Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

స్పీచ్ ఇచ్చి ప్రశ్నలు మిగిల్చిన బన్నీ

స్పీచ్ ఇచ్చి ప్రశ్నలు మిగిల్చిన బన్నీ

అల్లు అర్జున్ ప్రసంగాలు భలేగా ఉంటాయి. ఒక్కోసారి అతడ్ని చూస్తే పెద్ద మేధావిలా కనిపిస్తాడు. మరోసారి అల్లరిచిల్లరగా ఉంటాయి అతడి ప్రసంగాలు. నిన్న జరిగిన ఓ కార్యక్రమంలో కూడా ఇలానే మాట్లాడాడు బన్నీ. ఓసారి పెద్దమనిషిలా, మరోసారి ఆకతాయిలా ప్రవర్తించాడు. పడి పడి లేచే మనసు ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో ఇలా తనలోని అపరిచితుడ్ని ప్రేక్షకులకు పరిచయం చేశాడు బన్నీ. ఈ సందర్భంగా కొన్ని ప్రశ్నలకు జవాబులు చెప్పకుండానే ప్రసంగం ముగించాడు.

"సాయిపల్లవికి తెలుగులో చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆమె అంటే చాలామందికి ఇష్టం. కేవలం ప్రేక్షకులకు మాత్రమేకాదు, ఓ పెద్ద స్టార్ హీరోకు కూడా సాయిపల్లవి అంటే చాలా ఇష్టం. ఆ హీరో ఎవరో దయచేసి నన్ను అడగొద్దు. నేను చెప్పలేను".

ఇలా ప్రేక్షకులకు ఓ పజిల్ వదిలేశాడు బన్నీ. నిజానికి ఇక్కడ అంత సీక్రెట్ గా ఉంచాల్సిన మేటర్ ఏదీలేదిక్కడ. స్టార్ హీరో అయినంత మాత్రాన సాయిపల్లవిని ఇష్టపడకూడదా, తనకు ఫ్యాన్ అవ్వకూడదా. అదేదో పెద్దరహస్యం అన్నట్టు ఆ విషయాన్ని కూడా బన్నీ దాచేశాడు.

మరో సందర్భంలో శర్వానంద్ అన్ని జానర్స్ చేస్తే బాగుంటుంది, అతడు కేవలం ఒకే జానర్ కు ఫిక్స్ అయిపోయాడంటూ ఓ పెద్ద దర్శకుడు తనవద్ద గతంలో అన్నాడని, ఇప్పుడు అదే డైరక్టర్, శర్వా విషయంలో తన తప్పు తెలుసుకున్నాడంటూ బన్నీ చెప్పుకొచ్చాడు. ఈ సందర్భం కూడా పైన చెప్పుకున్నలాంటిదే. ఇక్కడ కూడా ఆ దర్శకుడి పేరు చెబితే ఎవరికీ ఎలాంటి అభ్యంతరం ఉండదు.

నిజానికి సదరు దర్శకుడిలానే చాలామంది నిర్మాతలు, ఇతర దర్శకులు, ప్రేక్షకులు అనుకున్నారు కూడా. అంతెందుకు, ఒకదశలో శర్వానంద్ కూడా అలానే ఫీలయ్యాడు. ఆ తర్వాత అన్నిరకాల పాత్రలు చేశాడు. సో.. ఈ సందర్భంలో కూడా ఆ దర్శకుడి పేరు దాచాల్సిన అవసరం లేదు. బన్నీ మాత్రం అదేదో బ్రహ్మపదార్థం అన్నట్టు బిల్డప్ ఇచ్చాడు.

పడి పడి లేచే మనసు ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ఫొటోస్ కోసం క్లిక్ చేయండి 

సాయి పల్లవి మీద వచ్చేవన్నీ రూమర్స్.. శర్వా సర్టిఫికెట్ 

పోర్న్ నిషేధం.. స్త్రీ వాదుల నుంచి వ్యతిరేకత! చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్ 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?