నిర్మాతల కష్టాలు నిర్మాతలవే. అవి హీరోలకు అనవసరం. ఇచ్చిన మాట ప్రకారం పేమెంట్ చేయాల్సిందే. చెన్నయ్ వర్గాల్లో వినిపిస్తున్న గ్యాసిప్ ప్రకారం ఇండియన్ 2 రెమ్యూనిరేషన్ బకాయి విషయంలో లైకా సంస్ధకు, హీరో కమల్ హాసన్ కు మధ్య చిన్న గ్యాప్ వచ్చినట్లు తెలుస్తోంది.
తనకు ఇవ్వాల్సిన రెమ్యనిరేషన్ బకాయి మొత్తం ఇప్పుడే ఇవ్వాలని కమల్ పట్టుపట్టినట్లు తెలుస్తోంది. ఇండియన్ 3 వున్నందున అప్పుడు ఇస్తామని నిర్మాతలు నచ్చ చెప్పే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. చెన్నయ్ వర్గాల నుంచి వినిపిస్తున్న ఈ విషయం ఎంత వరకు నిజమన్నది తెలియదు. కానీ గ్యాసిప్ మాత్రం బలంగా వినిపిస్తోంది.
కానీ కమల్ వినకపోవడంతో, తెల్లవారి విడుదల కావాల్సి వుండడంతో, లాస్ట్ మినిట్ లో రెమ్యూనిరేషన్ సర్దుబాటు చేసినట్లు బలమైన గ్యాసిప్ వినిపిస్తోంది. లైకా సంస్ధ చాలా బలమైన సంస్థ. కానీ వరుసగా చాలా దెబ్బలు తినడంతో ఆర్ధిక ఇబ్బందులు తప్పడం లేదని తెలుస్తోంది. ఇండియన్ 2 షూటింగ్ సమయంలోనే అర్జంట్ గా హైదరాబాద్ వచ్చి తెలుగు హక్కుల విషయంలో రికవరబుల్ హామీ ఇచ్చి ఇరవై కోట్ల అడ్వాన్స్ తీసుకెళ్లారని తెలుస్తోంది.
ఎలాంటి పెద్ద సంస్థ అయినా సినిమా నిర్మాణంలో దిగిన తరువాత జాగ్రత్తగా కాకుండా దూకుడుగా వెళ్తే, అయితే అటు లేకుంటే ఇటు వుంటుంది ఫలితం. సరైన హిట్ లు పడితే తమంత వారు వుండరు. అలా కాకపోతే ఎన్ని వందల కోట్లు అయినా ఇక్కడ సరిపోవు.