సెమీస్‌లో సౌతాఫ్రికాకి వరుణుడు దెబ్బ కొట్టాడు. ఆదిలోనే వికెట్లు కోల్పోవడంతో జాగ్రత్తగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా, చివరి 15-20 ఓవర్లను సద్వినియోగం చేసుకోవాలనుకుంది. అయితే ఇక్కడే సరిగ్గా వరుణుడు సౌతాఫ్రికాను ఇబ్బంది పెట్టాడు. 38 ఓవర్ల వద్ద 216 పరుగులతో స్టడీగా వున్న సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌కి వర్షం ఆటంకం కలిగించింది. మంచి దూకుడు మీదున్న డివిలియర్స్, వర్షం దెబ్బతో ఉస్సూరుమన్నాడు.
వర్షం తేరుకున్నాక మ్యాచ్‌ని 43 ఓవర్లకు కుదిస్తున్నట్లు ప్రకటించారు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్ ముగిశాక, టార్గెట్‌ని డక్‌వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం నిర్ణయించనున్నారు. ఈ స్థితిలో సౌతాఫ్రికా ఎంత భారీ స్కోర్ చేయగలుగుతుంది.? అన్నది చర్చనీయాంశంగా మారింది. కీలక మ్యాచ్‌లకు వర్షం ఇబ్బంది కలిగించడంతో గెలుపోటములు ఒక్కసారిగా తారుమారైపోతుంటాయి.
మరోపక్క వర్షం ఆటకు అంతరయం కల్గించడం న్యూజిలాండ్‌కి మేలు చేసేదే. మెక్ కల్లమ్, గుప్టిల్ మంచి ఫామ్‌లో వున్నారు. వీరిద్దరూ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడితే, ఎంత టార్గెట్‌ని అయినా తక్కువ ఓవర్లలోనే న్యూజిలాండ్ ఛేదించే అవకాశం వుంటుందని విశ్లేషకులు అభిప్రాయపడ్తున్నారు.