Advertisement

Advertisement


Home > Movies - Interviews

జి 2 స్క్రిప్ట్ రెడీ చేస్తున్నా-అడవి శేష్

జి 2 స్క్రిప్ట్ రెడీ చేస్తున్నా-అడవి శేష్

ఇది లాక్ డౌన్ టైమ్...కొందరికి ఇబ్బంది కావచ్చు. కానీ కొంత మందికి ఇది ఓ మంచి సదవకాశం. ముఖ్యంగా క్రియేటివ్ పీపుల్ కి. సినిమా దర్శకులు ఫుల్ గా ఇప్పుడు తమ తమ వ్యాపకాల్లో మునిగిపోయారు. కొత్త అయిడియాలకు పదును పెడుతున్నారు. కొత్త స్క్రిప్ట్ లు తయారు చేసుకుంటున్నారు. అలాంటి దర్శకులను పలకరిస్తే...

అడవి శేష్...హీరో మాత్రమే కాదు. స్క్రిప్ట్ రైటర్ కూడా. అందుకే అతన్ని కూడా క్రియేటివ్ పీపుల్ జాబితాలోకి తీసుకున్నాం. తన స్టయిల్ లో జనాలకు కొత్త ఫీల్ కలిగే సినిమాలు తీస్తూ, అడవి శేష్ సినిమా అంటే ఓ అంచనా, ఓ ఎదురుచూపు వుండేలా చేసుకున్నారు. అలాంటి రైటర్ కమ్ హీరో కరోనా టైమ్ లో ఏం చేస్తున్నారో? 

-హాయ్ శేష్ గారూ..ఏం చేస్తున్నారు

మేజర్ సినిమా ఫార్టీ పర్సంట్ షూట అయిందండీ. డైరక్టర్, ఎడిటర్ వాళ్ల వాళ్ల ఇళ్లలో కూర్చుని వర్క్ చేస్తున్నారు. నేను నా ఇంట్లో కూర్చుని వర్క్ చేస్తున్నా. ముగ్గురం మా వర్క్ ను సింక్ చేసుకుంటున్నాం. అలాగే మేజర్ తరువాత గూఢచారి 2 వుంది కదా, దాని గురించి వర్క్ చేస్తున్నా. ఏదో సీక్వెల్ చేస్తున్నాం అని కాకుండా, రియల్ గా, జెన్యూన్ గా కథ వుండాలనే ప్రయత్నం చేస్తున్నాం.

-గూఢచారి సినిమాకు ఆ రియల్ లోకేషన్లలో షూట్ చేయడం అన్నది ప్లస్ అయింది. సీక్వెల్ కూడా అలాగే ప్లాన్ చేస్తున్నారా?

గూఢచారి ఇండియా లోని లోకేషన్లు. గూఢచారి 2 అన్నీ ఇంటర్నేషనల్ లోకేషన్లు.

-అవునా..కరోనా వచ్చిన తరువాత కూడా విదేశాల్లో షూట్ ప్లానింగ్ నా?

అంటే ఇంకా మేజర్ సినిమా ఫినిష్ చేయాలి. ఆ తరువాత కదా గూఢచారి 2. అప్పటికి అన్నీ చక్కబడతాయి అనుకుంటున్నాను. లేదూ అంటే మళ్లీ ఇండియన్ లోకేషన్ లకు అనుగుణంగా కధ మార్చుకోవడమే.

-మేజర్ సినిమా నేపథ్యం.

తెలిసిందే. మేజర్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా తీస్తున్నాం. ఆయన జీవితం, ఆయన కెరీర్, ఆయన దేశం లోని చాలా రాష్ట్రాల్లో పని చేసారు. కార్గిల్ యుద్దంలో వున్నారు. ఆయన జీవిత గాథ ఆధారంగా అల్లుకున్న కథ.

-అంటే వార్ సీన్లు కూడా బలంగా వుంటాయన్నమాట.

వార్ సీన్ అంటే గుర్తుకు వచ్చింది. ఆ మధ్య మేజర్ సినిమా మేజర్ ఎపిసోడ్ ఒకటి సిమ్లాకు దూరంగా దేశ సరిహద్దులో తీసాం. అక్కడ అప్పుడు మైనస్ 8 డిగ్రీల టెంపరేచర్ వుంది. ఆ టైమ్ లో ఆ బోర్డర్ విలేజ్ లో గట్టిగా వంద కుటుంబాలు లేవు ఆ ఇళ్లలో, వాళ్లతోనే వుండి షూట్ చేసాం. అప్పుడు అర్థం అయింది మన జవాన్లు ఎన్ని కష్టాలు పడుతూ బోర్డర్ లో ఈ దేశాన్ని కాపాడుతున్నారో?

-అంతా బాగానే వుంది కానీ, కాస్త చకచకా సినిమాలు చేయవచ్చుగా.

దాదాపు నాలుగైదేళ్లుగా ఒక్క రోజు రెస్ట్ లేకుండా పని చేస్తున్నా. మీరు ఇంకా చకచకా అంటున్నారు.

-మీరు బడ్జెట్ లో సినిమా చేస్తారు. నిర్మాతకు లాభసాటిగా వున్నారు. జనాలు మీ సినిమాలు లైక్ చేస్తున్నారు. మరి అలాంటపుడు మాకంటే మాకు సినిమా చేయమనే డిమాండ్ వుంటుందిగా.

మీరు అన్నదాంట్లో చాలా పాయింట్లు వున్నాయి. నిర్మాత క్షేమం ఎప్పుడూ చూస్తాను. నిర్మాత అనే కాదు, నేను చేసిన సినిమా విడుదలైన థియేటర్ దగ్గర సైకిల్ స్టాండ్ కూడా నష్టపోకూడదు అని నేను అనుకుంటాను. ఇక బడ్జెట్ లో సినిమా చేయడం అంటారా. తొలి సినిమా చేసి చేతులు కాల్చుకున్న అనుభవం. అలాగే మీరన్నట్లు అయిదారు కమిట్ మెంట్లు వున్నాయి. అన్నీ చేయాలి. కానీ వన్ కండిషన్. ఒక సినిమా తరువాత మరో సినిమానే. ఇప్పుడు ఏడాదికి ఒక సినిమా అవుతోంది. మరింత ఫాస్ట్ గా చేయాలని ప్రయత్నిస్తాను.

-గూఢచారిలో జగపతి బాబు ఓ సర్ప్రయిజ్ ఎలిమెంట్. మళ్లీ పార్ట్ 2 లో కూడా అలా ఏమ్ననా?

వుంటుంది. కానీ ఇప్పుడు రివీల్ చేయలేను. ఓ విషయం అనుకుంటున్నాం. అది ఓకె అయితే మంచి థ్రిల్లింగ్ విషయం మీకు చెబుతాను.

-అయిదారు ప్రాజెక్టులు అన్నారు..వివరాలు

అప్పుడే వద్దు..ఏ సంస్థ ప్రాజెక్టును ఆ సంస్థనే వెల్లడిస్తే బాగుంటుంది. పైగా అన్నీ ఫైనల్ డిస్కషన్లలో వున్నాయి.

-మరి ఇన్ని సినిమాలకు లైన్లు అన్నీ రెడీగా వున్నాయా? కరోనా టైమ్ ను వాటి కోసం వాడుతున్నారా?

కొన్ని లైన్లు వున్నాయి. వాటికి నేను-డైరక్టర్ ను ఇన్ వాల్వ్ చేస్తూ స్క్రిప్ట్ చేస్తాను. లేదా డైరక్టర్ల దగ్గర లైన్ వుంటే నేను ఇన్ వాల్వ్ అయిన స్క్రిప్ట్ చేస్తాను.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?