Advertisement

Advertisement


Home > Movies - Interviews

మెగాస్టార్ స్క్రిప్ట్ తయారీలో వున్నా-బాబీ

మెగాస్టార్ స్క్రిప్ట్ తయారీలో వున్నా-బాబీ

ఇది లాక్ డౌన్ టైమ్...కొందరికి ఇబ్బంది కావచ్చు. కానీ కొంత మందికి ఇది ఓ మంచి సదవకాశం. ముఖ్యంగా క్రియేటివ్ పీపుల్ కి సినిమా దర్శకులు ఫుల్ గా ఇప్పుడు తమ తమ వ్యాపకాల్లో మునిగిపోయారు. కొత్త అయిడియాలకు పదును పెడుతున్నారు. కొత్త స్క్రిప్ట్ లు తయారు చేసుకుంటున్నారు. అలాంటి దర్శకులను పలకరిస్తే..

సినిమా రంగంలో రాణించడానికి ప్రతిభ ఒక్కటే చాలదు. అదృష్టం కూడా కలిసిరావాలి. అలాంటి అదృష్టవంతుల్లో బాబీ అలియాస్ పవర్ బాబీ, అలియాస్ రవీంద్ర ఒకరు. కథకుడిగా, అసిస్టెంట్ డైరక్టర్ గా ప్రతిభ చూపించి రవితేజను డైరక్ట్ చేసే ఛాన్స్ సంపాదించారు. ఆ వెంటనే పవన్ కళ్యాణ్. ఆ తరువాత ఎన్టీఆర్..ఆపై వెంకీ-చైతూల మల్టీ స్టారర్. ఇప్పుడు అనుకున్నవి అన్నీ అనుకున్నట్లు జరిగితే మెగాస్టార్ చిరంజీవి. హిట్లు, యావరేజ్ లతో సంబంధం లేకుండా బాబీ కెరీర్ గ్రాఫ్ ఇది.అలాంటి బాబీ కరోనా టైమ్ లో ఎలా వున్నారో?

-హాయ్..బాబీగారూ...

హాయ్ అండీ..ఎలా వున్నారు?

-అదేంటీ మేము అడుగుదాం అనుకున్నది మీరు అడిగేస్తున్నారు

మీరు అయినా మేము అయినా కరోనా టైమ్ లో ఒకటేగా

-అయినా మీకు కరోనా టైమ్ ఏముంది? రైటింగ్ కు వాడుకోవచ్చేమో కదా?

అదే చేస్తున్నా. ఇప్పటికే ఓకె అయిన ఓ కథకు మెరుగులు దిద్ది, ఫుల్ స్క్రిప్ట్ గా మార్చే పనిలో వున్నా.

-ఎవరికోసం ఆ స్క్రిప్ట్ మెగాస్టార్ కోసమేనా?

అవునండీ. ఆయనకు ఓ కథ చెప్పాను. బాగుందన్నారు. దానికే మెరుగులు దిద్దే పనిలో వున్నాను.

-మీకు అదృష్టం బాగా ఎక్కువనుకుంటాను. తక్కువ సినిమాలే అయినా అన్నీ పెదద్ద హీరోలతోనే అవకాశాలు పట్టేసారు.

అదృష్టం మాత్రం వుంటే సరిపోదండీ. మన దగ్గర విషయం వుండాలి.కథలు వుండాలి. వాటిని సమర్థవంతంగా అల్లి, చెప్పగలగాలి. ఈ విషయంలో తొలి అవకాశం ఇచ్చిన రవితేజ దగ్గర నుంచి, నన్ను గుర్తించి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి థన్యవాదాలు చెప్పుకోవాలి.

-ఇక్కడే గమ్మత్తయిన పాయింట్ ఏమిటంటే, ఆ వచ్చే అవకాశాలు అన్నీ బాగా అంటే బాగా గ్యాప్ తీసుకుని రావడం. 

ఏం చేస్తాం అండీ, డైరక్టర్లు ఎక్కువయిపోయారు.

-హీరోలు కూడా ఎక్కువ మందే వున్నారుగా. 

వున్నారు. కానీ ఓ సినిమా చేస్తూనే మరో రెండు సినిమాలు కమిట్ అవుతున్నారు. ప్లాన్ చేసుకుంటున్నారు. అందువల్ల అవకాశం రావడానికి టైమ్ పడుతోంది. 

-ఇంతకీ మెగాస్టార్ సినిమా అన్న ఆలోచనే కాస్త టెన్షన్, ఆందోళన పుట్టిస్తుందేమో? ఫ్యాన్ బేస్, ఆయన చరిష్మా..ఇలాంటివి అన్నీ గుర్తుకు వచ్చి.

ఆ ఫ్యాన్ బేస్ లో నేనూ ఒకడినే కదాండీ..ఆయన సినిమాలు చూసే కదా, ఈ దారి పట్టి, ఇలా వచ్చింది.

-ఇంతకీ ఓ ఫ్యాన్ గా మీ అభిమాన హీరోను ఎలా చూపించాలనుకుంటున్నారు.?

ఫ్యాన్స్ కు నచ్చేలా. అంతకన్నా ఇప్పుడు సమయం కాదు కదా.

-విక్టరీ వెంకటేష్ తో సినిమా చేసారు. ఆయన నుంచి ఫిలాసఫీ ఫుల్ గా నేర్చుకున్నారా

ఫిలాసఫీ సంగతి అలా వుంచితే ఫ్యామిలీ వాల్యూస్ నేర్చుకున్నాను. ఎలాంటి వృత్తిలో వున్నా, కుటుంబానికి ఇవ్వాల్సిన టైమ్, వాల్యూ ఏమిటన్నది తెలుసుకున్నాను. వెంకీ మామ షూటింగ్ టైమ్ లో మా పాపను పూర్తిగా మిస్ అయ్యేవాడిని. అదే ఆయనతో చెబితే, సినిమా వాళ్ల బతుకులు అంతే, మనకు తెలియకుండానే మన పిల్లలు పెద్దయిపోతారు. అందుకే వీలయినంత సమయం ఇవ్వాలి అని చాలా చాలా చక్కని విషయాలు చెప్పేవారు.

-పాటిస్తున్నారా మరి?

లక్కీగా కరోనా కారణంగా గత రెండు నెలలుగా మా పాపతోనే గడుపుతున్నాను. దాని ఎదుగుదల అబ్జర్వ్ చేస్తున్నాను.

-ఇంకేంటండీ సంగతులు?

ప్రస్తుతానికి స్క్రిప్ట్ ఫైన్ ట్యూనింగ్. కొత్తగా ఏమైనా తడితే వాటిని పాయింట్లుగా మార్చి, పేపర్ మీద పెట్టి వుంచడం. ఇంకా టైమ్ వుండే వరల్డ్ వైడ్ సినిమా మీద పడడం. అంతే.

-ఒకె థాంక్యూ అండీ..త్వరలో మెగాస్టార్ తో మీ సినిమా కల నెరవేరాలి.

ధన్యవాదాలు అండీ

చిన్న పిల్లాడిలా మహేష్ బాబు అల్లరి

నెవ్వర్ బిఫోర్

ఇద్దరూ ఏడ్చేసారు

నేను సింగిల్ గా ఉండిపోతా