టీమిండియా వృద్ధాప్యంతో క‌నిపిస్తోంది!

రోహిత్ శ‌ర్మ వ‌య‌సు 35 సంవ‌త్స‌రాలు, విరాట్ కొహ్లీ వ‌య‌సు 34 యేళ్లు… ఇంకా ర‌విచంద్ర‌న్ అశ్విన్ వ‌య‌సు 36. మ‌హ్మ‌ద్ ష‌మీ వ‌య‌సు 32. కేఎల్ రాహుల్ వ‌య‌సు 30. హార్ధిక్ పాండ్యా…

రోహిత్ శ‌ర్మ వ‌య‌సు 35 సంవ‌త్స‌రాలు, విరాట్ కొహ్లీ వ‌య‌సు 34 యేళ్లు… ఇంకా ర‌విచంద్ర‌న్ అశ్విన్ వ‌య‌సు 36. మ‌హ్మ‌ద్ ష‌మీ వ‌య‌సు 32. కేఎల్ రాహుల్ వ‌య‌సు 30. హార్ధిక్ పాండ్యా వ‌య‌సు 29. ఛ‌తేశ్వ‌ర్ పూజారా వ‌య‌సు 34. ర‌హ‌నేకు కూడా 34. ర‌వీంద్ర జ‌డేజాకు 33, భువ‌నేశ్వ‌ర్ కు 32! 

బీసీసీఐ కాంట్రాక్టుల్లో పై వ‌ర‌స‌లో ఉన్న ఆట‌గాళ్ల వ‌య‌సులు ఇవి. ఒక్క‌సారిగా టీమిండియా వృద్ధాప్యంతో క‌నిపిస్తూ ఉంది. టీ20 ప్ర‌పంచ‌క‌ప్ లో మ‌రోసారి తిరుగుముఖం త‌ర్వాత మ‌నోళ్లు కాగితపు పులులు అనేమాట చాన్నాళ్ల‌కు వినిపిస్తూ ఉంది. మామూలుగా ఐపీఎల్ లో భార‌త ఆట‌గాళ్లు అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌లు చేస్తూ ఉంటారు. అంత‌ర్జాతీయ వేదిక మీదే అట్ట‌ర్ ఫ్లాప్ అవుతూ ఉన్నారు.

ఒక‌వైపు ఐపీఎల్ లో అద‌రగొట్టే యువ ఆట‌గాళ్ల‌కు కాకుండా.. అంత‌ర్జాతీయ వేదిక మీద వేరే వాళ్ల‌కు అవ‌కాశాలు ల‌భిస్తూ ఉంటాయి. ఒక్క మ్యాచ్ లో వీళ్లు ముప్పై న‌ల‌భై ర‌న్నులు కొట్ట‌గానే.. మీడియా, అభిమానులు ఆహా..ఓహో.. అంటారు! ఆ తర్వాత అంతే సంగ‌తులు.

కొహ్లీ మ‌ళ్లీ ఫామ్ లోకి వ‌స్తే వ‌చ్చి ఉండొచ్చు.. ఇంకెన్నేళ్లు కొహ్లీ కెరీర్ ను కొన‌సాగించ‌గ‌ల‌డు! మ‌హా అంటే.. రెండు మూడేళ్లు! రోహిత్ ఫామ్ ను బ‌ట్టి చూస్తే.. రెండేళ్లు కూడా క‌ష్టంలాగుంది! ఎప్పటి నుంచినో రోహిత్ ఆడుతున్నాడు. ఇంకెన్నేళ్లు ఆడ‌గ‌ల‌డు? ఇక స్పిన్ విష‌యంలో అశ్విన్ కు మించి దిక్కులేదా! 30 యేళ్లు దాటేసిన రాహుల్ ఇంకా భావి ఆశాకిర‌ణ‌మే బీసీసీఐ దృష్టిలో!

టెస్టుల విష‌యంలో కూడా పుజారా, ర‌హ‌నేల కెరీర్ లు చివ‌రి నెల‌ల్లో ఉన్న‌ట్టున్నాయి. వారి ఫామ్ పేల‌వంగా ఉంటోంది. అయితే బీసీసీఐ మాత్రం వ‌చ్చే కాసుల‌ను చూస్తుంది, ఐపీఎల్ ద్వారా వ‌చ్చే ఆదాయాన్ని లెక్క‌బెట్టుకోవ‌డంలో బిజీగా ఉంటుంది. గ‌త వాడి కోల్పోయిన ఆస్ట్రేలియాలో రెండు సార్లు టెస్టు సీరిస్ నెగ్గ‌డ‌మే.. గ‌త ద‌శాబ్ద‌కాలంలో భార‌త జ‌ట్టు సాధించిన అద్భుతం అనే విష‌యాన్ని క‌న్వీన్సింగ్ గా అభిమానులు కూడా మ‌రిచిపోయేలా చేయ‌డంలో మాత్రం బీసీసీఐ విజ‌య‌వంతం అవుతోంది.