Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఎన్టీఆర్ కోసం క్రిష్ కథ

ఎన్టీఆర్ కోసం క్రిష్ కథ

తన సినిమాలతో తనేంటో ప్రూవ్ చేసుకుంటూ వస్తున్న డైరక్టర్ క్రిష్. శాతకర్ణి ట్రయిలర్ తో మొత్తం ఇండస్ట్రీ చూపులను తన వైపు తిప్పుకున్నాడు. పక్కా ప్లానింగ్ తో చకచకా సినిమాలు చేసే క్రిష్ తన తరువాత సినిమా గురించి కూడా ఆలోచన మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. శాతకర్ణి పోస్ట్ ప్రొడక్షన్ పై బిజీగా వుంటూనే, ఓ మాంచి లైన్ ఆలోచించి పెట్టుకున్నాడు ఆయన. 

ఆ లైన్ మరెవరి కోసమో కాదు, జనతాగ్యారేజ్ లాంటి హిట్ కొట్టిన ఎన్టీఆర్ కోసం. శాతకర్ణి హడావుడి ముగిసిన తరువాత ఎన్టీఆర్ ను కలిసి లైన్ వినిపించాలని క్రిష్ అనుకుంటున్నారు. ఎన్టీఆర్ ప్రస్తుతం బాబీ సినిమా పని మీద వున్నారు. జూన్ ఎండ్ నుంచి త్రివిక్రమ్ సినిమా చేస్తారు.

 క్రిష్ కూడా శాతకర్ణి తరువాత కొన్నాళ్లు ముంబయ్ వెళ్లి వస్తారు. ఆయనకు అది అలవాటు కూడా. సో, అన్నీ సెట్ అయితే 2018లో క్రిష్-ఎన్టీఆర్ కాంబినేషన్ వుండొచ్చు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?