పెద్ద సినిమా వచ్చిందంటే చాలు ఆంధ్రలో యూనిఫార్మ్ రేటు, స్పెషల్ షో లు రెడీ అయిపోతాయి. ఏదో సేవాసంస్థ ముసుగులు బెనిఫిట్ షో లు సిద్దం అవుతాయి. ఇక చిన్న పట్టణాలు, పల్లెటూర్లు అన్నింటా ఒకటే టికెట్ ధర వుంటుంది.
ముఫై అయినా, యాభై అయినా, ఇంకేదైనా వంద రూపాయిలు టికెట్ ఫిక్స్ అయిపోతుంది. ఇది చాలా చోట్ల అనఫిషియల్ గానే జరుగుతుంది. రెవెన్యూ, పోలీస్ జనాలకు మామూళ్లు, టికెట్ లు ఇచ్చి, బయ్యర్లు మేనేజ్ చేసుకుంటారు. దాంతో కలెక్షన్ల ఫిగర్లు కళ్లు తిరిగేలా వుంటాయి. సర్దార్ సినిమా విషయంలో కూడా ఈ యూనిఫారమ్ రేట్ తప్పడం లేదని తెలుస్తోంది.
అయితే హీరో పవన్ కళ్యాణ్ మాత్రం, నిర్మాత ద్వారా బయ్యర్లు, ఎగ్జిబిటర్లకు ఈ విషయమై కొన్ని సూచనలు ఇచ్చాడని వార్తలు వినిపిస్తున్నాయి. అనఫిషయల్ గా కాకుండా, స్పెషల్ మూవీ, హెవీ బడ్జెట్ అన్నకారణాల మీద పర్మిషన్ కు అప్లయ్ చేసి, ఆ తరువాత రేట్లు పెంచుకోమని చెప్పినట్లు తెలుస్తోంది. అంతే కానీ అనఫిషియల్ గా మాత్రం వంద రూపాయిల రేటు పెట్టవద్దని చెప్పాడట.
పవన్ సినిమా అంటే తెలుగుదేశం ప్రభుత్వం మాత్రం ఎందుకు అడ్డం పడుతుంది. పర్మిషన్ రావడం పెద్ద కష్టం కాదు. బహుశా ఆ ఉద్దేశంతోనే కావచ్చు పవన్ పర్మిషన్ తీసుకుని, యూనిఫారమ్ రేటు పెట్టమని సూచించి వుండొచ్చు.