టీమిండియా ఇంటికి.. వెస్టిండీస్‌ ఫైనల్స్‌కి

విరాట్‌ కోహ్లీ వీర బాదుడు బాదినా ఉపయోగం లేకుండా పోయింది. ఓపెనర్లు మంచి బిగినింగ్‌ ఇచ్చినా అదీ వృధానే అయ్యింది. బౌలర్లు టీమిండియాని నిండా ముంచేశారు. చివరి ఓవర్‌ ఎవరితో వేయించాలో తెలియని డైలమాలో…

విరాట్‌ కోహ్లీ వీర బాదుడు బాదినా ఉపయోగం లేకుండా పోయింది. ఓపెనర్లు మంచి బిగినింగ్‌ ఇచ్చినా అదీ వృధానే అయ్యింది. బౌలర్లు టీమిండియాని నిండా ముంచేశారు. చివరి ఓవర్‌ ఎవరితో వేయించాలో తెలియని డైలమాలో కెప్టెన్‌ ధోనీ పడిపోయాడంటే, బౌలింగ్‌ టీమిండియాని ఎంతగా సెమీస్‌లో భయపెట్టిందో అర్థం చేసుకోవచ్చు. 

వెస్టిండీస్‌తో జరిగిన సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో టీమిండియా ఓటమి చవిచూసింది. ఇంకేముంది, టీ20 వరల్డ్‌ కప్‌ నుంచి సెమీస్‌లో టీమిండియా నిష్క్రమించింది. టీమిండియాని ఇంటికి పంపి, వెస్టిండీస్‌ ఫైనల్‌లోకి అడుగుపెట్టింది. ఫైనల్‌ మ్యాచ్‌లో వెస్టిండీస్‌, ఇంగ్లాండ్‌తో తలపడనుంది. 

టాస్‌ గెలిచిన వెస్టిండీస్‌, టీమిండియాని బ్యాటింగ్‌కి దించింది. ఆరంభం అదుర్స్‌.. మిడిల్‌ ఆర్డర్‌ అదుర్స్‌.. వెరసి టీమిండియా 20 ఓవర్లలో 192 పరుగులు చేసింది. 193 పరుగుల విజయలక్ష్యాన్ని 2 బంతులు మిగిలి వుండగానే వెస్టిండీస్‌ ఛేదించింది. ఏ దశలోనూ టీమిండియా, వెస్టిండీస్‌ బ్యాట్స్‌మెన్‌ని నిలువరించలేకపోయింది. బ్యాటింగ్‌ మొదలు పెట్టినప్పటినుంచీ వెస్టిండీస్‌, భారత బౌలర్లపై ఆధిపత్యం చెలాయిస్తూనే వచ్చింది. సిమ్మన్స్‌ 51 బంతుల్లో 83 పరుగులు చేసి వెస్టిండీస్‌ని సెమీస్‌కి చేర్చాడు. 

ఇక, టీమిండియా విషయానికొస్తే విరాట్‌ కోహ్లీ టాప్‌ స్కోరర్‌. కేవలం 47 బంతుల్లోనే 89 పరుగులు చేసిన విరాట్‌, బౌలింగ్‌ కూడా చేసి ఓ వికెట్‌ తీశాడు. చివరి ఓవర్‌ కూడా కోహ్లీనే వేశాడు. కోహ్లీ బాల్‌తోనూ అద్భుతం చేస్తాడని అంతా అనుకున్నారుగానీ, వెస్టిండీస్‌ బ్యాట్స్‌మెన్‌ ఆ ఛాన్స్‌ ఇవ్వలేదు. టీమిండియా మెయిన్‌ స్పిన్నర్‌ అశ్విన్‌ కేవలం 2 ఓవర్లే వేయడం గమనార్హమిక్కడ.