Advertisement

Advertisement


Home > Movies - Interviews

బాలయ్యతో పటాస్ -అనిల్ రావిపూడి

బాలయ్యతో పటాస్ -అనిల్ రావిపూడి

కరోనా నేపథ్యంలో సినిమాభిమానులు హుషారైన సినిమా వార్తలు లేకుండా డల్ అయిన వేళ క్రేజీ డైరక్టర్ అనిల్ రావిపూడి ఒక్కసారిగా రెండు సినిమాల విశేషాలు చెప్పి, కాస్త కదలిక తెచ్చారు. మహేష్ తో, బాలయ్యతో సినిమాలు వున్నాయని వెల్లడించారు. ఈ నేపథ్యంలో మరిన్ని వివరాల కోసం ఆయనతో చిన్న ముఖాముఖి

ఏమిటి సర్..కరోనా వేళ హడావుడి చేసారు

లేదు..నేను అనుకోలేదు. కరోనా నేపథ్యంలో మాట్లాడాలి అంటే సరే అన్నాను. కానీ టాపిక్ అక్కడకు వెళ్లింది. అదే హైలైట్ అయిపోయి జనంలోకి వెళ్లింది. అయితే ఇవన్నీ ఎప్పటి నుంచో వార్తల్లో వున్నవే. నిజాలే. మహేష్  కథ చెప్పాను. ఆయనకు నచ్చింది. బాలయ్య బాబు కోసం కథ తయారు చేసాను. అది ఆయనకు చెప్పాలి.

వీటి సంగతి పక్కన పెట్టండి..ఎఫ్ 3 ఎంత వరకు వచ్చింది

మరో యాభై రోజులు షూట్ వుంది. ఎప్పుడు షూటింగ్ లు మొదలైతే అప్పటి నుంచి యాభై రోజుల్లో సినిమా రెడీ అవుతుంది. 

ఎఫ్ 2 కంటే ఓ మెట్టు పైన వుంటుందా ఎఫ్ 3..టైటిల్ మాత్రమేనా?

పక్కగా మూడు మెట్లు పైనే వుంటుంది. ఓ రేంజ్ లో వచ్చింది స్క్రిప్ట్.

ఎఫ్ 2 నలభై కోట్ల లోపు బడ్జెట్ లో ఫినిష్ చేసారు. ఇబ్బడిముబ్బడిగా లాభాలు వచ్చాయి. కానీ ఈసారి బడ్జెట్ పెరిగిందేమో?

అదేమీ లేదు. మహా అయితే ఓ పది పదిహేను కోట్లు. అంత కూడా కానివ్వను. వీలయినంత కంట్రోల్ లో వెళ్తాను. అయినా మార్కెట్ ఎఫ్ 2 కన్నా కచ్చితంగా ఎక్కువగా వుంటుందిగా. 

ఇప్పుడు చెప్పండి..బాలయ్య సినిమా సంగతులు. మీ స్టయిల్ లోకి బాలయ్య వస్తారా? బాలయ్య స్టయిల్ లోకి మీరు వెళ్తారా?

కచ్చితంగా బాలయ్య స్టయిల్ లో నా సినిమా వుంటుంది. నేను కూడా మళ్లీ పటాస్ తరువాత ఆ తరహా యాక్షన్ ప్లస్ ఎంటర్ టైన్ మెంట్ సినిమా ఒకటి చేయాలనుకుంటున్నా. అదే ఇది. 

మరి కథ ఎందుకు చెప్పడానికి ఆలస్యం చేస్తున్నారు.

ఓ మాంచి టైటిల్ కోసం ఆలోచిస్తున్నా..అది దొరికిన మర్నాడే బాలయ్య దగ్గర వాలిపోయి కథ వినిపించేస్తా.  

ఎఫ్ 3 తరువాత అదేనా చేసే ప్రాజెక్టు.

అలాగే అనుకోవాలి. మహేష్ బాబు కు కథ చెప్పాను. ఓకె అయింది. కానీ ఆయన రెండు సినిమాలు ప్రస్తుతం ఫినిష్ చేయాల్సి వుంది. 

మహేష్ సినిమాకు నిర్మాత దిల్ రాజునా? అనిల్ సుంకరనా?

అది మహేష్ బాబు ఎలా చెబితే అలా. ఆయన కమిట్ మెంట్ లు ఆయనకు వుంటాయి కదా.

బాలయ్య సినిమాకు నిర్మాత?

ఇంకా అనుకోలేదు. సాహు గారపాటికి ఒక సినిమా చేయాల్సి వుంది. చూడాలి అదే ఇది అవుతుందేమో?

కరోనా ఖాళీ టైమ్ ఈసారి ఎలా గడుపుతున్నారు

ఈసారి పుస్తకాలు చదవడం అలవాటు చేసుకుంటున్నా. గతంలో రెండు పేజీలు చదివితే నిద్ర వచ్చేది. ఇప్పుడు అలా కావడం లేదు. 

ఏ పుస్తకాలు చదివారు

ముళ్లపూడి వారి పుస్తకాలు. సద్గురు రాసిన కర్మ అనే పుస్తకం. అది నాకు భలే నచ్చింది.  మీరేమన్నా మంచి పుస్తకాలు సజెస్ట్ చేయండి వీలైతే.

గాలిసంపత్ గాయం మానిందా?

అది గాయం కాదు. చిన్న డిస్సపాయింట్ మెంట్. నా స్నేహితుడికి సాయం చేయాలనుకున్నారు. వీలు కాలేకపోయింది. జర్నీ అన్నాక అన్ని రకాల అనుభవాలు వుంటాయి కదా. 

మీ బాబు ఎలా వున్నాడు..సరిలేరు నీకెవ్వరు టైమ్ లో కదా పుట్టాడు

అవును..ఏడాదిన్నర వయసు. ఈ మధ్యే చేతి మీద వేడిపాలు ఒంపుకుని కాస్త హడావుడి చేసాడు. ఇప్పుడు బాగానే వున్నాడు. 

ఆఫీసుకు వెళ్తున్నారా?

ఒక్కడినే వెళ్తున్నా..ఒక్కడినే కూర్చుని...రాసుకుని. వచ్చేస్తున్నా.

ఓకె థాంక్యూ సర్  

ధాంక్యూ ...మీరు కూడా కరోనా కేర్ తీసుకోండి జాగ్రత్తగా వుండండి

విఎస్ఎన్ మూర్తి

ఇద్దరూ ఏడ్చేసారు

నేను సింగిల్ గా ఉండిపోతా