విరాట్ కొహ్లీ ఆలోచనా స్థాయి ఇంత అథమమా!

అయిపోయిన వ్యవహారాన్ని కోరి కెలుక్కొన్నట్టున్నాడు విరాట్ కొహ్లీ. ప్రపంచకప్ సెమిఫైనల్ లో తన ఫెయిల్యూర్ కు కారణంగా తన గర్ల్ ఫ్రెండ్ అనుష్క శర్మను కొంతమంది నిందించడంపై టీమిండియా వైస్ కెప్టెన్ కు కోపం…

అయిపోయిన వ్యవహారాన్ని కోరి కెలుక్కొన్నట్టున్నాడు విరాట్ కొహ్లీ. ప్రపంచకప్ సెమిఫైనల్ లో తన ఫెయిల్యూర్ కు కారణంగా తన గర్ల్ ఫ్రెండ్ అనుష్క శర్మను కొంతమంది నిందించడంపై టీమిండియా వైస్ కెప్టెన్ కు కోపం వచ్చింది. అది కూడా చాలా లేటుగా! తను హర్ట్ అయ్యానని.. అంటూ మీడియా మీద, అనుష్కను నిందిచిన వారి మీద విరాట్ విరుచుకుపడ్డాడు.

మరి విరాట్  అనుష్కను వెనకేసుకురావడం వరకూ బాగానే ఉంది కానీ.. ఈ ప్రక్రియలో తనను తాను పొగుడుకోవడం.. తనకన్నా తోపు లేడని  చెప్పుకోవడం సిల్లీగాఉంది. ఇంతకీ విరాట్ ఏమన్నాడంటే.. “గత ఐదేళ్ల నుంచి భారత జట్టుకు అత్యంత నిలకడగా ఆడుతూ విజయాలను అందిస్తున్నాను.. ఈ విషయం లో వేరే ఆటగాడు ఎవరైనా నాకు పోటీగా ఉన్నాడేమో చూపండి..అలాంటిది నేను ఒక్క మ్యాచ్ లో సరిగా ఆడకపోతే ఇన్ని విమర్శలా..'' అని వ్యాఖ్యానించాడు.

మరి ఇంతకు మించిన సొంత డబ్బా మరోటి ఉండదు! క్రికెట్ అనేది టీమ్ గేమ్.. ఒకరు రాణింపుతో ఏ రోజూ టీమ్ గెలవదు! అలాంటి ఐదేళ్ల నుంచి తనే పొడిచేస్తున్నానని విరాట్ చెప్పుకొన్నాడు. ఏ రిటైరైన ఆటగాడో ఇలా చెప్పుకొంటే అదో మచ్చట. అయితే తనకు పోటీ గా వచ్చే ఆటగాళ్లు జట్టులోనే ఎవరూ లేరని విరాట్ వ్యాఖ్యానించడం మరో సిల్లీ పాయింట్. ప్రత్యేకించి రేపోమాపో జట్టుకు కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించాల్సిన దశలో ఉన్న విరాట్ ఇలా నా కన్నా తోపు టీమ్ లో ఎవరూ లేరని అనడం అతడి ఆటిట్యూడ్ కు నిదర్శనం.

మాట్లాడకూడని అంశం గురించి.. మాట్లాడకూదని దశలో.. మాట్లాడ కూడదని రీతిలో మాట్లాడాడు విరాట్ కొహ్లీ. ఇండియన్ క్రికెట్ లో స్టార్లుగా వెలుగొందిన వారు ఎంతోమంది ఉన్నారు. అలాంటివారు కూడా ఎప్పుడూ తమ వల్లనే జట్టు గెలిచేస్తోందని.. తమకన్నా తోపు లేడని ఎప్పుడూ మాట్లాడలేదు. 

కెప్టెన్ గా ఇండియన్ ప్లేయర్ల ఆటిట్యూడ్ మార్చిన గంగూలీ కూడా జట్టులోంచి స్థానం కోల్పోయి.. మళ్లీ దేశవాళీ మ్యాచ్ ఆడి జట్టులోకి వచ్చాడు. ద్రావిడ్ వంటి ఆటగాడికి కూడా ఇబ్బందులు తప్పలేదు.. సచిన్ కూడా జట్టులో స్థానం కోసం ఎప్పటికప్పుడు తనను తాను నిరూపించుకోవాల్సి వచ్చింది. అలాంటి ఆటగాళ్ల నుంచి విరాట్ చాలా నేర్చుకోవాలి. 

వాళ్లెవ్వరూ దశాబ్దాల కెరీర్ లో తమకు తామే గొప్ప అని వ్యాఖ్యానించిన దాఖలాలు వెదికినా కనపడవు. వాళ్ల ఆటిట్యూడ్ లో అలాంటి తీరే కనిపించదు. విరాట్ వాళ్ల నడవడికను చూసి అలాంటివి నేర్చుకోవాలి. విరాట్ లా మాట్లాడే ఆటగాడికి కెప్టెన్ అయ్యేఅర్హత ఉండదు. ఒకవేళ అయినా.. అందరినీ కలుపుకుపోయే తత్వం ఉండదు. 
ఫెయిల్యూర్ తనదే బాధ్యత అనేవాడు.. విజయంలో సహచరులకు వాటా ఇచ్చేవాడే నాయకుడు. 

అంతే కానీ.. నాకన్నా పోటుగాడు ఎవరూ లేడనుకొనేవాడు జట్టును నడపలేడు. కాబట్టి విరాట్ తీరును గమనించి.. ఇతడికి భవిష్యత్తు బాధ్యతలు అప్పగించడం గురించి సెలెక్టర్ ఆలోచించుకొంటే అది జట్టుకే మంచిదేమో!