cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Interviews

ఫలక్ నుమాకు సీక్వెల్.. బాలీవుడ్ ఎంట్రీ

ఫలక్ నుమాదాస్. హైదరాబాద్ గల్లీల జీవనాన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తూ తయారైన తొలి సినిమా. మలయాళ మాతృకను ఇంత పక్కాగా లోకలైజ్ చేస్తూ అడాప్ట్ చేసుకున్న సినిమా. క్రిటిక్స్ రివ్యూస్ ఎలా వున్నా, నైజాంలో పస్ట్ వీక్ లో మంచి కలెక్షన్లు సాధించింది. ఈ నేపథ్యంలో ఆ సినిమా హీరో, దర్శకుడు, నిర్మాత కూడా అయిన విశ్వక్ సేన్ తో మాటా మంతీ. అందులో ముఖ్యాంశాలు..

ఇదికదా కావాల్సింది అని. పైగా అక్కడికి దగ్గర్నే మేకల మండి కూడా. అసలు ఇంత మేకల మండి ఈడ వుందని ఎవ్వరికి తెలీదు. దేశం అంతటి నుంచి ఇక్కడకు వస్తాయి మేకలు, గొర్రెలు. అలా ఫలక్ నుమా ఫిక్స్ అయింది. ఇక దాస్ అంటే ఒకప్పటి కొత్త దాస్. నా చిన్నతనంలో ఆయనింటికి పెండ్లికి పోయిన. మొత్తం అంతా ఖద్దరుచొక్కాలతో భలే గమత్తుగుంది వ్యవహరం. అది అలా ఫిక్స్ అయిపోయింది. అలా ఆ రెండు కలిపి ఫలక్ నుమా దాస్ అయింది.

అసలు ఫలక్ నుమా దాస్ అన్న టైటిల్ ఎలా తట్టింది?
మలయాళ సినిమాను చూసినపుడు అరె, ఇదంతా మన బస్తీల వ్యవహారం లెక్క వుంది అనుకున్నా. మన బస్తీలల్ల అయితే ఇంకా క్రిర్రాకుంటది కదా? అని దాన్ని ఇక్కడ తీసుకురావడం అన్నదాని మీద స్టార్ట్ చేసా. అయితే ఇక్కడ కాస్త రౌడీయిజం, దందాలు నడుస్తుంటే బస్తీలు ఇప్పుడు అంతగా లేవు. దాదాపు పది ఇరవై ఏళ్లుగా లోకల్ రౌడీయిజం బాగా తగ్గిపోయింది. అలాగే బస్తీలు కూడా అన్నీ పెద్ద పెద్ద ఇళ్తతో మారిపోయాయి. ఆ నిజాం నాటి లుక్ కానీ, ఫీల్ కానీ చాలా బస్తీల్లో ఇప్పుడు లేదు. ముందు రెండు మూడు ఏరియాలు అనుకుని, ఆ ఏరియాలు అన్నీ చూసాం. ఫలక్ నుమా చూసాక అనిపించింది.

ఇంతమంది కొత్త నటులు, వాళ్ల నుంచి నటన రాబట్టడం.. ఇదంతా ఎలా జరిగింది?
మీకు తెలుసా? వందల మందికి అడిషన్స్ చేసాం. కృష్ణనగర్ లో వున్న ప్రతి ఆర్టిస్ట్ మా సినిమా అడిషన్స్ కు వచ్చినవాళ్లే. ఒక్కటే పాయింట్. అరె, ఆ దుకాణం దగ్గరకుపోయి, బంద్ చేయి అని బెదిరించు. ఢంకీ ఇయ్యి. ఇదే ఎగ్జామ్ అన్నట్లు. అలా తీసుకున్నాం కావాల్సిన వారిని. 15 రోజులు వర్క్ షాప్ చేసాం. ఆ తరవాత ఇక షూటింగ్ నే.

క్లయిమాక్స్ ను ఒరిజినల్ చూసి ప్లాన్ చేసారా? కట్ లేకుండా 11 నిమిషాలు వాళ్లు చేసారు. మీ క్లయిమాక్స్ కూడా అంతేనా?
మనది 13 నిమిషాలు వచ్చింది. కానీ చాలా కష్టం అయింది. ఒకరోజు రిహార్సల్ చేసాం. 1500 మంది ఆర్టిస్టులు. రకరకాల గెటప్ లు. పెట్రోమాక్స్ లైట్లు, ఇళ్లపైన ఫోకస్ లైట్లు, ఇంకా చాలా చాలా. అలాంటి టైమ్ లో షూట్ స్టార్ట్ అయింది. వర్షం. నాకు నీరసం వచ్చేసింది. ఇంక అంతా అయిపోయింది అనుకున్నా. అన్నీ తడిసిపోయాయి. లైట్లు పోయాయి. ఇలా నానా ఇదీ అయిపోయింది. కానీ నాన్న ధైర్యం చెప్పాడు. వన్ డే వేస్ట్. మహా అయితే యాభై లక్షలు. తట్టుకుందాం అన్నాడు. క్రేన్ ఆఫరేటర్ వెళ్లిపోయాడు. వేరొకళ్లి రప్పించి, షూట్ చేసాం.

అన్నీ బాగానే వున్నాయి. ఈ వివాదాలు, గడబిడ ఎందుకు?
నాకు లోపల దాచుకోవడం తెలీదు. ఏదివుంటే అది మాట్లాడడమే. కానీ ఇప్పుడు తెలిసింది. అందరూ రెండు మూడు రోజులు మంచిగ వేసుకున్నారు కదా? ఇప్పుడు తెలిసింది. కానీ నేను ఎవర్నీ అనలా? రివ్యూ రైటర్లను అన్నానని, ఆడియన్స్ ను అన్నానని పుట్టించారు. మీరు ఫుల్ విడియో చూసారా? చెప్పండి నేను రివ్యూ రైటర్లను కానీ, ఆడియన్స్ ను కానీ అన్నానా? నా ప్లేస్ లో ఎవ్వరైనా వుండనీండి. మూడు నాలుగు కోట్లు పెట్టి తీసిన సినిమా, దాన్ని చెడగొట్టనీకి ఇలాచేస్తే ఏమనిపిస్తంది? నాకైతే మస్తు కోపమొస్తది.

అసలు ఇదంతా ప్రీరిలీజ్ ఫంక్షన్ లో మీరు మాట్లాడిన మాటల దగ్గర నుంచి స్టార్ట్ అయిందేమో?
ఏమో? ఇకనైతే ఇంక ఏం మాట్లాడ. ఏడాదిన్నర మంచిగ సినిమాలు చేసుకుంట. ఆ తరువాత మళ్లీ డైరక్షన్ చేస్తా. ఈసారి సబ్జెక్ట్ ఒకటి మంచిది వుంది. దాన్ని బాలీవుడ్ లో తీస్తా. ఆ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ అన్నమాట. అలాగే ఇంకా వుంది. తరువాత చెప్తా.

ఫలక్ నుమా దాస్ కథ ఇక్కడతో అయిపోయినట్లేనా?
లేదు. దానికి సీక్వెల్ వుంది. ఆ ఆయిడియాతోనే అట్ల ఆపిన. తరువాత ఏమయింది అన్నది సీక్వెల్ వుంటుంది.

దర్శకుడిగా ఒకె. నటుడిగా ఒకె. నిర్మాతగా కూడా ఓకెనా.
ఆ మంచి పైసలు వచ్చాయి. కలెక్షన్లు బాగున్నాయి. ఆంధ్రలో కూడా బాగా చూస్తున్నారు. డిజిటల్ అమ్మేసాం. శాటిలైట్ వుంది.

బెస్టాఫ్ లక్.. థాంక్యూ
థాంక్యూ

జగన్ కేబినెట్లో సీమ మంత్రులు ఎవరెవరు?

 


×