మాజీ ఎమ్మెల్యే భార్య రోడ్డుపై నిలబడాలా?

చంద్రబాబు నాయుడు రోడ్డు మీద వెళుతుండగా తన కాన్వాయ్ ఆపించి, రోడ్డు పక్కన నిలబడి ఉన్న ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. వారి సమస్యలను విన్నారు. పరిష్కారానికి ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి…

చంద్రబాబు నాయుడు రోడ్డు మీద వెళుతుండగా తన కాన్వాయ్ ఆపించి, రోడ్డు పక్కన నిలబడి ఉన్న ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. వారి సమస్యలను విన్నారు. పరిష్కారానికి ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తీ.. రోడ్డు మీద వెళ్తుండగా ప్రజలను చూసి ఆగడం.. కార్య విజ్ఞప్తులు స్వీకరించడం విశేషమే.

అయితే రోడ్డు పక్కన నిలిచి ఉన్న ప్రజలలో మాజీ ఎమ్మెల్యే శివేరి సోమ భార్య ఇచ్ఛావతి కూడా ఉన్నారు. ఎమ్మెల్యేగా పని చేసిన వ్యక్తి భార్య.. తన బిడ్డ చదువు కోసం.. రోడ్డు పక్కన చేతిలో వినతి పత్రంతో నిల్చుని ఎదురు చూసే పరిస్థితిలో ఉన్నారా అనేది ఇప్పుడు ప్రజల్లో చర్చనీయాంశమవుతోంది.

శివేరి సోమ గతంలో తెలుగుదేశం పార్టీ తరఫున అరకు ఎమ్మెల్యేగా గెలిచారు. సామాన్య కుటుంబానికి చెందిన వ్యక్తి. 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున స్వల్ప మెజారిటీతో గెలిచారు. 2014లో కిడారి సర్వేశ్వర రావు చేతిలో ఓడిపోయారు.  తర్వాతి పరిణామాలలో సర్వేశ్వర రావు కూడా తెలుగుదేశంలో చేరారు. 2018 లో ఈ ఇద్దరు నాయకులూ ఒక పార్టీ కార్యక్రమానికి హాజరై వెళుతుండగా నక్సలైట్లు అటకాయించి ఇద్దరినీ కాల్చి చంపారు.

అయితే, ఇపుడు ప్రజల్లో కలుగుతున్న సందేహం ఏంటంటే.. ఒక టర్మ్ ఎమ్మెల్యేగా గెలిచి ఐదేళ్లపాటు పదవిలో ఉన్న వ్యక్తి కుటుంబం.. తమ కుటుంబాన్ని అడుకోవాల్సిందిగా చేతిలో వినతిపత్రంతో రోడ్ మీద నిల్చునే స్థితిలో ఉందా.. అని అనుకుంటున్నారు. తన బిడ్డ చదువుకు ఆదుకోవాలని ఆమె కొడుకు సహా వచ్చి రోడ్డు మీద నిల్చుని ఉండడం ఆశ్చర్యకరం.

చంద్రబాబు నాయుడు కాన్వాయ్ ఆపి ఆమెతో మాట్లాడి పిల్లవాడి చదువు బాధ్యత మొత్తం తాను చూస్తానని అనడం మంచి పరిణామం. అయితే ఒకప్పటి తమ ఎమ్మెల్యే భార్య నేరుగా అపాయింట్మెంట్ తీసుకుని సిఎం ను కలిసి స్థితిలో లేకపోవడం పట్ల టిడిపి కార్యకర్తలే ఆవేదన చెందుతున్నారు.