జనాభాలో దాదాపు 40శాతం యువతను కలిగిన భారత్లో లైంగిక విజ్ఞానం విషయంలో చాలా దారుణమైన పరిస్థితి ఉందని అంటున్నారు అధ్యయనకర్తలు. ఈ యువతీ యువకులు లైంగిక జ్ఞానం పెంపొందించుకుంటున్న విధానమే తప్పు అని వారు చెబుతున్నారు. భారత్లో ఇప్పుడు స్మార్ట్ఫోన్ల వినియోగం విస్తతం అయ్యిందని, ఇంటర్నెట్ అనుసంధానమైన ఈ ఫోన్లతో యువత.. తమ లైంగికాస్తులను ప్రదర్శిస్తున్న విధానం ఆందోళకరంగా ఉందని వివరించారు. భారత్లోని యువతకు లైంగిక విజ్ఞానం పెంపొందించుకోవడానికి కేవలం పోర్నోగ్రఫీనే మార్గం అవుతోందని అధ్యయనకర్తలు ప్రధానంగా ఆందోళన వ్యక్తం చేస్తున్న అంశం. క్యూజెడ్ డాట్కామ్లో ప్రచురితమైన అధ్యయనం ఇది.
లైంగిక సంబంధ విషయాలను చర్చించడం ఇండియాలో అప్రకటిత నిషేధం. అదోపాపం. ఎంతమంది పిల్లలు తమ తల్లిదండ్రుల దగ్గర తమ సందేహాలను వ్యక్తం చేయగలరు? ఎంతమంది తల్లిదండ్రులు ఈ విషయం పిల్లల దగ్గర ఫ్రీగా మసలుకోగలరు? ఇక పాఠశాలల్లో లైంగిక విద్యను తప్పనిసరి చేయాలనే మాట.. మాటగానే మిగిలిపోతోంది. స్కూళ్లలో లైంగిక పాఠాలంటే.. వాటిని ఏదో రసవత్తరంగా రాయమని చెప్పడం లేదు. అయితే ప్రాథమిక జ్ఞానాన్ని అందించడం మాత్రం కుటుంబం, సమాజం యొక్క విధి.. అని అధ్యయనకర్తలు చెబుతున్నారు.
ఈ విషయాల్లో చెప్పే వాళ్లు ఎవరూలేరు. దీంతో.. ఇంటర్నెట్ మీద పడుతున్నారు. పోర్న్ చూడటం.. టీనేజర్లకు గైడెన్స్ అవుతోంది.. లైంగిక సంబంధ విషయాల్లో అనేక అపోహలను కలిగిన వారు, పోర్న్ అంతా నిజం.. అనే ప్రమాదంలో పడుతున్నారు.. అని ఈ వైధ్య పరిశోధకులు వివరించారు.
అవగాహన లేకపోవడం మొదటి ప్రమాదం అయితే.. అపోహలు ఏర్పడటం, పోర్న్ ప్రభావం పడటం.. మరో రకమైన ప్రమాదం అని వీరు విశ్లేషిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మార్పు అవశ్యం అని హెచ్చరిస్తున్నారు. ఇక ఆరోగ్య సమస్యల గురించి ఆన్లైన్లో డాక్టర్లను కన్సల్ట్ అవుతున్న వారి గురించి గణాంకాలు కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. ఇక్కడ వ్యక్తం అవుతున్న సందేహాల్లో.. ప్రధానమైనవి లైంగిక సంబంధ సమస్యల గురించినేనట. ఇతర మానసిక, శారీరక ఆనారోగ్యాల గురించి కన్నా.. లైంగిక సంబంధ సమస్యల గురించే ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయట.