ఒక పంజాబీ సిక్కు కుటుంబంలో పుట్టాడు యువరాజ్. అయితే మిగతా సిక్ యువకుల్లా సంప్రదాయ బద్ధంగా కనిపించడు. పంజాబీ సిక్ కుటుంబాల నుంచి వచ్చిన క్రీడాకారులు సిద్ధూ, హర్భజన్, సోదీ.. ఇతరుల తీరున కాకుండా యువరాజ్ ఎప్పుడూ క్లీన్ షేవ్ తో, తలపాగా లేకుండా కనిపిస్తాడు. దీంతో ఇతడు సిక్ కాదు.. హిందూ అని వాదించే వాళ్లూ ఉన్నారు.
అయితే వివాహంలో మాత్రం యువీ పూర్తి సంప్రదాయ బద్ధంగా కనిపించాడు. సిక్ లు ధరించే తలపాగాతో గడ్డం పెంచుకుని పెళ్లి కొడుకయ్యాడు యువీ. వీరి పెళ్లి కూడా సిక్కుల సంప్రదాయ బద్ధంగా జరిగింది. ప్రీ వెడ్డింగ్ సెర్మనీకి భారతీయ క్రికెటర్లు హాజరు అయ్యారు. వివాహానికి మాత్రం యువీ కుటుంబీకులు, మత పెద్దలు హాజరయ్యారు.
మత పెద్దలు ఈ కార్యక్రమానికి హాజరవుతారు.. సంప్రదాయాలను పాటిస్తున్నారు.. అంటూ యువీ తండ్రి, మాజీ క్రికెటర్ యోగరాజ్ పెళ్లికి హాజరు కాలేదు. తను దేవుడిని నమ్ముతాను అని సంప్రదాయాలను, పూజారాలను కాదని ఆయన స్పష్టం చేశాడు. యువీ వివాహా రిషెప్షన్ గ్రాండ్ గా జరగనుంది. దానికి యోగరాజ్ హాజరవుతాడట. అలాగే ప్రధానమంత్రి మోడీతో సహా అనేక మంది యువీ ఆహ్వానించాడు. వారు కూడా రిషెప్షన్ కు హాజరయ్యే అవకాశం ఉంది.