ఎమ్బీయస్‍: శాస్త్రీజీ మరణం మిస్టరీ

అక్టోబరు 2 గాంధీ జయంతితో పాటు మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి కూడా. జయంతి అనగానే వర్ధంతి కూడా గుర్తుకు వస్తుంది. గాంధీ హత్య సంగతి అందరికీ తెలుసు. శాస్త్రిది హత్యా…

అక్టోబరు 2 గాంధీ జయంతితో పాటు మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి కూడా. జయంతి అనగానే వర్ధంతి కూడా గుర్తుకు వస్తుంది. గాంధీ హత్య సంగతి అందరికీ తెలుసు. శాస్త్రిది హత్యా కాదా అన్నది యిప్పటికీ తేలలేదు. రెండు నెలల క్రితం జులైలో శాస్త్రి కుటుంబసభ్యులు తమ తండ్రి మరణంపై ఓ కమిటీ వేసి నిజానిజాలు తేల్చాలని కోరారు. ప్రభుత్వం యిప్పటివరకు దానిపై స్పందించలేదు. 1966లో శాస్త్రి పోయిన దగ్గర్నుంచి యిలాంటి డిమాండ్లు వస్తూనే ఉన్నాయి. ఆ తర్వాత కేంద్రంలో కాంగ్రెసు, నేషనల్ ఫ్రంట్, బిజెపి, యునైటెడ్ ఫ్రంట్, ప్రభుత్వాలు వచ్చాయి. గత 8 ఏళ్లగా బిజెపి ప్రభుత్వమే ఉంది. అయినా వాస్తవాలు వెలికితీసి, సందేహనివృత్తి చేయాలన్న శ్రద్ధ ఎవరికీ లేదు. కాగా శాస్త్రి మరణం వెనుక ఇందిర హస్తం ఉంది, కాంగ్రెసే దోషి వంటి వాట్సాప్‌లు (గతంలో వ్యాసాలు) వచ్చిపడడం మాత్రం మానలేదు. వీళ్లంతా శాస్త్రి కుటుంబసభ్యుల కోరిక మేరకు కమిటీ వేయమని ప్రస్తుత ప్రభుత్వాన్ని ఎందుకు కోరరో తెలియదు.

శాస్త్రిగారి మరణం గురించి నాకు తోచినది రాస్తున్నాను. వాస్తవాలేమిటో భగవంతుడికే తెలియాలి. ఆయనది హత్య అయితే ఇందిరా గాంధీయే చేయించిందని అనడం అసమంజసం. తర్వాతి రోజుల్లో ఇందిర అధికారలాలస కనబరిచింది నిజమే కానీ నెహ్రూ మరణానంతరం ఆమె రాజకీయాల్లోకి రావడానికి యిష్టపడలేదు. కాంగ్రెసులో కామరాజ్ నాడార్, మొరార్జీ దేశాయ్, అతుల్య ఘోష్, నిజలింగప్ప, సంజీవ రెడ్డి వంటి ప్రముఖులు కూటమి (సిండికేట్‌ అనేవారు)గా ఏర్పడి విషయాలు నిర్ణయించేవారు. నెహ్రూ వారసుడిగా శాస్త్రిని వాళ్లే ఎంపిక చేశారు. ఆ పదవిపై ఆశ పెట్టుకున్న మొరార్జీకి కోపం వచ్చింది కూడా. ఈ విషయాలు, శాస్త్రి మరణం తర్వాతి విషయాలు అన్నీ కులదీప్ నయ్యర్ తన ‘‘బిట్వీన్ ద లైన్స్’’ పుస్తకంలో వివరంగా రాశారు. కావలిస్తే చదవవచ్చు.

ప్రధాని అయ్యాక శాస్త్రి, నెహ్రూ వారసత్వం యింకా కొనసాగుతోందని చూపించుకోవడానికి (ఆనాటికి దేశంలో నెహ్రూ పలుకుబడి అలా ఉంది) నెహ్రూ కుటుంబ సభ్యులొకర్ని కాబినెట్‌లో తీసుకోవాలని అనుకున్నారు. ఇందిరను అడిగితే తనకు ఏ పదవీ అక్కర్లేదంది. ‘‘అయితే మీ మేనత్త విజయలక్ష్మీ పండిట్‌ను తీసుకుంటాను.’’ అన్నారు శాస్త్రి. చిన్నప్పటి నుంచి తనను లోకువగా చూసిన మేనత్తంటే కోపం పెంచుకున్న ఇందిర ‘అయితే నేనే తీసుకుంటాను’ అంది. ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్‌కాస్టింగ్ వంటి ఏ ప్రాముఖ్యంలేని శాఖ నిచ్చారు. శాస్త్రి హఠాత్తుగా మరణించకుండా ఉంటే ఇందిర అలాగే కాలక్షేపం చేసేవారేమో కానీ ఆయన పోయాడు. మళ్లీ అధికారం కోసం కుమ్ములాట జరిగింది. మొరార్జీ బాగా పట్టుబట్టారు. ఆయనైతే కొరకరాని కొయ్య అనీ ఎవరి మాటా వినడని, ఇందిర అయితే మూగ ఆటబొమ్మ అనీ అనుకుని కామరాజ్ ఇందిర వైపు మొగ్గారు. తక్కినవాళ్లదీ అదే అభిప్రాయం. ఆ విధంగా ఇందిర ప్రధాని అయింది.

ఆమె ప్రధాని అయిన కొత్తల్లో సిండికేట్ మాటే చెల్లింది. కానీ కాంగ్రెసు ఎన్నికల్లో ఓడిపోసాగింది. అప్పుడు ఇందిర కొందరు యంగ్‌టర్కులు, కాంగ్రెసులోని సోషలిస్టుల సాయంతో సిండికేట్‌కు చెక్ పెట్టి సొంతంగా బలం పెంచుకుని, కాంగ్రెసును చీల్చింది. అప్పటివరకు ఇందిరకు రాజకీయంగా పెద్ద ఆశలూ లేవు, ప్రతిభాపాటవాలూ కనబరచలేదు. అందువలన శాస్త్రి హత్యను ఇందిర చేయించిందంటే నమ్మలేం. ఎందుకంటే శాస్త్రి మరణం తర్వాత ప్రధాని అయ్యే ఛాన్సు ఆమెకు అనుకోకుండా దక్కింది తప్ప ముందే ఊహించినది కాదు. ప్రధాని అయ్యే ఛాన్సు ఉన్నది కాబినెట్‌లో నెంబర్ టూగా ఉన్న గుల్జారీలాల్ నందాకు. నెహ్రూ మరణం తర్వాత కూడా ఆయనే ఆపద్ధర్మ ప్రధాని అయ్యాడు. ఆయన నిప్పులాంటి మనిషి. అవినీతి అస్సలు సహించడు. అందుకే సిండికేట్‌కు ఆయన సయించడు. రెండు సార్లూ ఆయనను ఆపద్ధర్మానికి వాడుకుని వదిలేశారు. చివరకు అనామకుడిగా పోయాడు.

శాస్త్రి మరణం తర్వాత ప్రధాని అయ్యే ఛాన్సుందనే కారణంగా నందా శాస్త్రిని హత్య చేయించాడని ఆరోపించడం కంటె పాపం ఉండదు. నందా వ్యక్తిత్వం అలాటిది కాదు. మరి అది హత్యే అయితే ఎవరు చేయించినట్లు? రష్యాలో ఉండగా చనిపోయారు కాబట్టి అప్పట్లో రష్యన్ గూఢచారి సంస్థ కెజిబిపై నింద పడింది. కానీ నేను అప్పట్లోనే దాన్ని నమ్మలేక పోయాను. రష్యాకు శాస్త్రిపై విరోధం లేదు. ఇండియాతో శత్రుత్వం కూడా లేదు. నెహ్రూ కాలం నుంచి వేరే ఏ దేశంతోనూ లేనంతగా ఇండియాతో లావాదేవీలున్నాయి దానికి. పాకిస్తాన్ అమెరికాకు సైనిక స్థావరాలు యిచ్చి మిత్రదేశం అయినా కూడా రష్యా పాకిస్తాన్‌ను వదులుకోవదానికి సిద్ధంగా లేదు. వదిలేస్తే పూర్తిగా అమెరికా కౌగిలిలోకి వెళ్లిపోతుందన్న భయం దానిది.

అందుకే భారత్, పాకిస్తాన్‌ల మధ్య యుద్ధం జరిగినప్పుడు మధ్యవర్తిత్వం వహించి, యుద్ధాన్ని ఆపి, రాజీ కుదిర్చింది. రాజీకని పిలిచి తన గడ్డ మీదే ఒక దేశపు ప్రధానిని హత్య చేసి పంపితే దేశం పరువు నిలుస్తుందా? ఒకవేళ అంతగా చంపాలనుకుంటే ఇండియాలోనే కెజిబి ఏజంట్ల ద్వారా చంపించేది. అప్పట్లో ప్రధానులకు యింత సెక్యూరిటీ కూడా ఉండేది కాదు. స్వేచ్ఛగా ప్రజల్లో కలిసి తిరిగేవారు. పైగా శాస్త్రిని చంపితే వాళ్లకు వచ్చే లాభం ఏముంది? శాస్త్రి రష్యా నుంచి దిగుమతులు ఆపలేదు. వ్యాపారబంధాలు తెంపుకోలేదు. శాస్త్రి మరణిస్తే ప్రధానిగా మొరార్జీ వస్తాడని అందరి అంచనా. మొరార్జీ కమ్యూనిస్టు వ్యతిరేకి. మొండిశిఖండి. రష్యాతో బంధాలు తెంపుకుని అమెరికాతో చెలిమి చేసినా చేయవచ్చు. (జనతా ప్రధాని అయినప్పుడు అలా చేయలేదు. కానీ అది సంకీర్ణ ప్రభుత్వం. 1966 అయితే కాంగ్రెసుకు పూర్తి మెజారిటీ ఉన్న రోజులు) శాస్త్రిని చంపేసి, తమంటే పడని మొరార్జీ ప్రధాని కావడానికి రాచబాట వేసేటంత మూర్ఖంగా రష్యా వ్యవహరించదని నా లాజిక్.

నా బోటివాళ్లు తక్కువ సంఖ్యలోనే ఉన్నారు. దేశంలో ఎక్కువమంది కమ్యూనిస్టు వ్యతిరేకులే కాబట్టి రష్యా చంపించిందనే నమ్మారు. జనసంఘ్ (బిజెపి పూర్వరూపం) దీన్ని మరీ ప్రచారం చేసింది. సహజమరణం అంటే మామూలు జనాలకు మజా ఉండదు. బోసు మరణించలేదని, నెహ్రూ కోరికపై రష్యాలో బందీగా అట్టే పెట్టిందనీ (నెహ్రూపై ఓ రాయి పడేస్తే అదో తృప్తి), సన్యాసిగా అజ్ఞాతంగా బతికాడని (అనామకంగా బతికే రకం కానే కాదాయన) అనుకోవడంలో థ్రిల్ ఉంది. అలాగే శాస్త్రి మరణం వెనక కూడా ఏదో మిస్టరీ ఉందనుకోవడంలోనే థ్రిల్ ఉంది. ఇలాటి కేసుల్లో మృతుల కుటుంబం డాక్యుమెంట్లు డీక్లాసిఫై చేసి నిజానిజాలు బయటపెట్టాలని డిమాండు చేస్తూ ఉంటుంది.

శాస్త్రి గారి విషయానికి వస్తే ఆయన పెద్ద కుమారుడు అనిల్ శాస్త్రి జనతా దళ్ టిక్కెట్‌పై 1989లో ఎంపీగా ఎన్నికయ్యారు. ఫైనాన్స్ మినిస్ట్రీలో మంత్రిగా పనిచేశారు కూడా. అప్పుడే హత్యో కాదో రికార్డులు చూసి తేల్చుకోవలసినది. శాస్త్రిగారి రెండో కొడుకు సునీల్ శాస్త్రి, బ్యాంకు ఉద్యోగం మానేసి కాంగ్రెసు పార్టీలో చేరి 1987-89 మధ్య యుపిలో మంత్రిగా ఉండి, 2009లో బిజెపిలో చేరి 2021 డిసెంబరులో మళ్లీ కాంగ్రెసులో చేరారు. 10 నెలల క్రితం దాకా బిజెపిలో ఉన్న వ్యక్తికి ఏడేళ్లలో సమాచారం సేకరించడం కష్టమా? శాస్త్రి కుమార్తె సుమన్ కొడుకు సిద్ధార్థ నాథ్ సింగ్ బిజెపిలో ప్రముఖ నాయకుడు. ప్రస్తుతం జాతీయ సెక్రటరీ. ఆయనకీ సమాచార సేకరణ కష్టం కాకూడదు. వీళ్లంతా మిస్టరీని మిస్టరీగానే ఉంచదలుచుకున్నారా అనే డౌట్ వస్తుంది.

శాస్త్రితో బాటు తాష్కెంట్ వెళ్లిన జర్నలిస్టు కులదీప్ నయ్యర్ తన ఆత్మకథ ‘‘బియాండ్ ద లైన్స్’’ను 2012లో ప్రచురించినప్పుడు అమ్మకాలకో ఏమో కానీ శాస్త్రి మరణం గురించి సందేహాలు మిగిలి పోయాయని రాశారు. ఆ పుస్తకంలోని భాగాలతో ‘‘ఔట్‌లుక్’’ పత్రిక తన 2012 జులై 9 సంచిక కవర్ స్టోరీగా వాడుకుని చాలా కథనాలు వేసింది కానీ ఏమీ తేల్చలేదు. వాటిలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు –1) శాస్త్రి మరణం తర్వాత ఆ భవనంలో ఉన్న రష్యన్ వంటవాణ్ని కెజిబి ఐదు గంటల పాటు విచారించి వదిలేసింది 2) మరణానంతరం భర్త శరీరం నీలం రంగులో మారిందని, విషప్రయోగం జరిగిందని తనకు అనుమానమని, కానీ రష్యాలో కానీ, ఇండియాలో కానీ పోస్ట్‌మార్టమ్ జరగలేదని ఆయన భార్య లలిత కులదీప్ నయ్యర్‌తో అన్నారట. (పోస్ట్ మార్టమ్ జరగాలని ఆవిడ అప్పుడే ఎందుకు పట్టుబట్టలేదో తెలియదు. ఆపద్ధర్మ ప్రధాని నందా నిరాకరించారని అనుకోవడానికి లేదు).

శరీరం నీలంగా మారి ఉంటే తక్కినవాళ్లు కూడా గమనించి ఉంటారు కదా, రష్యా వెళ్లిన నయ్యర్ కూడా ఆ విషయాన్ని రికార్డు చేయలేదు. లలితా శాస్త్రి సందేహాన్ని మాత్రం రాసి ఊరుకున్నారు. దీనితో పాటు యిస్తున్న ఫోటోలో శాస్త్రి మొహం కనబడుతోంది. నీలం చాయ కనబడుతుందన్న భయం ఉంటే మూసేద్దురు కదా! 3) శాస్త్రి మరణం గురించి ప్రతిపక్షంలో ఉన్నపుడు అనేక సందేహాలు లేవనెత్తిన పార్టీలు జనతా పార్టీగా ఏర్పడి 1977లో అధికారంలోకి వచ్చినపుడు రాజ్ నారాయణ్ అధ్యక్షతను పార్లమెంటరీ కమిటీ వేసింది. కానీ అది ఏమీ తేల్చలేదు. వాళ్లు సాక్షులుగా పిలిచిన వారిలో శాస్త్రితో బాటు తాష్కెంటు వెళ్లిన వ్యక్తిగత వైద్యుడు డా. ఆర్. ఎన్. చుగ్ ఒకరు. ఆయన సాక్ష్యం చెప్పడానికి వెళ్తూ ఉంటేనే ఓ ట్రక్ గుద్ది ఆ యాక్సిడెంటులో చనిపోయారు.

వ్యక్తిగత సహాయకుడు రామ్ నాథ్ మరొక సాక్షి. సాక్ష్యం చెప్పడానికి వెళ్లబోయే ముందు లలిత గారి దగ్గరకు వచ్చి ‘‘కొన్నేళ్ల హృదయభారాన్ని యివాళ దింపుకోబోతున్నాను. అంతా చెప్పేస్తాను.’’ అన్నాట్ట. కమిటీ వద్దకు సైకిల్ మీద వెళుతూండగానే ఓ కారు గుద్దేసింది. కాళ్లు విరిగిపోయి, తీసేయాల్సి వచ్చింది. అతనికి జ్ఞాపకశక్తి పోయింది. ఇవి వినేసరికి కుట్రలతో నిండిన ఓ డిటెక్టివ్ సినిమాలా అనిపిస్తుంది. ఆ పనివాడు అంత రిడిల్స్‌లో మాట్లాడడం దేనికి? తన హృదయభారాన్ని శాస్త్రిగారి భార్య దగ్గరే దింపుకోవచ్చుగా! కమిటీవాళ్లకు మాత్రమే చెప్పాలన్న నియమమేమీ లేదుగా! 1966లో శాస్త్రిగారు పోతే, 11 ఏళ్ల తర్వాత జనతా ప్రభుత్వం ఏర్పడుతుందని, కమిటీ వేస్తారని అతను కలగనలేదు కదా. మధ్యలో వీళ్ల కుటుంబాన్ని కలిసి యిలా యిలా జరిగింది, అధికారికంగా సాక్ష్యం చెప్పమని మాత్రం బలవంతం చేయకండి అంటూ తనకు తెలిసినది చెప్పవచ్చుగా! చెపితే వీళ్లు చంపించేయరుగా!

పైగా నాకు వచ్చిన పెద్ద సందేహమేమిటంటే, యితని యాక్సిడెంటు కావాలని జరిగిందనుకుంటే, వచ్చి గుద్దేస్తే మతి పోతుందని కుట్రదారులు ఎలా ఊహించగలిగారు? నిజంగా యిన్వెస్టిగేట్ చేద్దామనుకునేవారు ఆ కారు యాక్సిడెంటు ఎలా జరిగిందో కనుక్కోవాలి. కారు కాళ్ల మీద నుంచి పోవడంతో పాటు, తల దేనికైనా కొట్టుకుని మతి పోయిందా? ఇంకోటేమిటంటే యీ యిద్దరు సాక్షులను మాత్రమే కమిటీ పిల్చి ఉండదు కదా! ప్రధాని తో పాటు విదేశానికి వెళ్లే పరివారంలో చాలామంది అధికారులు ఉంటారు. ఆయన పోయారని తెలియగానే వెళ్లి చూసి నివాళి ఘటించి ఉంటారు. వాళ్లందరూ ఏమన్నారు? శరీరం నీలంగా మారిందన్నారా? మరణానికి ముందు ఏమైనా అనూహ్య ఘటనలు జరిగాయా అనేది చెప్పి ఉంటారు కదా!

ఈ ప్రశ్నలకు సమాధానం మనకు దొరకదు. ఎందుకంటే ఆ కమిటీ ఏ నిర్ణయాన్నీ ప్రకటించలేదు. దాని డాక్యుమెంట్లు పార్లమెంటు లైబ్రరీలో ఎక్కడో పారేశారు. జనతా ప్రభుత్వం మూడేళ్లు అధికారంలో ఉంది. నిజంగా ఏదైనా మిస్టరీ ఉండి ఉంటే వాళ్లు దాన్ని యీజీగా సాల్వ్ చేసి ఉండేవారు. దాన్ని కాంగ్రెసుకు వ్యతిరేకంగా వాడుకునే వారు. అప్పటికే ఎమర్జన్సీ అత్యాచారాలలో ప్రతి చిన్న విషయాన్ని బయటపెట్టి కాంగ్రెసుపై ఏహ్యత పెంచారు. ఇలాటి హత్యాసమాచారాన్ని వదిలిపెట్టేవారా?

4) 1977లోనే యీ పరిస్థితి ఉంటే పోనుపోను ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. 2009లో అనుజ్ ధార్ అనే అతను ఒక సమాచార హక్కు అప్లికేషన్ ద్వారా ప్రభుత్వాన్ని ఆనాడు భారత్, రష్యాల మధ్య జరిగిన కరస్పాండెన్స్ గురించి అడిగితే ‘శాస్త్రి మరణం గురించి ఒకే ఒక్క డాక్యుమెంటు ఉంది. కానీ దేశభద్రత, సమగ్రత దృష్ట్యా దాన్ని బయటపెట్టలేం.’ అని జవాబిచ్చింది. ఆ సమాచారంతో అతను ‘‘యువర్ ప్రైమ్ మినిస్టర్ ఈజ్ డెడ్’’ అనే 2018లో ఒక పుస్తకం రాసి శాస్త్రి మరణం గురించి సందేహాలు లేవనెత్తాడు. అతను సమాచారం అడిగినప్పుడు యుపిఏ ప్రభుత్వం ఉంది. 2014 నుంచి ఉన్నది ఎన్‌డిఏ ప్రభుత్వం. కాంగ్రెసును అల్లరి పెట్టడానికి చిన్న అవకాశం కూడా వదలని ప్రభుత్వం. వాళ్లు ఆ ఏకైక డాక్యుమెంటును బయటపెట్టవచ్చు కదా! పెట్టమని ధార్ అడిగి పుస్తకంలో చేర్చి వుండవచ్చు కదా!

పదేళ్ల క్రితం నాటి విషయాలు యిప్పుడెందుకు రాయడం అనుకోవద్దు. రెండు నెలల క్రితం జులైలో శాస్త్రి కుటుంబం మళ్లీ యింకో కమిటీ వేయమని డిమాండ్ చేసింది. ఎందుకంటే రాబర్ట్ క్రోలీ అనే అమెరికన్ గూఢచారి సంస్థ సిఐఏ మాజీ అధికారి తమ సంస్థే శాస్త్రిని, హోమి భాభాని చంపించిందని ఒక పుస్తకంలో రాశాడని, దానిపై విచారణ జరిపించమని వీరి కోరిక. ఆ పుస్తకం తాజాగా మార్కెట్లోకి వచ్చిందేమో ననుకోవద్దు. 2013 లోనే మార్కెట్లోకి వచ్చింది. ఆయన 2000లో చనిపోయాడు కూడా. తాజాగా ఆర్తీ టిక్కూ అనే కశ్మీరు పండిట్, జర్నలిస్టు ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ తన పుస్తకంలో రాయడంతో వీళ్లు యిప్పుడు యీ డిమాండు చేశారు.

ఆ సిఐఏ అధికారి పేరు రాబర్ట్ క్రోలీ, ముద్దుపేరు క్రో. అందుకే ఆ పుస్తకానికి ‘‘కాన్వర్సేషన్స్ విత్ ద క్రో’’ అని పేరు పెట్టాడు జర్నలిస్టయిన రచయిత గ్రెగరీ డగ్లస్. క్రోలీ సిఐఏలోని కవర్ట్ ఆపరేషన్స్‌లో డిప్యూటీ చీఫ్. అతను సిఐఏలోంచి రిటైరై వస్తూ కొన్ని పేపర్లు ఎత్తుకు వచ్చేశాడని, గ్రెగరీతో నాలుగేళ్ల పాటు ఫోన్లో యింటర్వ్యూలు యిచ్చి పుస్తకం రాయించాడని, తన మరణానంతరం యీ పేపర్లను అతనికి పంపించే ఏర్పాటు చేశాడని అంటారు. అతను చనిపోయిన 13 ఏళ్లకు మార్కెట్‌లోకి వచ్చిన పుస్తకంలో కేవలం సంభాషణలు ఉంటాయి తప్ప, క్రో గొప్పలు చెప్పుకున్న కార్యాలకు సంబంధించిన సాక్ష్యాలివిగో అని ఆధారాలు ఏవీ వేయలేదు. క్రో చెప్పినదానిలో ఎంత నిజమో, ఎంత అతిశయోక్తో ఎవరికీ తెలియదు. మామూలుగా జరిగినవాటిని కూడా తన ఖాతాలో వేసుకుని, తను చేసిన ఘనకార్యాలుగా చెప్పుకుంటున్నాడేమో కూడా తెలియదు.

ఇంతకీ అతను చెప్పినదేమిటి? ‘‘భారతదేశం అణ్వస్త్రదేశంగా మారడానికి చేసే ప్రయత్నాన్ని యిద్దరు ప్రముఖులను చంపేయడం ద్వారా మేం మొగ్గలోనే తుంచేశాం. వారిలో ఒకరు హోమి భాభా అనే అణు సైంటిస్టు. భారతదేశానికి అణుశక్తి దేశంగా మారే శక్తి ఉంది అని కొన్ని నెలల క్రితం ప్రకటించాడు. దాంతో ఆయన వియన్నాకు ప్రయాణిస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో కార్గోలో బాంబు పెట్టి ఆయన్ను 24 జనవరి 1966న చంపేశాం. వియన్నా ఎయిర్‌పోర్టులో దిగుతూండగా బాంబు పేలిస్తే చాలామంది పౌరులు చచ్చిపోయేవారు. అలా ఎందుకులే అని ఆల్ప్‌స్ పర్వతాలపై ఎగురుతూండగానే చంపేశాం. దాంతో కేవలం ప్రయాణీకులు, సిబ్బంది మాత్రం చచ్చిపోయారు.’’ అని. ఆ ప్రమాదం బాంబు పేలుడు వలన జరిగిందని అప్పట్లో అనలేదు. పైలట్‌కు, జెనీవా ఎయిర్‌పోర్టు కార్యాలయానికి మధ్య ఏర్పడిన కమ్యూనికేషన్ గ్యాప్ వలన మాంట్ బ్లాంక్ వద్ద ప్రమాదం జరిగిందని, మొత్తం 117 మంది పోయారని అన్నారు. ఈ పుస్తకం బయటకు వచ్చిన తర్వాత కూడా అఫీషియల్ వెర్షన్ ఏమీ మారలేదు.

భాభానే కాదు, శాస్త్రిని కూడా తామే చంపేశామని క్రో చెప్పేశాడు. ‘‘చంపి ఉండకపోతే ఇండియా నిజంగా ఆటం బాంబు తయారు చేసేసి, పాకిస్తాన్ మీద వేసేసేది. ఇండియా పాకిస్తాన్‌లలో పుట్టపుట్టలుగా జనం. ఆ బాంబుతో ఎంతమంది చచ్చిపోయేవారో తెలుసా? దానికి బదులు వీళ్లిద్దరినీ లేపేస్తే మంచిది కదా అనుకున్నాం. లేపేశాం.’’ అని అన్నాడు. భాభా విషయంలో బాంబు పెట్టామని చెప్పినవాడు శాస్త్రి విషయంలో ఏ ఉపాయంతో చంపారో చెప్పలేదు. ఈ గ్రెగరీ కూడా అడగలేదు. హత్య జరిగినది రష్యాలో. అక్కడ కెజిబి ఉంది. దేశానికి వచ్చిన అతిథులు తమ గడ్డమీద చనిపోకూడదని ఏ దేశమైనా గట్టి జాగ్రత్తలు తీసుకుంటుంది. రష్యా మరీ తీసుకుంటుంది. దాన్ని వీళ్లు ఎలా ఛేదించారనేది ఆసక్తికరమైన విషయం. కానీ సిఐఏలో కెజిబి ఏజంట్లుంటారు, కెజిబిలో సిఐఏ ఏజంట్లుంటారు. అలాటివాళ్ల ద్వారా చేయించారా? పాలల్లో విషం కలిపించారా? విషం కలిపినా శరీరం రంగు మారని విధంగా ఏవైనా జాగ్రత్తలు తీసుకున్నారా? వంటి ప్రశ్నలు గ్రెగరీ అడిగి ఉండాల్సింది. ఇతను అడగలేదు, అతను చెప్పలేదు.

అన్నిటికన్న ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే, అసలు యిద్దర్నీ చంపాల్సిన అవసరం ఏమొచ్చింది? శాస్త్రి అణు కార్యక్రమానికి గ్రీన్ సిగ్నల్ యిచ్చారు. భాభా దాన్ని అమలు చేయగల సమర్థుడు. శాస్త్రిని చంపేస్తే ఆయన వారసుడు ఆ కార్యక్రమాన్ని ఆపేయవచ్చు అనే లెక్కతో శాస్త్రిని చంపవచ్చు. లేదా ప్రధాని ఎవరున్నా భాభా వంటి సమర్థుడు లేకపోతే ఆ కార్యక్రమం రూపు దాల్చదు అనే లెక్కతో భాభా ఒక్కణ్నీ చంపేసి ఊరుకోవచ్చు. శాస్త్రిని చంపిన పదమూడు రోజుల్లోనే భాభాను చంపవలసిన అవసరం లేదు. సరిగ్గా జనవరి 24నే ఇందిర ప్రధాని అయ్యారు. ఆవిడ సీటులో స్థిమితపడి అణు కార్యక్రమం కొనసాగిద్దాం అనే నిర్ణయం తీసుకున్న తర్వాత అప్పుడు భాభాని చంపవచ్చు. ముందే ఎందుకు చంపారు?

మరో విషయం. ఇలాటి ఎసాసినేషన్ ప్రయత్నాలకు ఎన్నో నెలల ప్రిపరేషన్ అవసరం. భాభా వియన్నాకు వెళ్లే ప్రోగ్రాం ముందెన్నడో ఫిక్సయింది కాబట్టి ఆయన్ని కుట్ర చేసి చంపగలిగా రనుకుందాం. మరి శాస్త్రి విషయం? యుద్ధం 50 రోజులు నడిచి, 1965 సెప్టెంబరు 23న సీజ్‌ఫయర్ ప్రకటించారు. మధ్యవర్తిత్వానికి రష్యా ముందుకు వస్తుందని, తాష్కెంట్‌లో రాజీ ప్రయత్నాలు జరుగుతాయని సిఐఏ ముందే ఎలా ఊహించగలిగింది? రాజీ ప్రయత్నాలంటే మాటలా? ఇండియాతో, పాకిస్తాన్‌తో విడివిడిగా సంప్రదించాలి. ఒప్పించాలి. అయ్యేవరకూ నమ్మకం లేదు. పైగా శాస్త్రి రష్యా ప్రమేయాన్ని యిష్టపడలేదు. చాలాకాలం నిరోధిస్తూ వచ్చారు. అందుచేత సిఐఏ తాష్కెంట్‌లో హత్య చేయాలని ముందుగా ప్లాన్ చేసిందని నమ్మడం కష్టం. చంపితే తాష్కెంట్‌లోనే ఎందుకు చంపాలి? భద్రతా ఏర్పాట్లు సరిగ్గా లేని భారతదేశంలో అయితే చాలా సులభం కదా! ఇలా ఎన్నో ప్రశ్నలకు క్రో సరైన సమాధానం చెప్పలేడు.

1970లలో సిఐఏ లోంచి చాలా రహస్యాలు లీకయ్యాయి. జర్నలిస్టులు అనేక పుస్తకాలు రాశారు. వాటి నుంచి సమాచారం తీసుకుని మన దగ్గర వామపక్షీయులు పుస్తకశకలాలను (బుక్‌లెట్) వేసేవారు. దక్షిణ అమెరికాలో, ఆఫ్రికాలో, ఆసియాలో సిఐఏ ఎంతమంది పాలకులను చంపిందో తెగ రాసేవారు. అప్పుడెప్పుడూ శాస్త్రిగారి విషయం బయటకు రాలేదు. ఈ క్రోలీ పెద్దమనిషి తనను పెద్ద మొనగాడిగా చూపించుకోవడానికి యిలా చెప్పుకున్నాడేమో తెలియదు. అతను చెప్పినదాన్ని క్రాస్‌చెక్ చేసుకోవలసినదే.

సిఐఏ డాక్యుమెంట్లు బై డిఫాల్ట్ 10 ఏళ్ల తర్వాత డీక్లాసిఫై అవుతాయి. కొన్నిటిని ఆపితే 25 ఏళ్ల తర్వాత యింకా దాచి ఉంచాలా అక్కరలేదా అని సమీక్షిస్తారు. 9 రకాల వాటిని మాత్రం దాచి ఉంచి, తక్కినవి బయటకు విడుదల చేసేస్తారు. 50 ఏళ్ల తర్వాత రెండు రకాల వాటిని మాత్రం దాచి ఉంచి, తక్కిన 7 రకాల వాటినీ విడుదల చేస్తారు. 75 సంవత్సరాలకు దాటి దాచి వుంచాలంటే స్పెషల్ పర్మిషన్ తీసుకోవాలి. శాస్త్రి మరణం 1966లో జరిగింది. 2016 నాటికి 50 ఏళ్లు పూర్తయ్యాయి. అంటే మరీ ఎక్సెప్షనల్ (రెండు రకాలు మాత్రమే ఉన్నాయి) అయితే తప్ప యీపాటికే డీక్లాసిఫై అయిపోయి ఉండాలి. శాస్త్రి మరణం వలన భారత్‌లో కానీ, రష్యాలో కానీ పెద్ద పరిణామాలు ఏవీ సంభవించలేదు. అందుకని ఎక్సెప్షన్‌లోకి వచ్చి ఉంటుందని అనుకోనక్కరలేదు. సిఐఏ పాత్ర ఉండివుంటే, యీ పాటికే అందరికీ తెలిసిపోయి ఉండాలి.

మనందరికీ తెలిసున్న విషయాలను ఒక్కసారి గుర్తు చేసుకుంటే శాస్త్రిది సహజమరణం కావడానికి ఎంత అవకాశం ఉంది అనేది అర్థమౌతుంది. ఆయన హృద్రోగి. 1959లో, ఆయన 54వ ఏట మొదటి గుండెపోటు వచ్చింది. ప్రధాని అయ్యేందుకు ముందు మరోసారి హార్ట్ ఎటాక్ వచ్చింది. ప్రధాని అయ్యాక యుద్ధం వచ్చేవరకు ఆయన చాలా విమర్శలు ఎదుర్కుంటూ వచ్చాడు. నెహ్రూతో పోల్చి అందరూ పెదవి విరిచారు. సోషలిస్టులు శాస్త్రికి దూరమై పోయారు. దేశంలో అనేక సంక్షోభాలు. ఆహారధాన్యాల కొరత. రూపాయి విలువ తగ్గించమని అమెరికా ఒత్తిడి. కేరళలో కాంగ్రెసు ప్రభుత్వం పడిపోయింది. 1965 తర్వాత ఇంగ్లీషు స్థానంలో హిందీని ప్రవేశపెడతామని యీయన ప్రకటించడంతో తమిళనాడు (నాటి మద్రాసు) రాష్ట్రంలో విద్యార్థి ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడి, డిఎంకె లాభపడి, కాంగ్రెసు తీవ్రంగా నష్టపోయింది. 1967లో అధికారం కోల్పోయింది కూడా.

దానాదీనా పదవిలోకి వచ్చాక ఆయనకు మూడోసారి హార్ట్ ఎటాక్ వచ్చింది. తన దగ్గరున్న విదేశాంగ శాఖను స్వరణ్ సింగ్‌కు అప్పగించారు. ఇక యుద్ధం మొదలయ్యాక అనేక చికాకులు వచ్చాయి. (వాటి గురించి నా ఎమర్జన్సీ ఎట్ 40 సీరీస్‌లో 31 నుంచి 34 భాగాల్లో విపులంగా రాశాను) అమెరికా, బ్రిటన్ ఆర్థిక ఆంక్షలు విధించాయి. రష్యా మధ్యవర్తిత్వం శాస్త్రిగారికి యిష్టం లేదు. విధి లేక ఒప్పుకోవలసి వచ్చింది.

తీరా ఒప్పందం కుదిరాక దాన్ని ఒప్పందం అని పిలవడానికి కూడా పాక్‍ ఒప్పుకోలేదు. చివరకు తాష్కెంట్‍ డిక్లరేషన్‍ పేర ప్రకటించారు. ఈ వార్త బయటకు రాగానే ఇండియాలో నిరాశ వ్యాపించింది. పాక్‍కు బుద్ధి చెప్పామన్న తృప్తి ఆవిరై పోయింది. జనసంఘ్‍ నాయకుడు వాజపేయి ‘‘భవిష్యత్తులో యుద్ధానికి దిగం అని పాక్‍ నుండి నిర్దిష్టమైన హామీ ఏమీ తీసుకోకుండానే వారి ప్రాంతాలను వారికి అప్పగించడం పొరపాటు’’ అని ప్రకటించారు. శాస్త్రి భార్య కూడా అలాగే అనుకున్నారు. సంతకాలు పూర్తయ్యాక ఇంటికి ఫోను చేసిన శాస్త్రికి ఆయన కూతురు యీ విషయాలు చెప్పింది. ఇది విని ఆయన ఆందోళనకు గురయ్యాడు. ఆ రాత్రే ఆయనకు నాలుగో సారి గుండెపోటు వచ్చింది. 61 వ యేట మరణించారు.

ఏతావతా చెప్పేదేమిటంటే, విచారణ జరపమని కోరడానికి యీ పుస్తకాన్ని బేస్ చేసుకుంటే సరిపోదు. ఇదో కొత్త ఆధారం అనుకోవడానికి లేదు. పైగా 2013లో పుస్తకం బయటకు వస్తే 9 ఏళ్ల తర్వాత శాస్త్రి కుటుంబసభ్యులు యిప్పుడు డిమాండ్ చేయడంలో అర్థమేమిటో తెలియదు. అందువలన మరో పదేళ్ల తర్వాత కూడా శాస్త్రి మరణం మిస్టరీగానే మిగలవచ్చు. ఈలోగా కొత్త కోణాలు వచ్చి చేరవచ్చు. కొత్త కోణమంటే గుర్తుకు వచ్చింది. అప్పట్లో లేదు కానీ, యీ మధ్య కొందరు బెంగాలీలు ఒక థియరీని చేర్చారు. రష్యాలో ఉండగా శాస్త్రి నేతాజీని కలిశారట. ఇండియాకు తిరిగి వచ్చి దాన్ని (నేతాజీ పేరు చెప్పలేదు కానీ, ఒక ప్రత్యేక వ్యక్తిని కలిశానని అన్నారట) ప్రకటిస్తానని కుటుంబసభ్యులతో చెప్పారట. దాంతో కాంగ్రెసు నేతలు కంగారు పడి శాస్త్రిగారిని అక్కడే మట్టుపెట్టేశారట.

మనం ఎప్పటికీ మిస్టరీగా మిగల్చదలచుకున్న వాటిలో బోసు మరణం ఒకటి. మరో వందేళ్లు పోయినా బెంగాలీలు ఆయన పోయాడంటే నమ్మరు. ఆయన వర్ధంతిని ఎప్పటికీ జరపరు. 1945 నాటి విమానప్రమాదంలో బోసు చనిపోలేదని, బ్రిటిషు వాళ్లకు పట్టుబడితే నెహ్రూ కోరికపై ఆయన్ని రష్యా జైల్లో ఉంచారనీ, రాధాకృష్ణన్ గారు రష్యా వెళ్లినపుడు ఆయన్ని కలిసి మాటామంతీ ఆడారని పుకార్లు వస్తూనే ఉంటాయి. వీటిలో వేటికీ ఆధారాలు లేవు. తనకు పోటీగా వస్తాడనుకున్న వ్యక్తిని సజీవంగా ఉంచమని నెహ్రూ ఎందుకంటాడు? అందునా బోసుని! కలకత్తా నివాసం నుంచి బ్రిటిషు అధికారుల కన్నుగప్పి జర్మనీకి పారిపోయినవాడు బోసు, జర్మనీ నుంచి మిత్రపక్షాలకు తెలియకుండా సబ్‌మెరైన్‌లో జపాను పారిపోయినవాడు బోసు. అలాటివాడు రష్యా జైల్లోంచి తప్పించుకుంటే.. అనే భయం ఉండదా? రష్యన్లు మనిషిని మాయం చేయడంలో ఘనులు. తమ శత్రువైన జపానుతో చేతులు కలిపిన బోసును ఆ పని వెంటనే చేసేసి ఉండేవాడు.

ఒకవేళ రష్యా వాళ్లు నిజంగా బోసుని చంపడానికి యిష్టం లేక ఖైదులో పెట్టి పోషిస్తూ ఉన్నారనుకున్నా, ఇండియా నుంచి ఎవరైనా రాగానే షో పీస్‌లా తీసుకుని వచ్చి చూపిస్తూ ఉంటారా? ఏ సైబీరియాకో పంపేసి ఉంటారు తప్ప, ఎక్కడో మారుమూల ఉన్న తాష్కెంట్‌కు తీసుకుని వచ్చి శాస్త్రికి చూపిస్తారా? పైగా శాస్త్రి గారి మూడ్ ఎలా ఉండి ఉంటుంది? భారతసైన్యం మంచి స్వింగ్‌లో ఉన్నపుడు వెళ్లి లాహోర్‌ను పట్టుకోనీయకుండా వెనక్కి రమ్మనమందుకే భారతీయులు కినుకతో ఉన్నారు. ఇప్పుడీ రాజీ ప్రతిపాదనలు వాళ్లకు నచ్చుతాయో లేదో! అన్న ఆలోచనలతో సతమతమవుతున్న సమయంలో బోసుని కలిసి ఏం సాధించాలి? ఏ విషయంలో సలహాసంప్రదింపులు తీసుకోవాలి?

శాస్త్రిగారికి బోసు అంటే మహా యిష్టం అని కూడా యీ బెంగాలీ బ్లాగర్స్ రాసేస్తున్నారు. దానికి ఆధారమేమిటో తెలియదు. నాజీలతో, ఫాసిస్టులతో, సామ్రాజ్యవాదులతో చేతులు కలిపిన బోసు అంటే గాంధేయవాది శాస్త్రికి అభిమానం ఎందుకు మిగులుతుంది? పచ్చిగా చెప్పాలంటే కాంగ్రెసులో ఉన్నంతకాలమే బోసుకి గ్లామరు ఉండింది. బయటకు వచ్చేసి ఫార్వార్డ్ బ్లాకు పెడితే బెంగాల్ అవతల ఏ రాష్ట్రంలోనూ అంబ పలకలేదు. ఆంధ్రలో మద్దూరి అన్నపూర్ణయ్య గారనే ఒకాయన రాష్ట్రశాఖ పెట్టారు. ఆయన పేరు యిప్పుడు ఎవరికీ తెలియదు. యుద్ధంలో మరణించాకనే బోసుకి గ్లామర్ పెరిగింది. దానికి కారణం ఆయన పట్టిన హింసామార్గం! అహింస ద్వారా స్వాతంత్ర్యం సాధించాడని గాంధీని ప్రపంచమంతా కీర్తిస్తుంది. వందకు పైగా దేశాలు ఆయన పేర స్టాంపులు వేశాయి.

కానీ ఇండియాలో మాత్రం పోనుపోను అహింసపై మోజు పోయి, హింసామార్గం పట్టి ఉంటే యింకా ముందే స్వాతంత్ర్యం వచ్చేదని వాదించేవాళ్లు పెరిగారు. బోసువి కూడా మిలటరీ డ్రస్సులోనే విగ్రహాలు స్థాపిస్తారు. నిజానికి బోసు తన జీవితంలో ఆఖరి రెండేళ్లు మాత్రమే ఆ డ్రస్సు వేసుకున్నాడు. అప్పటిదాకా ఉన్న పంచె, లాల్చీ, బట్టతలతో విగ్రహం పెట్టి బోసు అంటే ఎవరూ నమ్మరు. బోసు ప్రధాని కావలసినవాడు అని అనుకునేవాళ్లు ఆనాటి సంగతులు తెలుసుకుంటే నెహ్రూ కున్న గ్లామరు ఆయనకు లేదని అర్థం చేసుకుంటారు. పటేల్‌కి పార్టీలో బలం ఉంది కానీ ప్రజల్లో నెహ్రూ అంటేనే మోజు అని గ్రహించాడు కాబట్టే గాంధీ నెహ్రూవైపు మొగ్గు చూపాడు. స్వాతంత్ర్యం వచ్చాక కూడా దాదాపు రెండు దశాబ్దాల పాటు దేశం నెహ్రూ ఆరాధనలో మునిగింది.

శాస్త్రిగారి విషయానికి వస్తే ఆయన బోసుని కలిసి ఉంటారనే వాదన కొట్టి పారేయవచ్చు. సిఐఏ చంపించిందన్న మాటా కొట్టేయవచ్చు, ఏదైనా ఆధారం దొరికితే తప్ప! మహా అయితే సిఐఏ భాభాను చంపించిందేమో అనుకుని ఊరుకోవచ్చు. రష్యాయే చంపించింది అనుకోవాలంటే సొంత గడ్డమీద చంపించి, నింద ఎందుకు మోస్తుంది అనే సందేహం వస్తుంది. వీటన్నిటితో పాటు ప్రభుత్వం ఎందుకు దాచాలన్న సందేహమూ వస్తుంది.

రాజ్ నారాయణ్ కమిటీ ఎందరిని విచారించింది, వాళ్లు ఏం చెప్పారు? అనేది రికార్డులు శోధించి బయటకు తీస్తే విషయం తేటతెల్లమౌతుంది. నా అనుమానం వివాదం చేయడానికి ఏ సమాచారమూ దొరికి ఉండదు. లవలేశం దొరికినా వదిలిపెట్టే రకం కాదు లోహియా శిష్యుడు, అల్లరి పెట్టడంలో ఘనుడూ ఐన రాజ్ నారాయణ్!. ఇదంతా గతం. ఇప్పుడు బిజెపి ప్రభుత్వం కేంద్రంలో ఉంది. తలచుకుంటే ఎప్పటెప్పటివో కూడా తవ్వి తీయగలదు. తీసి నిజానిజాలు ప్రకటిస్తే బాగుంటుంది.

– ఎమ్బీయస్ ప్రసాద్ (అక్టోబరు 2022)

[email protected]

20 Replies to “ఎమ్బీయస్‍: శాస్త్రీజీ మరణం మిస్టరీ”

  1. శాస్త్రి గారి మరణం గురించి తెలియాలంటే బోసు గారి మరణం గురించి తెలియాలి. వీరిద్దరి కలయిక గురించి అసలు మీరు రాయలేదు, బహుశా అది ఎక్కడ రాసి లేదేమో, ఉంటే రాసేవారు కదా? నెహ్రు మరణాంతరం ఒక బాబా, బోసు పోలికలతో సరిపోయే వ్యక్తి అంత్యక్రియలకు వచ్చినప్పుడు, శాస్త్రి గారు హుటాహుటిన అతన్ని కలుసుకుని కార్ దగ్గరకు సాగనంపారు. ఆ ఫోటో లో వ్యక్తి బోసు కాదు అని ప్రభుత్వం క్లారిఫికేషన్ ఇవ్వడం కొసమెరుపు. బోసు అప్పటి సోవియట్ యూనియన్ లో స్టేట్ గెస్ట్ గ వున్నారు. ఇండియా ను ఒక కమ్యూనిస్ట్ దేశం గ మార్చాలనే స్టాలిన్ ప్రయత్నాలను నెహ్రు అడ్డుకున్నాడు. శాస్త్రి గారి మీద విషప్రయోగం జరిగింది అని భార్య చెప్తున్నప్పుడు, ఆమెకన్నా వేరే వాళ్లకు ఎక్కువ తెలుసా, గుండెపోటు వల్ల మరణిస్తే ఆమెకు తెలియకుండా వుంటుందా, అలా ట్రీట్మెంట్ ఇచ్చిన ఆనవాళ్లు కూడా లేవు.

    కొన్ని విషయాలు కప్పి పుచ్చడం చారిత్రక అవసరం అని అనుకోవాలి ఏమో, లేకపోతె ఇన్ని ప్రభుత్వాలు వచ్చిన ఈ రహస్యాలను బయటపెట్టలేకపోవడమేంటి? ప్రజల మస్తిష్కం లోంచి ఇటువంటి అనుమానాలు తొలగించడానికి కులదీప్ లాంటి వాళ్ళు ప్రభుత్వ సహాయం తో చేసిన ప్రయత్నాలు ఫలించలేదు అనడానికి మీరు ఇప్పుడు రాసిన ఈ ఆర్టికల్ నే ఒక ఉదాహరణ. ఆ నిజం ఎప్పటికి బయటకు రాకూడదని భావిద్దాం

  2. శాస్త్రి గారి మరణం గురించి తెలియాలంటే బోసు గారి మరణం గురించి తెలియాలి. వీరిద్దరి కలయిక గురించి అసలు మీరు రాయలేదు, బహుశా అది ఎక్కడ రాసి లేదేమో, ఉంటే రాసేవారు కదా? నెహ్రు మరణాంతరం ఒక బాబా, బోసు పోలికలతో సరిపోయే వ్యక్తి అంత్యక్రియలకు వచ్చినప్పుడు, శాస్త్రి గారు హుటాహుటిన అతన్ని కలుసుకుని కార్ దగ్గరకు సాగనంపారు. ఆ ఫోటో లో వ్యక్తి బోసు కాదు అని ప్రభుత్వం క్లారిఫికేషన్ ఇవ్వడం కొసమెరుపు. బోసు అప్పటి సోవియట్ యూనియన్ లో స్టేట్ గెస్ట్ గ వున్నారు. ఇండియా ను ఒక కమ్యూనిస్ట్ దేశం గ మార్చాలనే స్టాలిన్ ప్రయత్నాలను నెహ్రు అడ్డుకున్నాడు. శాస్త్రి గారి మీద విషప్రయోగం జరిగింది అని భార్య చెప్తున్నప్పుడు, ఆమెకన్నా వేరే వాళ్లకు ఎక్కువ తెలుసా, గుండెపోటు వల్ల మరణిస్తే ఆమెకు తెలియకుండా వుంటుందా, అలా ట్రీట్మెంట్ ఇచ్చిన ఆనవాళ్లు కూడా లేవు.

    కొన్ని విషయాలు కప్పి పుచ్చడం చారిత్రక అవసరం అని అనుకోవాలి ఏమో, లేకపోతె ఇన్ని ప్రభుత్వాలు వచ్చిన ఈ రహస్యాలను బయటపెట్టలేకపోవడమేంటి? ప్రజల మస్తిష్కం లోంచి ఇటువంటి అనుమానాలు తొలగించడానికి కులదీప్ లాంటి వాళ్ళు ప్రభుత్వ సహాయం తో చేసిన ప్రయత్నాలు ఫలించలేదు అనడానికి మీరు ఇప్పుడు రాసిన ఈ ఆ/ర్టి/క/ల్ నే ఒక ఉదాహరణ. ఆ నిజం ఎప్పటికి బయటకు రాకూడదని భావిద్దాం.

  3. శాస్త్రి గారి మరణం గురించి తెలియాలంటే బోసు గారి మరణం గురించి తెలియాలి. వీరిద్దరి కలయిక గురించి అసలు మీరు రాయలేదు, బహుశా అది ఎక్కడ రాసి లేదేమో, ఉంటే రాసేవారు కదా? నెహ్రు మరణాంతరం ఒక బాబా, బోసు పోలికలతో సరిపోయే వ్యక్తి అంత్యక్రియలకు వచ్చినప్పుడు, శాస్త్రి గారు హుటాహుటిన అతన్ని కలుసుకుని కార్ దగ్గరకు సాగనంపారు. ఆ ఫోటో లో వ్యక్తి బోసు కాదు అని ప్రభుత్వం క్లారిఫికేషన్ ఇవ్వడం కొసమెరుపు. బోసు అప్పటి సోవియట్ యూనియన్ లో స్టేట్ గెస్ట్ గ వున్నారు. ఇండియా ను ఒక కమ్యూనిస్ట్ దేశం గ మార్చాలనే స్టాలిన్ ప్రయత్నాలను నెహ్రు అడ్డుకున్నాడు. శాస్త్రి గారి మీద విషప్రయోగం జరిగింది అని భార్య చెప్తున్నప్పుడు, ఆమెకన్నా వేరే వాళ్లకు ఎక్కువ తెలుసా, గుండెపోటు వల్ల మరణిస్తే ఆమెకు తెలియకుండా వుంటుందా, అలా ట్రీట్మెంట్ ఇచ్చిన ఆనవాళ్లు కూడా లేవు.

    కొన్ని విషయాలు కప్పి పుచ్చడం చారిత్రక అవసరం అని అనుకోవాలి ఏమో, లేకపోతె ఇన్ని ప్రభుత్వాలు వచ్చిన ఈ రహస్యాలను బయటపెట్టలేకపోవడమేంటి?

  4. శాస్త్రి గారి మరణం గురించి తెలియాలంటే బోసు గారి మరణం గురించి తెలియాలి. వీరిద్దరి కలయిక గురించి అసలు మీరు రాయలేదు, బహుశా అది ఎక్కడ రాసి లేదేమో, ఉంటే రాసేవారు కదా? నెహ్రు మరణాంతరం ఒక బాబా, బోసు పోలికలతో సరిపోయే వ్యక్తి అంత్యక్రియలకు వచ్చినప్పుడు, శాస్త్రి గారు హుటాహుటిన అతన్ని కలుసుకుని కార్ దగ్గరకు సాగనంపారు. ఆ ఫోటో లో వ్యక్తి బోసు కాదు అని ప్రభుత్వం క్లారిఫికేషన్ ఇవ్వడం కొసమెరుపు. బోసు అప్పటి సోవియట్ యూనియన్ లో స్టేట్ గెస్ట్ గ వున్నారు. ఇండియా ను ఒక కమ్యూనిస్ట్ దేశం గ మార్చాలనే స్టా/ లి/న్ ప్రయత్నాలను నెహ్రు అడ్డుకున్నాడు. శాస్త్రి గారి మీద విషప్రయోగం జరిగింది అని భార్య చెప్తున్నప్పుడు, ఆమెకన్నా వేరే వాళ్లకు ఎక్కువ తెలుసా, గుండెపోటు వల్ల మరణిస్తే ఆమెకు తెలియకుండా వుంటుందా, అలా ట్రీట్మెంట్ ఇచ్చిన ఆనవాళ్లు కూడా లేవు.

    కొన్ని విషయాలు కప్పి పుచ్చడం చారిత్రక అవసరం అని అనుకోవాలి ఏమో, లేకపోతె ఇన్ని ప్రభుత్వాలు వచ్చిన ఈ రహస్యాలను బయటపెట్టలేకపోవడమేంటి? ప్రజల మస్తిష్కం లోంచి ఇటువంటి అనుమానాలు తొలగించడానికి కులదీప్ లాంటి వాళ్ళు ప్రభుత్వ సహాయం తో చేసిన ప్రయత్నాలు ఫలించలేదు అనడానికి మీరు ఇప్పుడు రాసిన ఈ ఆ/ర్టి/క/ల్ నే ఒక ఉదాహరణ. ఆ నిజం ఎప్పటికి బయటకు రాకూడదని భావిద్దాం.

  5. శాస్త్రి గారి మరణం గురించి తెలియాలంటే బోసు గారి మరణం గురించి తెలియాలి. వీరిద్దరి కలయిక గురించి అసలు మీరు రాయలేదు, బహుశా అది ఎక్కడ రాసి లేదేమో, ఉంటే రాసేవారు కదా? నెహ్రు మరణాంతరం ఒక బాబా, బోసు పోలికలతో సరిపోయే వ్యక్తి అంత్యక్రియలకు వచ్చినప్పుడు, శాస్త్రి గారు హుటాహుటిన అతన్ని కలుసుకుని కార్ దగ్గరకు సాగనంపారు. ఆ ఫోటో లో వ్యక్తి బోసు కాదు అని ప్రభుత్వం క్లారిఫికేషన్ ఇవ్వడం కొసమెరుపు. బోసు అప్పటి సోవియట్ యూనియన్ లో స్టేట్ గెస్ట్ గ వున్నారు. ఇండియా ను ఒక కమ్యూనిస్ట్ దేశం గ మార్చాలనే స్టా/ లి/న్ ప్రయత్నాలను నెహ్రు అడ్డుకున్నాడు. శాస్త్రి గారి మీద వి/ష/ప్ర/యో/గం జరిగింది అని భార్య చెప్తున్నప్పుడు, ఆమెకన్నా వేరే వాళ్లకు ఎక్కువ తెలుసా, గుండెపోటు వల్ల మరణిస్తే ఆమెకు తెలియకుండా వుంటుందా, అలా ట్రీట్మెంట్ ఇచ్చిన ఆనవాళ్లు కూడా లేవు.

    కొన్ని విషయాలు కప్పి పుచ్చడం చారిత్రక అవసరం అని అనుకోవాలి ఏమో, లేకపోతె ఇన్ని ప్రభుత్వాలు వచ్చిన ఈ రహస్యాలను బయటపెట్టలేకపోవడమేంటి? ప్రజల మస్తిష్కం లోంచి ఇటువంటి అనుమానాలు తొలగించడానికి కులదీప్ లాంటి వాళ్ళు ప్రభుత్వ సహాయం తో చేసిన ప్రయత్నాలు ఫలించలేదు అనడానికి మీరు ఇప్పుడు రాసిన ఈ ఆ/ర్టి/క/ల్ నే ఒక ఉదాహరణ. ఆ నిజం ఎప్పటికి బయటకు రాకూడదని భావిద్దాం.

  6. శాస్త్రి గారి మరణం గురించి తెలియాలంటే బోసు గారి మరణం గురించి తెలియాలి. వీరిద్దరి కలయిక గురించి అసలు మీరు రాయలేదు, బహుశా అది ఎక్కడ రాసి లేదేమో, ఉంటే రాసేవారు కదా? నెహ్రు మరణాంతరం ఒక బాబా, బోసు పోలికలతో సరిపోయే వ్యక్తి అంత్యక్రియలకు వచ్చినప్పుడు, శాస్త్రి గారు హుటాహుటిన అతన్ని కలుసుకుని కార్ దగ్గరకు సాగనంపారు. ఆ ఫోటో లో వ్యక్తి బోసు కాదు అని ప్రభుత్వం క్లారిఫికేషన్ ఇవ్వడం కొసమెరుపు. బోసు అప్పటి సోవియట్ యూనియన్ లో స్టేట్ గెస్ట్ గ వున్నారు. ఇండియా ను ఒక కమ్యూనిస్ట్ దేశం గ మార్చాలనే స్టా/ లి/న్ ప్రయత్నాలను నెహ్రు అడ్డుకున్నాడు. శాస్త్రి గారి మీద వి/ష/ప్ర/యో/గం జరిగింది అని భార్య చెప్తున్నప్పుడు, ఆమెకన్నా వేరే వాళ్లకు ఎక్కువ తెలుసా, గుండెపోటు వల్ల మరణిస్తే ఆమెకు తెలియకుండా వుంటుందా, అలా ట్రీట్మెంట్ ఇచ్చిన ఆనవాళ్లు కూడా లేవు.

    ప్రజల మస్తిష్కం లోంచి ఇటువంటి అనుమానాలు తొలగించడానికి కులదీప్ లాంటి వాళ్ళు ప్రభుత్వ సహాయం తో చేసిన ప్రయత్నాలు ఫలించలేదు అనడానికి మీరు ఇప్పుడు రాసిన ఈ ఆ/ర్టి/క/ల్ నే ఒక ఉదాహరణ. ఆ నిజం ఎప్పటికి బయటకు రాకూడదని భావిద్దాం.

  7. శాస్త్రి గారి మరణం గురించి తెలియాలంటే బోసు గారి మరణం గురించి తెలియాలి. వీరిద్దరి కలయిక గురించి అసలు మీరు రాయలేదు, బహుశా అది ఎక్కడ రాసి లేదేమో, ఉంటే రాసేవారు కదా? నెహ్రు మరణాంతరం ఒక బాబా, బోసు పోలికలతో సరిపోయే వ్యక్తి అంత్యక్రియలకు వచ్చినప్పుడు, శాస్త్రి గారు హుటాహుటిన అతన్ని కలుసుకుని కార్ దగ్గరకు సాగనంపారు. ఆ ఫోటో లో వ్యక్తి బోసు కాదు అని ప్రభుత్వం క్లారిఫికేషన్ ఇవ్వడం కొసమెరుపు. బోసు అప్పటి సోవియట్ యూనియన్ లో స్టేట్ గెస్ట్ గ వున్నారు. ఇండియా ను ఒక కమ్యూనిస్ట్ దేశం గ మార్చాలనే స్టా/ లి/న్ ప్రయత్నాలను నెహ్రు అడ్డుకున్నాడు. శాస్త్రి గారి మీద వి/ష/ప్ర/యో/గం జరిగింది అని భార్య చెప్తున్నప్పుడు, ఆమెకన్నా వేరే వాళ్లకు ఎక్కువ తెలుసా?

    కొన్ని విషయాలు కప్పి పుచ్చడం చారిత్రక అవసరం అని అనుకోవాలి ఏమో, లేకపోతె ఇన్ని ప్రభుత్వాలు వచ్చిన ఈ రహస్యాలను బయటపెట్టలేకపోవడమేంటి? ప్రజల మస్తిష్కం లోంచి ఇటువంటి అనుమానాలు తొలగించడానికి కులదీప్ లాంటి వాళ్ళు ప్రభుత్వ సహాయం తో చేసిన ప్రయత్నాలు ఫలించలేదు అనడానికి మీరు ఇప్పుడు రాసిన ఈ ఆ/ర్టి/క/ల్ నే ఒక ఉదాహరణ. ఆ నిజం ఎప్పటికి బయటకు రాకూడదని భావిద్దాం.

  8. శాస్త్రి గారి మరణం గురించి తెలియాలంటే బోసు గారి మరణం గురించి తెలియాలి. వీరిద్దరి కలయిక గురించి అసలు మీరు రాయలేదు, బహుశా అది ఎక్కడ రాసి లేదేమో, ఉంటే రాసేవారు కదా? నెహ్రు మరణాంతరం ఒక బాబా, బోసు పోలికలతో సరిపోయే వ్యక్తి అంత్యక్రియలకు వచ్చినప్పుడు, శాస్త్రి గారు హుటాహుటిన అతన్ని కలుసుకుని కార్ దగ్గరకు సాగనంపారు. ఆ ఫోటో లో వ్యక్తి బోసు కాదు అని ప్రభుత్వం క్లారిఫికేషన్ ఇవ్వడం కొసమెరుపు. బోసు అప్పటి సోవియట్ యూనియన్ లో స్టేట్ గెస్ట్ గ వున్నారు. ఇండియా ను ఒక కమ్యూనిస్ట్ దేశం గ మార్చాలనే స్టా/ లి/న్ ప్రయత్నాలను నెహ్రు అడ్డుకున్నాడు. శాస్త్రి గారి మీద వి/ష/ప్ర/యో/గం జరిగింది అని భార్య చెప్తున్నప్పుడు, ఆమెకన్నా వేరే వాళ్లకు ఎక్కువ తెలుసా, గుండెపోటు వల్ల మరణిస్తే ఆమెకు తెలియకుండా వుంటుందా, అలా ట్రీట్మెంట్ ఇచ్చిన ఆనవాళ్లు కూడా లేవు.

  9. శాస్త్రి గారి మరణం గురించి తెలియాలంటే బోసు గారి మరణం గురించి తెలియాలి. వీరిద్దరి కలయిక గురించి అసలు మీరు రా/య/లే/దు, బహుశా అది ఎక్కడ రాసి లేదేమో, ఉంటే రా/సే/వారు కదా? నెహ్రు మరణాంతరం ఒక బాబా, బోసు పోలికలతో సరిపోయే వ్యక్తి అంత్యక్రియలకు వచ్చినప్పుడు, శాస్త్రి గారు హుటాహుటిన అతన్ని కలుసుకుని కార్ దగ్గరకు సాగనంపారు. ఆ ఫోటో లో వ్యక్తి బోసు కాదు అని ప్రభుత్వం క్లారిఫికేషన్ ఇవ్వడం కొసమెరుపు. బోసు అప్పటి సోవియట్ యూనియన్ లో స్టేట్ గెస్ట్ గ వున్నారు. ఇండియా ను ఒక కమ్యూనిస్ట్ దేశం గ మార్చాలనే స్టా/ లి/న్ ప్రయత్నాలను నెహ్రు అడ్డుకున్నాడు. శాస్త్రి గారి మీద వి/ష/ప్ర/యో/గం జరిగింది అని భార్య చెప్తున్నప్పుడు, ఆమెకన్నా వేరే వాళ్లకు ఎక్కువ తెలుసా, గు0డెపో/టు వల్ల మరణిస్తే ఆమెకు తెలియకుండా వుంటుందా, అలా ట్రీట్మెంట్ ఇచ్చిన ఆనవాళ్లు కూడా లేవు.

    కొన్ని విషయాలు కప్పి పుచ్చడం చారిత్రక అవసరం అని అనుకోవాలి ఏమో, లేకపోతె ఇన్ని ప్రభుత్వాలు వచ్చిన ఈ రహస్యాలను బయటపెట్టలేకపోవడమేంటి? ప్రజల మస్తిష్కం లోంచి ఇటువంటి అనుమానాలు తొలగించడానికి కులదీప్ లాంటి వాళ్ళు ప్రభుత్వ సహాయం తో చేసిన ప్రయత్నాలు ఫలించలేదు అనడానికి మీరు ఇప్పుడు రాసిన ఈ ఆ/ర్టి/క/ల్ నే ఒక ఉదాహరణ. ఆ నిజం ఎప్పటికి బయటకు రాకూడదని భావిద్దాం.

  10. శాస్త్రి గారి మరణం గురించి తెలియాలంటే బోసు గారి మరణం గురించి తెలియాలి. వీరిద్దరి కలయిక గురించి అసలు మీరు రా/య/లే/దు, బహుశా అది ఎక్కడ రాసి లేదేమో, ఉంటే రా/సే/వారు కదా? నెహ్రు మరణాంతరం ఒక బాబా, బోసు పోలికలతో సరిపోయే వ్యక్తి అంత్యక్రియలకు వచ్చినప్పుడు, శాస్త్రి గారు హుటాహుటిన అతన్ని కలుసుకుని కార్ దగ్గరకు సాగనంపారు. ఆ ఫోటో లో వ్యక్తి బోసు కాదు అని ప్రభుత్వం క్లారిఫికేషన్ ఇవ్వడం కొసమెరుపు. బోసు అప్పటి సోవియట్ యూనియన్ లో స్టేట్ గెస్ట్ గ వున్నారు. ఇండియా ను ఒక కమ్యూనిస్ట్ దేశం గ మార్చాలనే స్టా/ లి/న్ ప్రయత్నాలను నెహ్రు అడ్డుకున్నాడు.

    కొన్ని విషయాలు కప్పి పుచ్చడం చారిత్రక అవసరం అని అనుకోవాలి ఏమో, లేకపోతె ఇన్ని ప్రభుత్వాలు వచ్చిన ఈ రహస్యాలను బయటపెట్టలేకపోవడమేంటి? ప్రజల మస్తిష్కం లోంచి ఇటువంటి అనుమానాలు తొలగించడానికి కులదీప్ లాంటి వాళ్ళు ప్రభుత్వ సహాయం తో చేసిన ప్రయత్నాలు ఫలించలేదు అనడానికి మీరు ఇప్పుడు రాసిన ఈ ఆ/ర్టి/క/ల్ నే ఒక ఉదాహరణ. ఆ నిజం ఎప్పటికి బయటకు రాకూడదని భావిద్దాం.

  11. నెహ్రు మరణాంతరం ఒక బాబా, బోసు పోలికలతో సరిపోయే వ్యక్తి అంత్యక్రియలకు వచ్చినప్పుడు, శాస్త్రి గారు హుటాహుటిన అతన్ని కలుసుకుని కార్ దగ్గరకు సాగనంపారు. ఆ ఫోటో లో వ్యక్తి బోసు కాదు అని ప్రభుత్వం క్లారిఫికేషన్ ఇవ్వడం కొసమెరుపు. బోసు అప్పటి సోవియట్ యూనియన్ లో స్టేట్ గెస్ట్ గ వున్నారు. ఇండియా ను ఒక కమ్యూనిస్ట్ దేశం గ మార్చాలనే స్టా/ లి/న్ ప్రయత్నాలను నెహ్రు అడ్డుకున్నాడు. శాస్త్రి గారి మీద వి/ష/ప్ర/యో/గం జరిగింది అని భార్య చెప్తున్నప్పుడు, ఆమెకన్నా వేరే వాళ్లకు ఎక్కువ తెలుసా, గు0డెపో/టు వల్ల మరణిస్తే ఆమెకు తెలియకుండా వుంటుందా, అలా ట్రీట్మెంట్ ఇచ్చిన ఆనవాళ్లు కూడా లేవు.

    కొన్ని విషయాలు కప్పి పుచ్చడం చారిత్రక అవసరం అని అనుకోవాలి ఏమో, లేకపోతె ఇన్ని ప్రభుత్వాలు వచ్చిన ఈ రహస్యాలను బయటపెట్టలేకపోవడమేంటి? ప్రజల మస్తిష్కం లోంచి ఇటువంటి అనుమానాలు తొలగించడానికి కులదీప్ లాంటి వాళ్ళు ప్రభుత్వ సహాయం తో చేసిన ప్రయత్నాలు ఫలించలేదు అనడానికి మీరు ఇప్పుడు రాసిన ఈ ఆ/ర్టి/క/ల్ నే ఒక ఉదాహరణ. ఆ నిజం ఎప్పటికి బయటకు రాకూడదని భావిద్దాం.

  12. శాస్త్రి గారి మరణం గురించి తెలియాలంటే బోసు గారి మరణం గురించి తెలియాలి. వీరిద్దరి కలయిక గురించి అసలు మీరు రా/య/లే/దు, బహుశా అది ఎక్కడ రాసి లేదేమో, ఉంటే రా/సే/వారు కదా? నెహ్రు మరణాంతరం ఒక బాబా, బోసు పోలికలతో సరిపోయే వ్యక్తి అంత్యక్రియలకు వచ్చినప్పుడు, శాస్త్రి గారు హుటాహుటిన అతన్ని కలుసుకుని కార్ దగ్గరకు సాగనంపారు. ఆ ఫోటో లో వ్యక్తి బోసు కాదు అని ప్రభుత్వం క్లారిఫికేషన్ ఇవ్వడం కొసమెరుపు.

    కొన్ని విషయాలు కప్పి పుచ్చడం చారిత్రక అవసరం అని అనుకోవాలి ఏమో, లేకపోతె ఇన్ని ప్రభుత్వాలు వచ్చిన ఈ రహస్యాలను బయటపెట్టలేకపోవడమేంటి? ప్రజల మస్తిష్కం లోంచి ఇటువంటి అనుమానాలు తొలగించడానికి కులదీప్ లాంటి వాళ్ళు ప్రభుత్వ సహాయం తో చేసిన ప్రయత్నాలు ఫలించలేదు అనడానికి మీరు ఇప్పుడు రాసిన ఈ ఆ/ర్టి/క/ల్ నే ఒక ఉదాహరణ. ఆ నిజం ఎప్పటికి బయటకు రాకూడదని భావిద్దాం.

  13. నెహ్రు మరణాంతరం ఒక బాబా, బోసు పోలికలతో సరిపోయే వ్యక్తి అంత్యక్రియలకు వచ్చినప్పుడు, శాస్త్రి గారు హుటాహుటిన అతన్ని కలుసుకుని కార్ దగ్గరకు సాగనంపారు. ఆ ఫోటో లో వ్యక్తి బోసు కాదు అని ప్రభుత్వం క్లారిఫికేషన్ ఇవ్వడం కొసమెరుపు. బోసు అప్పటి సోవియట్ యూనియన్ లో స్టేట్ గెస్ట్ గ వున్నారు. ఇండియా ను ఒక కమ్యూనిస్ట్ దేశం గ మార్చాలనే స్టా/ లి/న్ ప్రయత్నాలను నెహ్రు అడ్డుకున్నాడు. శాస్త్రి గారి మీద వి/ష/ప్ర/యో/గం జరిగింది అని భార్య చెప్తున్నప్పుడు, ఆమెకన్నా వేరే వాళ్లకు ఎక్కువ తెలుసా, గు0డెపో/టు వల్ల మరణిస్తే ఆమెకు తెలియకుండా వుంటుందా, అలా ట్రీట్మెంట్ ఇచ్చిన ఆనవాళ్లు కూడా లేవు.

    కొన్ని విషయాలు కప్పి పుచ్చడం చారిత్రక అవసరం అని అనుకోవాలి ఏమో, లేకపోతె ఇన్ని ప్రభుత్వాలు వచ్చిన ఈ రహస్యాలను బయటపెట్టలేకపోవడమేంటి? ప్రజల మస్తిష్కం లోంచి ఇటువంటి అనుమానాలు తొలగించడానికి కులదీప్ లాంటి వాళ్ళు ప్రభుత్వ సహాయం తో చేసిన ప్రయత్నాలు ఫలించలేదు అనడానికి మీరు ఇప్పుడు రాసిన ఈ ఆ/ర్టి/క/ల్ నే ఒక ఉదాహరణ. ఆ నిజం ఎప్పటికి బయటకు రాకూడదని భావిద్దాం.

  14. శాస్త్రి గారి మరణం గురించి తెలియాలంటే బోసు గారి మరణం గురించి తెలియాలి. వీరిద్దరి కలయిక గురించి అసలు మీరు రా/య/లే/దు, బహుశా అది ఎక్కడ రాసి లేదేమో, ఉంటే రా/సే/వారు కదా? నెహ్రు మరణాంతరం ఒక బాబా, బోసు పోలికలతో సరిపోయే వ్యక్తి అంత్యక్రియలకు వచ్చినప్పుడు, శాస్త్రి గారు హుటాహుటిన అతన్ని కలుసుకుని కార్ దగ్గరకు సాగనంపారు. ఆ ఫోటో లో వ్యక్తి బోసు కాదు అని ప్రభుత్వం క్లారిఫికేషన్ ఇవ్వడం కొసమెరుపు.

  15. నెహ్రు మరణాంతరం ఒక బాబా, బోసు పోలికలతో సరిపోయే వ్యక్తి అంత్యక్రియలకు వచ్చినప్పుడు, శాస్త్రి గారు హుటాహుటిన అతన్ని కలుసుకుని కార్ దగ్గరకు సాగనంపారు. ఆ ఫోటో లో వ్యక్తి బోసు కాదు అని ప్రభుత్వం క్లారిఫికేషన్ ఇవ్వడం కొసమెరుపు. బోసు అప్పటి సోవియట్ యూనియన్ లో స్టేట్ గెస్ట్ గ వున్నారు. ఇండియా ను ఒక కమ్యూనిస్ట్ దేశం గ మార్చాలనే స్టా/ లి/న్ ప్రయత్నాలను నెహ్రు అడ్డుకున్నాడు. శాస్త్రి గారి మీద వి/ష/ప్ర/యో/గం జరిగింది అని భార్య చెప్తున్నప్పుడు, ఆమెకన్నా వేరే వాళ్లకు ఎక్కువ తెలుసా, గు0డెపో/టు వల్ల మరణిస్తే ఆమెకు తెలియకుండా వుంటుందా, అలా ట్రీట్మెంట్ ఇచ్చిన ఆనవాళ్లు కూడా లేవు.

    కొన్ని విషయాలు కప్పి పుచ్చడం చారిత్రక అవసరం అని అనుకోవాలి ఏమో, లేకపోతె ఇన్ని ప్రభుత్వాలు వచ్చిన ఈ రహస్యాలను బయటపెట్టలేకపోవడమేంటి? ప్రజల మస్తిష్కం లోంచి ఇటువంటి అనుమానాలు తొలగించడానికి కులదీప్ లాంటి వాళ్ళు ప్రభుత్వ సహాయం తో చేసిన ప్రయత్నాలు ఫలించలేదు అనడానికి మీరు ఇప్పుడు రాసిన ఈ ఆ/ర్టి/క/ల్ నే ఒక ఉదాహరణ. ఆ నిజం ఎప్పటికి బయటకు రాకూడదని భావిద్దాం.

  16. శాస్త్రి గారి మరణం గురించి తెలియాలంటే బోసు గారి మరణం గురించి తెలియాలి. వీరిద్దరి కలయిక గురించి అసలు మీరు రా/య/లే/దు, బహుశా అది ఎక్కడ రాసి లేదేమో, ఉంటే రా/సే/వారు కదా?

    కొన్ని విషయాలు కప్పి పుచ్చడం చారిత్రక అవసరం అని అనుకోవాలి ఏమో, లేకపోతె ఇన్ని ప్రభుత్వాలు వచ్చిన ఈ రహస్యాలను బయటపెట్టలేకపోవడమేంటి? ప్రజల మస్తిష్కం లోంచి ఇటువంటి అనుమానాలు తొలగించడానికి కులదీప్ లాంటి వాళ్ళు ప్రభుత్వ సహాయం తో చేసిన ప్రయత్నాలు ఫలించలేదు అనడానికి మీరు ఇప్పుడు రాసిన ఈ ఆ/ర్టి/క/ల్ నే ఒక ఉదాహరణ. ఆ నిజం ఎప్పటికి బయటకు రాకూడదని భావిద్దాం.

  17. కొన్ని విషయాలు కప్పి పుచ్చడం చారిత్రక అవసరం అని అనుకోవాలి ఏమో, లేకపోతె ఇన్ని ప్రభుత్వాలు వచ్చిన ఈ రహస్యాలను బయటపెట్టలేకపోవడమేంటి? ప్రజల మస్తిష్కం లోంచి ఇటువంటి అనుమానాలు తొలగించడానికి కులదీప్ లాంటి వాళ్ళు ప్రభుత్వ సహాయం తో చేసిన ప్రయత్నాలు ఫలించలేదు అనడానికి మీరు ఇప్పుడు రాసిన ఈ ఆ/ర్టి/క/ల్ నే ఒక ఉదాహరణ. ఆ నిజం ఎప్పటికి బయటకు రాకూడదని భావిద్దాం.

Comments are closed.