Advertisement

Advertisement


Home > Movies - Interviews

అంతా మీడియానే చేసింది-జీవిత

అంతా మీడియానే చేసింది-జీవిత

తమ ఫ్యామిలీ పట్లు వున్న అపోహలకు, వార్తలకు, అభిప్రాయాలకు అన్నింటికీ మీడియానే కారణమని నటి జీవిత అభిప్రాయపడ్డారు. ప్రతి చిన్న విషయాన్ని కూడా గోరింతలు కొండతలు చేసిందని ఆమె అన్నారు. శేఖర్ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఆమె 'గ్రేట్ ఆంధ్ర'తో మాట్లాడారు. తమ విషయంలో ఏ చిన్న సంఘటన జరిగినా మీడియానే ఏదేదో ఊహించుకుని, తనకు తానే అన్నీ ప్రచారం చేసేసిందని అన్నారు.

ఎవరు ఏమనుకున్నా తన పద్దతి తనదే అని, తన స్టయిల్ లోనే తను ముందుకు సాగుతానని జీవిత అన్నారు. ఎవరో అనుకుంటారని, ఏదో అనుకుంటారని తన పద్దతి మార్చుకోనని అన్నారు. ఇప్పటి వరకు రాజశేఖర్ ఏ రాజకీయా పార్టీల్లో చేరలేదని, తాను మాత్రమే భాజపాలో చేరానని అన్నారు. ప్రస్తుతం భాజపాలో వున్నా కూడా అన్ని విధాలా పార్టీ కోసం సదా పని చేసే వీలు లేక ఊరుకున్నా అన్నారు. 

రాజశేఖర్ రెడ్డి మీద అభిమానంతో కాంగ్రెస్ కు మద్దతుగా పని చేసామని, కష్టపడి ప్రచారం చేసామని, తీరా చిరంజీవి ఆ పార్టీలోకి వచ్చిన తరువాత ఇక అక్కడ వుండడం బాగుండదని బయటకు వచ్చామన్నారు. చిరంజీవి ని విమర్శిస్తూ ప్రచారం చేసిన తరువాత మళ్లీ ఆ పార్టీలో ఆయనతో కలిసి పని చేయడం సాధ్యం కాదని భావించామన్నారు. 

జగన్ సిఎమ్ అయిన తరువాత కలుద్దామని అనుకున్నామని, కానీ ఆయన బిజీగా వుండడం వల్ల సాధ్యం కాలేదని, ఆ తరువాత మరి కలిసే ప్రయత్నం చేయలేదని జీవిత వెల్లడించారు. రాజశేఖర్ ఎవరితోనూ నేరుగా ఎక్కువ మాట్లాడరని, అందువల్ల ఆయన అభిప్రాయాలు తను చెప్పాల్సి వస్తుంది, కానీ దాని వల్ల జనం తనను అపార్థం చేసుకునే పరిస్థితి వస్తోందని ఆమె వివరించారు. జీవితే అంతా చేస్తుందనే టాక్ అలా వచ్చిందే అని ఆమె అన్నారు. 

మా ఎన్నికల్లో తాను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తా అని ఏనాడూ చెప్పలేదని, అంతా ఎవరికి వారు ఊహించేసుకున్నారని అన్నారు. మోహన్ బాబు కుటుంబంతో తనకు ఎలాంటి వివాదం లేదన్నారు. నరేష్ మాటలు నమ్మి ఏదో జరిగిపోయిందని మా వ్యవహారాల్లో దిగామన్నారు. తీరా చేస్తే అక్కడ ఏమీ లేదన్నారు. ప్రకాష్ రాజ్ పోటీ వెనుక మెగాస్టార్ వున్నారో లేరో తమకు తెలియదన్నారు. తమ అంతర్గత సమావేశాల్లో కూడా ఆ పాయింట్ ఏనాడూ వినలేదన్నారు. ప్రకాష్ రాజ్ మళ్లీ మా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం వుందన్నారు. ఆయన ఏదో మంచి చేయాలనే తపన వుందన్నారు.

సరైన పాత్రలు వస్తేనే రాజశేఖర్ చేస్తారని, ఆయన ఇమేజ్ ను వాడుకుందామనుకునే వారే తప్ప, సరైన పాత్రలు అందించే వారు లేరన్నారు. అలా అని చెప్పి ఏదో ఒకటి చేయడం ఆయనకు ఇష్టం వుండదన్నారు.

శేఖర్ సినిమా చూసి అన్ని విధాలా బాగుంటుందనుకుని రీమేక్ చేసామన్నారు. పెద్దగా మార్పులు చేయలేదన్నారు. శేఖర్ సినిమా విషయంలో తన కుమార్తెలు ఇద్దరూ అన్నివిధాలా తనకు సాయం చేసారన్నారు. స్ట్రిప్ట్, డైలాగ్స్, రీరికార్డింగ్ ఇలా ప్రతి  విషయంలో వారు కీలకంగా వ్యవహరించారన్నారు. 

శేఖర్ సినిమా అందరికీ నచ్చుతుందని అందులో వున్న ఎమోషన్ అలాంటిది అని, సినిమా బాగా వచ్చిందని జీవిత చెప్పారు. ఈ  సినిమాలో రాజశేఖర్ రెండు షేడ్స్ లో కనిపిస్తారని, ఒకటి యంగ్ గెటప్ రెండోది ఏజ్డ్ లుక్ అన్నారు. రెండో గెటప్ ఆల్ మోస్ట్ కథకు హీరోలాంటిది  అన్నారు. నిజమైన తండ్రీ కూతుళ్లు సినిమాలో తండ్రీకూతుళ్లుగా నటిస్తే జనం ఈజీగా కనెక్ట్ అవుతారనే ఆలోచనతో తన  కుమార్తె ఈ సినిమాలో నటించిందన్నారు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?