైన ఈ మ్యాచ్‌కి ముందు. కానీ, ఆ అనుమానాల్ని పటాపంచలు చేస్తూ కరుణ్‌ నాయర్‌ అర్థ సెంచరీ కొట్టడం, దాన్ని సెంచరీగా మలచడం, చకచకా 150 పరుగుల మార్క్‌ని చేరుకోవడం, చివరికి డబుల్‌ సెంచరీ సాధించేయడం జరిగిపోయాయి. 

ఇదిలా వుంటే, ఈ మ్యాచ్‌లో మరోసారి అశ్విన్‌ చెలరేగిపోయాడు. సొంతగడ్డ మీద చెలరేగిపోయిన అశ్విన్‌ కెరీర్‌లో మరో అర్థ సెంచరీని నమోదు చేశాడు. కరుణ్‌ నాయర్‌, అశ్విన్‌ ధాటికి ఇంగ్లాండ్‌ బౌలర్లు చేతులెత్తేశారు. ఇప్పటికే 100 పరుగులకు పైగా ఆధిక్యం సాధించిన టీమిండియా, 250 పరుగుల పైన ఆధిక్యం సాధించగలిగితే మాత్రం, మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై విజయం సాధించేందుకు మార్గం సుగమం అవుతుంది.