ఐపీఎల్ లో ఆటగాళ్ల వేలం ప్రక్రియ మరోసారి కోట్ల రూపాయల పందేరంగా నిలిచింది. యువ ఆటగాళ్ల కొనుగోలుకు ప్రాంచైజ్ లు పోటీలు పడ్డాయి. కోట్ల రూపాయలకు వేలంపాటలో ఆటగాళ్లను సొంతం చేసుకున్నాయి. ఈసారి కూడా సంచలన ధరలు నమోదయ్యాయి ఐపీఎల్ వేలంలో.
గత పర్యాయం భారీ ధర పలికి ఆశ్చర్యపరిచిన ఇండియన్ ప్లేయర్ జయదేవ్ ఉనాద్కత్, ఆ సీజన్లో అంత గొప్ప ప్రదర్శన చేయకపోయినా.. ఈసారి కూడా భారీ ధర పలకడం విశేషం. ఇతడిని ఎనిమిది కోట్ల రూపాయల నలభై లక్షలకు రాజస్తాన్ రాయల్స్ సొంతం చేసుకుంది. గత సీజన్ కన్నా ఇతడి ధర తగ్గినా ఇదీ భారీ మొత్తమే.
ఇక ఇంగ్లండ్ ఆల్ రౌండర్ కుర్రాన్ ఈ సారి మరో సంచలనంగా నిలిచాడు. ఇతడు ఏడు కోట్ల రూపాయల ఇరవై లక్షల రూపాయలకు అమ్ముడయ్యాడు. ఈ యంగ్ ఆల్ రౌండర్ ను పంజాబ్ జట్టు సొంతం చేసుకుంది.
కొలిన్ ఇన్ గ్రమ్ ను ఆరుకోట్ల నలభైలక్షల రూపాయలకు ఢిల్లీ జట్టు సొంతం చేసుకుంది. ఇరవై లక్షల రూపాయల బేస్ ప్రైస్ నుంచి ఎనిమిది కోట్లా నలభై లక్షల రూపాయల స్థాయికి వెళ్లాడు వరుణ్ చక్రవర్తి అనే యంగ్ ఇండియన్ ప్లేయర్.
ఇదే కేటగిరిలోని శివం దుబే ఐదుకోట్ల రూపాయల ధర పలికాడు. మోహిత్ శర్మ, అక్షర్ పటేల్, కార్లోస్ బ్రాత్ వైట్ లు ఐదుకోట్ల రూపాయల చొప్పున పలికారు. తెలుగు కుర్రాడు హనుమ విహారిని రెండుకోట్ల రూపాయల మొత్తంతో ఢిల్లీ జట్టు సొంతం చేసుకుంది.
ఇంకా పలువురు ఆటగాళ్లు రికార్డు స్థాయి ధరలకు అమ్ముడయ్యారు. విశేషం ఏమిటంటే.. ఐపీఎల్ ఆరంభ సీజన్లలో ఒక వెలుగు వెలిగిన యువరాజ్ సింగ్, డేల్ స్టెయిన్, మెక్ కల్లమ్, గప్టిల్, షాన్ మార్ష్,మనోజ్ తివారీ… వంటి ఆటగాళ్లను కొనుగోలు చేయడానికి ప్రాంచైజ్ లు ముందుకు రాకపోవడం.
సాయి పల్లవి మీద వచ్చేవన్నీ రూమర్స్.. శర్వా సర్టిఫికెట్
పోర్న్ నిషేధం.. స్త్రీ వాదుల నుంచి వ్యతిరేకత! చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్