అంబానీ పెళ్లిలో రజనీకాంత్ స్టెప్పులు

అనంత్ అంబానీ పెళ్లి వేడుకలు పీక్ స్టేజ్ కు చేరుకున్నాయి. వేడుకలు చివరి ఘట్టానికి చేరుకున్నాయి. ఈరోజు జరిగిన బరాత్ వేడుక చూడ్డానికి రెండు కళ్లు చాలవు. నార్త్ నుంచి సౌత్ వరకు.. హాలీవుడ్…

అనంత్ అంబానీ పెళ్లి వేడుకలు పీక్ స్టేజ్ కు చేరుకున్నాయి. వేడుకలు చివరి ఘట్టానికి చేరుకున్నాయి. ఈరోజు జరిగిన బరాత్ వేడుక చూడ్డానికి రెండు కళ్లు చాలవు. నార్త్ నుంచి సౌత్ వరకు.. హాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు సెలబ్రిటీలంతా ఒకే వేదికపైకి రావడం అందర్నీ ఆకర్షించింది.

అన్నింటికంటే ఎక్కువగా ఆకర్షించిన అంశం సూపర్ స్టార్ రజనీకాంత్ డాన్స్. పెళ్లికొడుకు అనంత్ తో కలిసి రజనీకాంత్ స్టెప్పులేశారు. ఆయనతో అనీల్ కపూర్ కూడా చిందేశారు. రజనీకాంత్ డ్రెస్సింగ్ స్టయిల్, ఆయన డాన్స్ హైలెట్ గా నిలిచింది.

ఇక వేడుకలో రణ్వీర్ సింగ్, తన డాన్స్ తో అందర్నీ ఆకట్టుకున్నాడు. అటు నెలలు నిండిన దీపిక పదుకోన్ కూడా వేడుకకు హాజరవ్వడం విశేషం. మరో చోట అనన్య పాండే, హార్దిక పాండ్యా కలిసి డాన్స్ చేయడం కనిపించింది.

షారూక్, సల్మాన్, హృతిక్, సంజయ్ దత్, జాన్వి కపూర్, సారా అలీఖాన్, అలియాభట్, ప్రియాంక చోప్రా, కత్రినా కైఫ్.. ఇలా బాలీవుడ్ కు చెందిన దాదాపు ప్రముఖులంతా ఈ వేడుకకు హాజరయ్యారు.

ఇక సౌత్ నుంచి కూడా చాలా మెరుపులున్నాయి. కూతురు సితార, భార్య నమ్రతతో కలిసి మహేష్ బాబు ఈ వేడుకకు హాజరయ్యాడు. రానా తన భార్యతో వచ్చాడు. చరణ్-ఉపాసన దంపతులు హాజరయ్యారు. వెంకటేష్ యష్ లాంటి హీరోలు కూడా వచ్చారు.

రేపు అసలైన శుభ్ అశీర్వాద్ (అసలైన పెళ్లి) వేడుక ఉంటుంది. ఎల్లుండి (14వ తేదీ) మంగళ్ ఉత్సవ్ వేడుక (రిసెప్షన్) నిర్వహిస్తారు. దీంతో దాదాపు 3 నెలలకు పైగా సాగిన అనంత్ అంబానీ, రాధికల వివాహ సంబరాలు ముగుస్తాయి.