గుడ్ న్యూస్.. రికార్డు సృష్టించిన ‘ప్రకాశం’

దేశవ్యాప్తంగా కరోనా కట్టడిలో కేరళ రాష్ట్రం రికార్డు సృష్టిస్తే.. ఏపీలో ప్రకాశం జిల్లా మొదటిసారిగా ఆ ఘనత సాధించింది. కరోనాని పారద్రోలిన జిల్లాగా ప్రకాశం నిలిచింది. తాజాగా విడుదలైన లెక్కల ప్రకారం ప్రకాశం జిల్లాలో…

దేశవ్యాప్తంగా కరోనా కట్టడిలో కేరళ రాష్ట్రం రికార్డు సృష్టిస్తే.. ఏపీలో ప్రకాశం జిల్లా మొదటిసారిగా ఆ ఘనత సాధించింది. కరోనాని పారద్రోలిన జిల్లాగా ప్రకాశం నిలిచింది. తాజాగా విడుదలైన లెక్కల ప్రకారం ప్రకాశం జిల్లాలో కొత్తగా ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. అంతే కాదు.. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న 63మంది రోగులు.. ఒక్కొక్కరే డిశ్చార్జ్ అయి వెళ్లిపోగా ప్రస్తుతం జిల్లాలో ఐసోలేషన్ వార్డులన్నీ ఖాళీగా ఉన్నాయి. స్థానికంగా ఉన్న క్వారంటైన్ సెంటర్లు కూడా ఖాళీ అవుతున్నాయి.

ఎప్పటికప్పుడు ట్రూనాట్ టెస్టులు చేసి క్వారంటైన్ సెంటర్లలో ఆరోగ్యంగా ఉన్నవారిని ఇళ్లకు పంపించేస్తున్నారు. కరోనా కేసులు మొదలవుతున్న తొలి రోజుల్లో మర్కజ్ తో సంబంధం ఉన్న కొంతమంది ప్రకాశం జిల్లాలో కరోనా వ్యాప్తికి కారణమయ్యారు. చీరాల ప్రాంతంలో ఒక్కసారిగా కరోనా పుట్ట పగిలింది. అంతే ఆ తర్వాత ప్రకాశం జిల్లాలో దాదాపు 50శాతం రెడ్ జోన్ గా మారింది.

జిల్లా కేంద్రం ఒంగోలుతో పాటు, చీరాల సహా ఇతర ముఖ్యప్రాంతాల్లో లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేశారు. అదే సమయంలో సరిహద్దు జిల్లాలైన కర్నూలు, గుంటూరుల్లో కరోనా విజృంభిస్తుంటే.. ప్రకాశంలో మాత్రం కేసుల సంఖ్య నిలకడగా ఉంది. అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంతో పాటు, స్థానిక మంత్రులు బాలినేని శ్రీనివాసులరెడ్డి, ఆదిమూలపు సురేష్.. ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి పరిస్థితి చేయిదాటకుండా చూడగలిగారు.

అలా సక్సెస్ ఫుల్ గా ప్రకాశంలో కరోనా చైన్ ను బ్రేక్ చేయగలిగారు. కొత్త కేసులు నమోదు కాకపోవడంతో పాటు.. ఉన్నవారంతా డిశ్చార్చి కావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. జిల్లా గ్రీన్ జోన్ లోకి వెళ్లినట్టయింది. ఇక జిల్లాలో ఒక్క కరోనా మరణం కూడా లేకపోవడం మరో విశేషం. ఒక్క మరణం కూడా లేకుండా జిల్లాలోని మొత్తం 63మంది రోగులు కోలుకుని డిశ్చార్జి కావడంతో ప్రకాశం కొత్త రికార్డు నెలకొల్పింది. 

చిన్న పిల్లాడిలా మహేష్ బాబు అల్లరి