అమ్మాయిలు నా జీవితానికి హానికరం – రాజ్ తరుణ్

“మీకు ఓ అమ్మాయి గురించి చెప్పాలి. నా జీవితంలో అమ్మాయిల టాపిక్ గురించి మాట్లాడతానని అస్సలు అనుకోలేదు. ఒసేయ్ నువ్వు ఎక్కడున్నా పట్టుకుంటా.. నీ అంతు చూస్తా.. నీ ఫొటో ఆన్ లైన్లో పెడతా..”…

“మీకు ఓ అమ్మాయి గురించి చెప్పాలి. నా జీవితంలో అమ్మాయిల టాపిక్ గురించి మాట్లాడతానని అస్సలు అనుకోలేదు. ఒసేయ్ నువ్వు ఎక్కడున్నా పట్టుకుంటా.. నీ అంతు చూస్తా.. నీ ఫొటో ఆన్ లైన్లో పెడతా..”

స్వయంగా రాజ్ తరుణ్ చెప్పిన మాటలివి. అయితే ఇవి ఇప్పటివి కాదు, రెండేళ్ల కిందటి మాటలు. పైగా తన లైఫ్ కు సంబంధించినవి కూడా కాదు. ఓటీటీలో అప్పట్లో ఓ వెబ్ సిరీస్ చేశాడు రాజ్ తరుణ్. ఆ సిరీస్ ప్రమోషన్ లో భాగంగా ఓ వీడియో రిలీజ్ చేశాడు.

ఇప్పుడా వీడియో తెగ వైరల్ అవుతోంది. ప్రస్తుతం లావణ్యకు సంబంధించిన వివాదంలో రాజ్ తరుణ్ ఇరుక్కుపోయిన సంగతి తెలిసిందే. రాజ్ తరుణ్ తన భర్త అని, మాల్వి మల్హోత్రా అనే హీరోయిన్ తన భర్తను లాక్కుందని లావణ్య ఆరోపిస్తోంది.

రాజ్ తరుణ్ తనకు అబార్షన్ చేయించాడని, ప్రస్తుతం తన చావు కోరుకుంటున్నాడని కూడా ఆమె సంచలన ఆరోపణలు చేసింది. ఈ మొత్తం వ్యవహారానికి సింక్ అయ్యేలా ఉండడంతో, రెండేళ్ల కిందటి ఆ వీడియోను వైరల్ చేస్తున్నారు జనం.

త్వరలోనే సీన్ లోకి అరియానా..?

రాజ్ తరుణ్ పై ఆరోపణలు చేసే క్రమంలో కొంతమంది హీరోయిన్ల పేర్లను లావణ్య ప్రస్తావించింది. హీరోయిన్లు షాలినీ, రిద్దీ కుమార్ తో రాజ్ తరుణ్ కు ఎఫైర్ ఉందని.. బిగ్ బాస్ ఫేమ్ అరియానా గ్లోరీతో కూడా ఎపైర్ సాగించాడంటూ చెప్పుకొచ్చింది.

దీనికి సంబంధించి షాలినీ, రిద్దీ కుమార్ ఇప్పటివరకు స్పందించలేదు. అరియానా మాత్రం త్వరలోనే ఈ వివాదంపై స్పందిస్తుందని అంటున్నారు. మాల్వి మల్హోత్రా తరహాలోనే అరియానా కూడా పోలీస్ స్టేషన్ లో కంప్లయింట్ ఇస్తుందని సమాచారం.