తెలంగాణలో బీఆర్ఎస్‌ను ఖాళీ చేసే పనిలో సీఎం రేవంత్‌రెడ్డి నిమగ్నమయ్యారు. గతంలో అధికారంలో ఉన్న కేసీఆర్ పెద్ద ఎత్తున ఫిరాయింపులకు తెరలేపిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్‌కు అదే శాపంగా మారింది. రోజుకో.. రెండు రోజులకు ఒకసారో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నారు.
తమ ఎమ్మెల్యేల్లో ఎవరెప్పుడు జంప్ చేస్తారో అనే భయం బీఆర్ఎస్ అగ్రనేతల్లో నెలకుంది. తాజాగా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కూడా కేసీఆర్‌కు ఝలక్ ఇచ్చారు. సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. శుక్రవారం రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ కాంగ్రెస్‌లో చేరిన సంగతి తెలిసిందే.
ఇప్పటి వరకు దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారు. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బలం 28కి చేరింది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్‌లో అధికార పార్టీకి ఒక్కరంటే ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు. దీంతో గ్రేటర్ హైదరాబాద్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ దృష్టి సారించింది. కాంగ్రెస్ ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తోంది. మరో ఆరుగురు గ్రేటర్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరడానికి సిద్ధంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.