Advertisement

Advertisement


Home > Movies - Interviews

'కలకత్తాలో.. ఆంధ్రవాలా..ను.. చూడాలని వుంది'

'కలకత్తాలో.. ఆంధ్రవాలా..ను.. చూడాలని వుంది'

కాలం ఎవ్వరికోసం ఆగదు..ప్రవాహంలా సాగిపోతూనే వుంటుంది. కాలం మార్పులను చూసిన వాళ్లు, కాలంతో పాటు కొంతకాలం ముందుకు సాగిన వాళ్లను సీనియర్లు, అనుభవజ్ఞులు అంటారు. అలాంటి వాళ్లు ఒక్కసారి వెనక్కు తొంగి చూస్తే ఆ ప్రయాణం మహత్తరంగా వుంటుంది. తీపిజ్ఞాపకంగా మిగులుతుంది. 

సినిమారంగంతో దాదాపు 40 ఏళ్లకు పైగా మమేకమై ప్రయాణించడం అంటే మాటలు కాదు. జర్నలిస్ట్ గా ప్రారంభించి, పీఆర్వోగా, పబ్లిషర్ గా, నిర్మాతగా మారినా, అన్ని అవతారాల్లో దేన్నీ వదలకుండా సాగడం అంటే మరీ విశేషం. టాలీవుడ్ లో ఆ అరుదైన ఫీట్ సాధించింది బిఎ రాజు. ఈ రోజు ఆయన బర్త్ డే. ఈ సందర్భంగా ఈ చిన్న చిట్ చాట్.

జర్నలిస్ట్ గా తొలి ఇంటర్వూ గుర్తు వుందా?

ఎందుకు లేదు. అదో మాంచి మెమరీ. హీరో కృష్ణగారంటే నాకు పిచ్చి అభిమానం అన్న సంగతి మీకు తెలిసిందే కదా. ఆయనతోనే తొలి ఇంటర్వూ. ఏవో నాలుగు ప్రశ్నలు అడగబోయాను. నీకు తెలుసుగా నేనేం చెబుతానో. నువ్వేరాసేయ్ అన్నారు. నేనే ప్రశ్నలు సమాధానాలు రాసి చూపించా. సూపర్ అన్నారు. ఆంధ్రభూమి సినిమా పత్రికకు పంపా. అది నా తొలి ఇంటర్వూ.

పీఆర్వోగా తొలి సినిమా 

రామరాజ్యం లో భీమరాజు. అదీ కృష్ణగారిదే. అంతకు ముందు కొన్ని చేసాను కానీ, కృష్ణగారి సినిమాతో పేరు పడాలి అని ఆగాను. తొలిసారిగా పీఆర్వోగా తెరపై పేరు పడింది ఆ సినిమాకే. అప్పటి నుంచి ఇప్పటికి 1600 సినిమాలు

సూపర్ హిట్ ఓ సాహసమేగా

అవును. అప్పటి వరకు పెద్ద పెద్ద సంస్థలు మాత్రమే మ్యాగ్ జైన్లు ప్రింట్ చేసేవి. కేవలం వన్ మ్యాన్ ఆర్మీగా నేను సూపర్ హిట్ స్టార్ట్ చేసా. అయితే అంతకన్నా నాకు ఆనందకరమైన విషయం ఏమిటంటే, అప్పటికే ఇండస్ట్రీలో వున్న నా సీనియర్ జర్నలిస్ట్ లు మోహన్ కుమార్, అర్జున్ రావు, జివిజి లాంటి వాళ్లు అంతా తరువాత తరువాత నా మ్యాగ్ జైన్ లో పనిచేయడం. అది ఇప్పటికీ మరిచిపోలేను.

సాధారణంగా పీఆర్వోగా మారితే జర్నలిజం వదిలేస్తారు

సమస్య లేదు. నేను ఒక్క ప్రెస్ నోట్ అయినా రాయకుండా ఒక్క రోజు కూడా వుండలేను. అలాగే ఒక్క సినిమా అయినా చూడకుండా నిద్రపోను. సినిమానే నా ప్రపంచం. నాకు ఇంకోటి తెలియదు. అవసరంలేదు. 

అప్పట్లో సినిమా జర్నలిజం ఎలా వుండేది

అప్పట్లో డైలీ కవరేజ్ లు లేవు. ఇంత టెక్నాలజీ లేదు. అన్నీ స్వయంగా రాసుకోవాలి. చూసుకోవాలి. ఫోటోలు ఎంచుకోవాలి. పట్టుకెళ్లి ఇవ్వాలి. షూటింగ్ కవరేజ్ లు, సాంగ్ కవరేజ్ లు ఆ జ్ఞాపకాలే వేరు. ఒక్క స్టిల్ దొరికితే అబ్బో అన్నట్లు వుండేది.  అప్పుడు అంతా వేరు. ఇప్పుడు అంతా టెక్నాలజీ మీద నడుస్తోంది.

వార్తల కోసం పోటీ పడేవారా?

అది ఎప్పుడూ వుండేది. ఓ సరదా సంఘటన చెప్పనా..చిరంజీవి చూడాలని వుంది సినిమాకు మూడు టైటిళ్లు ఆలోచించారు. కలకత్తాలో...ఆంధ్రవాలా..చూడాలని వుంది. ఈ మూడింటిలో ఏదో ఒకటి ఫిక్స్ చేస్తారు. కానీ అంతవరకు ఆగలేక, ముందే రాసేయాలని నేను రాసేసా..దానికి ఇలా హెడ్డింగ్ పెట్టా..'' కలకత్తాలో..ఆంధ్రవాలా..ను..చూడాలని వుంది..ఇలా సరదాగా వుండేది..హ్యాపీగా వుండేవి ఆ రోజులు. 

పీఆర్వోగా జ్ఞాపకాలు

ఎన్నో. టాలీవుడ్ లో నేను పీఆర్వోగా చేయ ని సంస్థ లేదు. హీరో లేరు. డైరక్టర్ లేరు. ఎంతో మంది విజయవంతమైన డైరక్టర్ల తొలిసినిమాలకు నేనే పీఆర్వోను. ఎంతో మంది హీరోల తొలి హిట్ లకు నేనే పీఆర్వోను. మహేష్ బాలనటుడిగా వున్నప్పటి నుంచి ఆయనతో ప్రయాణం కొనసాగుతోంది. 

మీకు తెలుసున్నవారి దగ్గర ఎప్పుడూ జయ..జయ..అంటుంటారు. ఇప్పుడు జయలేని లోకం ఎలా వుంది?

జయ లేదని ఎవరన్నారు? నా ఇంటికి రండి. నా చుట్టూ జయే..అదే నా లోకం.

ట్విట్టర్ లో అయిదున్నరలక్షల ఫాలోవర్లు, సదా యాక్టివ్ గా..ఎలా?

రోజుకు నాకు పద్దెనిమిది గంటలు ఇధే పని. మరో వ్యాపకం లేదు. రాదు. పాజిటివ్ గా వుంటాను. నెగిటివ్ పోస్ట్ చేయను. నెగిటివ్ మాట్లాడను. నా మ్యాగ్ జైన్ లో కూడా నెగిటివ్ అన్నది వుండదు.

ఇంత మంది నిర్మాతలు, డైరక్టర్లు, హీరోలతో ఇన్నాళ్లుగా ప్రయాణం సాగిస్తున్నా అంటే దానికి కారణం. నేను సదా పాజిటివ్ గానే ఆలోచించడం, పాజిటివ్ గానే మాట్లాడడం, నెగిటివ్ ఆలోచనలు దగ్గరకు రానివ్వకపోవడం. ట్విట్టర్ లో కూడా అదే తరహా.

నిర్మాతగా ప్రయాణం ఆపేసినట్లేనా?

లేదే..జయ డైరక్షన్ కోసమే నిర్మాతగా మారాను. ఇప్పుడు నా కొడుకు శివకుమార్ తో కొనసాగిస్తాను. శివ బయట సినిమాలు రెండు మూడు ఒప్పుకున్నాడు. అవి అయ్యాక మా బ్యానర్ లో చేస్తాడు.

గుడ్..ఆల్ ది బెస్ట్..అండ్ హ్యాపీ బర్డ్ డే

థాంక్యూ

విఎస్ఎన్ మూర్తి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?