ధోనీ భార్య సాక్షి సింగ్ ధోనీకి ఇన్ స్టాగ్రమ్ లో మరీ బీభత్సమైన ఫాలోయింగ్ ఏమీ లేదు. అయితే ఆమె పోస్టు చేసిన ఒక ఫొటో మాత్రం ఇంటర్నెట్ కాస్త లేటుగా వైరల్ అవుతూ ఉంది. అది వాళ్ల బెడ్రూమ్ ఫొటో!
ఈ మధ్యకాలంలో చాలా మంది సెలబ్రిటీలు బెడ్రూమ్ లో కెమెరాలను బాగా వాడుతున్నట్టుగా ఉన్నారు. అక్కడ తామేం చేస్తున్నది కూడా ఫొటోల రూపంలో చెబుతున్నారు. ఈ క్రమంలో సాక్షి ఈ ఫొటోను పోస్టు చేసింది.
భర్త అటెన్షన్ ను గ్రాబ్ చేయడానికి తను పడుతున్న పాట్లుగా ఈ ఫొటోకు క్యాప్షన్ ను పెట్టింది ఆమె. ఇంటర్నెట్ కు ఈ రొమాంటిక్ పిక్ భలే నచ్చినట్టుగా ఉంది. ఒకవైపు ధోనీ కెరీర్ గురించి క్రికెట్ పండిట్లు తలలు బద్ధలు కొట్టుకునే వాదనలు చేస్తూ ఉన్నారు.
ధోనీ కెరీర్ అయిపోయిందని, అతడు తన ఆఖరి ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడేశాడని, శ్రీనివాసన్ తో ఉన్న సాన్నిహిత్యంతో చెన్నై టీమ్ కు మాత్రం ధోనీ వృద్ధుడయ్యేంత వరకూ ఆడే అవకావాలున్నాయని.. ఇలా సాగుతున్నాయి ఆ విశ్లేషణలు. వారు ఆ పనిలో ఉంటే.. ధోనీ ఇలా భార్య ఒడిలో సేదతీరుతున్నాడు! మిస్టర్ కూల్!