సర్దార్ డైలాగులు సూపరంట

ఉరుము లేని పిడుగులా సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా సెన్సారు పూర్తి చేసుకుంది. ఒక పాట మినహా అంతా సెన్సారుకు అందించారు. సెన్సారు టాక్ బయటకు వచ్చింది. దాని ప్రకారం సినిమా ఫస్ట్ హాఫ్…

ఉరుము లేని పిడుగులా సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా సెన్సారు పూర్తి చేసుకుంది. ఒక పాట మినహా అంతా సెన్సారుకు అందించారు. సెన్సారు టాక్ బయటకు వచ్చింది. దాని ప్రకారం సినిమా ఫస్ట్ హాఫ్ ఓ రేంజ్ లో వుంది. సెకండాఫ్ మధ్య కొద్దిగా డల్ అయినా ప్రీ క్లయిమాక్స్ నుంచి మళ్లీ పుంజుకుంది. సినిమాలో రెండు విషయాలు సూపర్ అంటూ టాక్ వినిపిస్తోంది.. ఒకటి పవన్ కళ్యాణ్ లుక్. పాటల్లో చాలా బాగున్నాడంటూ వార్తలు వినవస్తున్నాయి. 

ఇక ఆడియో బయట అంత పాజిటివ్ బజ్ తెచ్చుకోకున్నా, సినిమాలో బాగానే వున్నాయట. ఇక బాగా వినిపిస్తున్న మరో సంగతి ఏమిటంటే, సినిమాలో డైలాగులు సూపర్ అంటే సూపరంట. డైలాగులపై పవన్ చాలా శ్రద్ధ తీసుకున్నారు. బుర్రా సాయి మాధవ్ చేత రాయించుకోవడమే కాకుండా, తాను స్వయంగా బాగా కసరత్తు చేసారని వినికిడి. ఆ ఫలితం ఇప్పుడు దక్కబోతోందని అంటున్నారు.

పవన్ సినిమా ఏవరేజ్ అంటేనే బాక్సాఫీస్ దగ్గర దూసుకు పోతుంది. మరి ఈ మాత్రం టాక్ వుంటుందీ అన్నది పక్కా అయితే ఇక బయ్యర్లకు కాసుల పంటే. ఇప్పటికే అంచనాలు బాగా పెరిగిపోయాయి. ఇప్పుడు సెన్సారు టాక్ బాగా స్ప్రెడ్ కావడంతో ధియేటర్ల వారీ రేట్లు మరీ పెరిగిపోయేలా వున్నాయి.