నందమూరి మోక్షజ్ఙ తెర మీదకు వచ్చే సమయం ఆసన్నమైంది. హనుమాన్ లాంటి బ్లాక్ బస్టర్ తీసిన ప్రశాంత్ వర్మ దర్శకుడు. బాలకృష్ణ కుమార్తె, మోక్షు సోదరి తేజస్విని నిర్మాతగా వ్యవహరించే అవకాశం వుంది. మరో బ్యానర్ యాడ్ చేస్తారా లేదా అన్నది తెలియాల్సి వుంది.
విశాఖ ఎంపీ భరత్ భార్య తేజస్విని నిర్మాతగా మారాలని దాదాపు ఏడాదిన్నరగా పట్టుదలగా వున్నారు. తండ్రి బాలయ్య వెంటే వుంటూ మొత్తం అన్నీ పరిశీలిస్తున్నారు.
ప్రస్తుతం ఆషాఢం, మూఢం నడుస్తోంది. అందువల్ల దాని తరువాత అనౌన్స్ మెంట్ వుంటుంది. ప్రశాంత్ వర్మ వైవిధ్యమైన సినిమాలు అందిస్తూ వస్తున్నారు. తేజు సజ్జ తో రెండు సినిమాలు తీసి, రెండూ హిట్ కొట్టారు. హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా దర్శకుడిగా మారారు. కొత్త, యంగ్ హీరో లను ప్రెజెంట్ చేయడంలో ప్రశాంత్ వర్మ కు టాలెంట్ వుంది.
అందువల్ల మోక్షు ఎంట్రీకి ప్రశాంత్ వర్మ సరైన చాయిస్ అనుకోవాలి. సబ్జెక్ట్ ల ఎంపిక విషయంలో బాలయ్య ఇటీవల బాగానే పదును తేలారు. దర్శకులు చెప్పిన దానికి తల ఊపేయడం లేదు. అందువల్ల ప్రశాంత్ వర్మ- బాలయ్య కలిసి మంచి కథనే మోక్షు కోసం సిద్దం చేస్తారు. అందులో సందేహం లేదు.