ప్రభుత్వాలు ఎంత కఠినంగా చర్యలు తీసుకుంటున్నా, లోన్ యాప్ జోలికి వెళ్లకండి అంటూ ప్రచారం చేస్తున్నా జనాలు పాటించుకోకుండా చివరికి ప్రాణాలు బలి తీసుకుంటున్నారు. లోన్ యాప్ టార్చర్ రోజు రోజుకు ఎక్కువుతోంది. రోజుకు ఎక్కడో చోట యాప్ వల్ల జనాలు బలి అవుతూనే ఉన్నారు.
తాజాగా నంద్యాలో బీటెక్ చదువుతున్న యువకుడు లోన్ యాప్ టార్చర్ వల్ల అత్మహత్య చేసుకున్నారు. వీరేంద్ర అనే బీటెక్ చదువుతున్న విద్యార్ధి ఆవసరనికి లోన్ యాప్ లో డబ్బులు తీసుకొని సరైన టైంలో కట్టలేకపోవడంతో.. లోన్ యాప్ సంస్ధ తన ఫోన్ లో ఉన్న స్నేహితులను, బంధువులకు వీరేంద్ర ఫోటోను మార్పింగ్ చేసి చేడుగా ప్రచారం చేయడంతో అవమానంగా ఫిల్ అయి అత్మహత్య పాల్పడ్డారు
వీరేంద్ర ఫోటోను మార్పింగ్ చేసి తన స్నేహితులకు.. 'ఈ వ్యక్తి మా యాప్ లో లోన్ తీసుకొని చెల్లించలేదు. మీ నెంబర్స్ రిఫరెన్స్ ఇచ్చారు కాబట్టి మీరు లోన్ ను తిరిగి చెల్లించాలి లేదంటే మిమ్మల్ని పోలీసులు ఆరెస్ట్ చేస్తారు' అంటూ తన స్నేహితులకు మెసేజ్ లు పంపించడంతో అవమానంగా భావించిన వీరేంద్ర ఇంట్లో ఉరేసుకొని అత్మహత్య పాల్పడ్డారు.
ఇకనైనా ప్రభుత్వాలు లోన్ యాప్ లపై కఠినంగా వ్యవహరించి అడ్డుకట్ట వేయాకపోతే లోన్ యాప్ లు రోజు జనాల ప్రాణాలతో చెలగాటం అడుతునే ఉంటాయి.