Advertisement

Advertisement


Home > Movies - Interviews

ఇక నటించేది లేదు - చార్మి

ఇక నటించేది లేదు - చార్మి

'....పద్దు...ఆడపులి...'' ఈ డైలాగు కృష్ణవంశీ సినిమా శ్రీఆంజనేయం లోది. ఈ డైలాగు ఆ సినిమాలో చెప్పేది హీరోయిన్ చార్మి. ఆ సినిమాలో క్యారెక్టర్ మాత్రమే కాదు, నిజ జీవితంలో కూడా చార్మి ఆడపులే.  అందంతో పాటు డైనమిక్ లేడీ అన్న పేరును కూడా స్వంతం చేసుకున్న హీరోయిన్. కేవలం పేరుకు పెట్టుబడికి మాత్రమే నిర్మాతగా కాకుండా, పూర్తిస్థాయిలో ప్రొడక్షన్ లో మమేకం అయిన నటి. పూరి కనెక్ట్స్ అనే సంస్థకు సిఇఓ. డైరక్టర్ పూరి జగన్నాధ్ తో కలిసి సినిమా నిర్మాణాలు. ఇస్మార్ట్ శంకర్ తరువాత ఫైటర్ అనే పాన్ ఇండియా సినిమాను రూపొందిస్తున్న నేపథ్యంలో చార్మి బర్త్ డే సందర్భంగా ఈ చిట్ చాట్.

-హాయ్ అండీ...పుట్టిన రోజు శుభాకాంక్షలు మీకు

థాంక్యూ అండీ..ఎలా వున్నారు. చాలా రోజులయింది మనం కలిసి, మాట్లాడుకుని.

-అవకాశం, అకేషన్ కుదరాలి కదా? కరోనా టైమ్ లో బర్త్ డే అంటూ చాలా సందడి చేసినట్లున్నారు.

నిజానికి అసలు బర్త్ డే చేసుకోవాలనే ఆలోచన లేదు. కానీ మా పీఆర్వోలు వంశీశేఖర్ పట్టుపట్టి లైవ్ టాక్ అంటూ, సోషల్ మీడియా అంటూ హడావుడి చేసారు. దాంతో పాటు ప్రెండ్స్, వెల్ విషర్స్ విడియో కాల్స్ విసెష్, సందడే సందడి. నిజంగా మెమరబుల్ బర్త్ డే సెలబ్రేషన్స్. 

-ఇస్మార్ శంకర్ అనే సూపర్ హిట్ లేకుండా వుండి వుంటే, ఈ రోజు ఈ సెలబ్రేషన్ ఇలా వుండేదా?

నూటికి నూరుశాతం కరెక్ట్. లాస్ట్ ఇయర్ ఆ సినిమా షూట్ టైమ్ లో గోవాలో నా బర్త్ డే, రామ్ బర్త్ డే బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. మళ్లీ ఇప్పుడు ఇలా. కచ్చితంగా ఆ సినిమా విజయం ఇచ్చిన, తెచ్చిన జోష్ ఇంతా అంతా కాదు.

-జ్యోతిలక్ష్మి సినిమాతో ప్రొడక్షన్ బాధ్యతల్లోకి దిగారు. ఆ సినిమా ఫలితం తరువాత, లేదా ఆ సినిమా వర్క్ తరువాత ఇక చాలు ఈ పని అని అనిపించలేదా?

అస్సలు. నేను ఈ పనిని ఎంజాయ్ చేస్తున్నాను. నాకు ఇష్టం. నిజానికి హీరోయిన్ గానో, నటిగానో వుంటే, తెల్లవారి లేచామా? మంచి డ్రెస్ వేసుకున్నామా? మేకప్ చేసుకున్నామా? ఇంతే. కానీ ఈ పని అలా కాదు. చాలా చికాకులు వుంటాయి.కానీ సేమ్ టైమ్ నాకు ఇష్టం. ఎందుకంటే, ఈ పనిలో పరుగు వుంటుంది. రోజంతా హడావుడి వుంటుంది. దానిని నేను ఇష్టపడతాను. ఇందులో ఓ కిక్ వుంది. అది కావాలి నాకు.

-కానీ మేల్ డామినేటెడ్ ఫీల్డ్ కదా..చెప్పినది వినకపోవడం, చేయకపోవడం, ఇబ్బందులు ఏమైనా చవి చూసారా?

ఏమండీ..ఇక్కడ ఒకటే పాయింట్. నాకు ఇది కావాలి. నీకు ఇది పే చేస్తాను. నువ్వు చెప్పినది చెప్పినట్లు చేయకపోతే, నిన్ను తప్పించేస్తాను.అంతే. సింపుల్. 

-ఈ బిజినెస్ మైండ్ ఎక్కడి నుంచి వచ్చింది. పంజాబీ అమ్మాయిగానా? బిజినెస్ ఫ్యామిలీ నుంచా?

బిజినెస్ ఫ్యామిలీ నుంచే. మా ఫాదర్ నన్ను చిన్నపుడు మా ఫ్యాక్టరీలకు తీసుకెళ్లేవారు. అప్పటి నుంచీ నాకు బిజినెస్ లు అంటే ఇష్టం అన్నది స్టార్ట్ అయింది. 

-ఇస్మార్ట్ శంకర్ తరువాత ఫైటర్, రొమాంటిక్...ఇంకా ఏమైనా వున్నాయా?

చాలా..చాలా అంటే చాలా. పూరి గారి దగ్గర బోలెడు కాన్సెప్ట్ లు వున్నాయి. వాటిల్లోంచి కొన్నింటిని తీసి, కొత్త డైరక్టర్లకు అప్పగించి, మంచి ప్రాజెక్టులు సెపరేట్ గా చేసే ఆలోచన వుంది. అలాగే ఇప్పుడు ఇమ్మీడియట్ గా కాకున్నా, వెబ్ సిరీస్ లు చేసే ఆలోచన వుంది. అలాగే ఫైటర్ తరువాత మరో ఒకటి రెండు మంచి ప్రాజెక్టులు పైప్ లైన్ లో వున్నాయి..

-అంటే ఇక మీ అభిమానుల మిమ్మల్ని తెరపై చూడడం అన్నది వుండదా?

వుండదు. అది పక్కా. నూటికి రెండు వందల శాతం. నటిగా ఇక తెరపై కనిపించేది లేదు. అయినా ఎన్నాళ్లు? కొత్త కొత్త అమ్మాయిలు వస్తున్నారు. మాంచి అందమైన అమ్మాయిలు వస్తున్నారు. వారి ప్రతిభ చూపిస్తున్నారు. ఇంకా నటిగానే ఇక్కడ వేలాడాలని అనుకోవడం లేదు. జ్యోతిలక్ష్మి టైమ్ లోనే నటిగా నా రిటైర్మెంట్ ప్రకటిస్తానంటే పూరిగారు, కళ్యాణ్ గారు వద్దన్నారు. అనౌన్స్ చేయడం అవసరమా? చేయడం మానేస్తానంటే మానేయ్ కానీ అన్నారు. అందుకే బయటకు చెప్పలేదు. ఇప్పుడు చెబుతున్నా. ఇకపై నటించేది లేదు.

-ఇస్మార్ట్ శంకర్ సినిమా మీ ఫైన్సాన్సియల్ ట్రబుల్స్ ను పూర్తిగా దూరం చేసినట్లేనా?

ఈ ఇండస్ట్రీలో థియేటర్ దగ్గర నుంచి నిర్మాత దాకా డబ్బులు చేతులు మారాలి అంటే అంత సులువు కాదు. ఎన్ని ఫోన్ లు చేయాలో? ఎన్ని సార్లు అడగాలో? అదంతా మీకు ఆఫ్ ది రికార్డు చెబుతాను.

-క్రియేటివ్ పీపుల్ కు కరోనా అన్నది మాంచి అవకాశం. మరి మీరు కేవలం నిర్మాత. ఏం చేస్తున్నారు ఈ ఖాళీ టైమ్ లో?

కొన్ని ఆన్ లైన్ కోర్సులు చేస్తున్నా. ఎప్పటి నుంచో విదేశాలకు వెళ్లి కొన్ని కోర్సులు చేయాలనే కోరిక వుంది. అది ఇఫ్పుడు తీరుతోంది. ఆన్ లైన్ లో బిజినెస్, స్క్రీన్ ప్లే రైటింగ్ ఇలా చాలా కోర్సులు వన్ బై వన్ చేస్తున్నా.

-స్క్రీన్ ప్లే రైటింగ్ గా? పూరిగారికి పోటీ వచ్చేస్తారా?

పోటీ కాదు. ఆయన ఏదైనా సబ్జెక్ట్ డిస్కస్ చేస్తే, జడ్జ్ చేయడం లేదా కనీసం అర్థం చేసుకునే అవగాహన వుండాలి కదా? అందుకోసం చేస్తున్నా. 

-ఫైటర్ సినిమా ప్లానింగ్ అంతా కరోనా కారణంగా అప్ సెట్ అయిందా?

అవును. చాలా ప్లాన్ చేసుకున్నాం. విదేశీ టెక్నీషియన్లు, షెడ్యూళ్లు ఇలా చాలా. ఇప్పుడు అన్నీ అలా వుండిపోయాయి. 

-అంటే ఇక అవన్నీ మారుస్తారన్నమాట. 

చూడాలి. ముందు జనాల ఆరోగ్యం ముఖ్యం. ఏదో లాక్ డవున్ అయిపోయింది. అర్జెంట్ గా స్టార్ట్ చేసేద్దాం అన్న ఆలోచన అయితే లేదు.

-2020 లో విడుదల చేసేద్దాం అనుకున్నారా? కరోనాకు ముందు?

అలాగే అనుకున్నాం. కానీ ఇప్పుడు ఓ ఏడాది మొత్తం మిస్ అయిపోయేలా కనిపిస్తోంది.

-థాంక్యూ అండీ..మరోసారి మీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు

థాంక్యూ అండీ

ఇద్దరూ ఏడ్చేసారు

నేను సింగిల్ గా ఉండిపోతా