Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

కేజీ ఎఫ్.. మౌత్ టాక్ నే శరణ్యం

కేజీ ఎఫ్.. మౌత్ టాక్ నే శరణ్యం

ఒక ఊరి రాజు, మరో ఊరి బంటు అన్నది సామెత. కన్నడనాట బాహుబలి రేంజ్ హడావుడి జరుగుతోంది కేజీఎఫ్ సినిమాకు. భారీ వ్యయంతో నిర్మించిన కేజీఎఫ్ కు తెలుగునాట మాత్రం గట్టిపోటీ తగిలింది. ఇద్దరు యంగ్ హీరోలు నటించిన రెండు సినిమాలు ఒకపక్క, తెలుగులో ఇంతో అంతో క్రేజ్ వున్న ధనుష్-సాయిపల్లవి నటించిన సినిమా మరోపక్క వుండగా, వీటి మధ్యలో ఇరుక్కుంది కేజీఎఫ్.

ఇప్పటికే ఈ సినిమాలు అన్నీ థియేటర్లు ఆక్యుపై చేసేస్తున్నాయి. శర్వానంద్ పడి పడి లేచె మనసు కోసం థియేటర్లు బాగా సెట్ చేసుకున్నారు. వినయ విధేయ రామ సినిమాకు అగ్రిమెంట్ లు చేసుకున్న థియేటర్లు అన్నీ పడి పడి లేచె మనసు సినిమాకు కేటాయిస్తున్నారు.

నైజాంలో ఆసియన్ సునీల్ నే ఈ సినిమా చేస్తున్నారు. ఆయనే కేజీఎప్ ను కూడా పంపిణీ చేస్తున్నారు. దీంతో సహజంగానే ప్రయారిటీ పడి పడిలేచె మనసుకు లభిస్తోంది. అంతరిక్షం సినిమా దిల్ రాజు పంపిణీ చేస్తున్నారు నైజాంలో.

సో, అటు దిల్ రాజు, ఇటు సునీల్ రెండు స్ట్రయిట్ సినిమాలు ఫిల్ చేయగా మిగిలినవి కేజీఎఫ్ కు దొరుకుతున్నాయి. మిగిలిన ఏరియాల్లో కూడా ఇదే పరిస్థితి వుంది. మారీ 2 సినిమాను ఏరియాల వారీ అమ్మేసారు. అందువల్ల లోకల్ బయ్యర్లు థియేటర్లను చూసుకుంటున్నారు.

కేజీఎఫ్ డైరక్ట్ రిలీజ్. దాంతో థియేటర్ల కోసం కిందా మీదా అవుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలావుంటే వరుణ్ తేజ్, శర్వానంద్, ధనుష్ లు నోటెడ్ ఫేస్ లు కనుక ఓపెనింగ్స్ మీద ఆసక్తి కనిపిస్తోంది. యాష్ మన వాళ్లకు పరిచయం లేదు. అందువల్ల బజ్ రావడంలేదు.

కానీ ఒకటే ఆశ. సినిమా బాగుంది అన్న మౌత్ టాక్ వస్తే మన ప్రేక్షకులు సినిమాను నెత్తిన పెట్టేసుకుంటారు. కేజీఎప్ కు ఆ మౌత్ టాక్ రావాలి. అది వస్తే ఓ రేంజ్ లో వుంటుంది. రాలేదూ అంటే మాత్రం సమస్యే.

సాయి పల్లవి మీద వచ్చేవన్నీ రూమర్స్.. శర్వా సర్టిఫికెట్ 

పోర్న్ నిషేధం.. స్త్రీ వాదుల నుంచి వ్యతిరేకత! చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్ 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?