Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

రష్మిక రాంగ్ స్టెప్ వేసిందా?

రష్మిక రాంగ్ స్టెప్ వేసిందా?

ప్రతి హీరోయిన్‌కీ హిందీ సినిమాల్లో నటించాలని, దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకోవాలని వుంటుంది. అయితే గతంలో మాదిరిగా హిందీ సినిమాల్లో నటించిన సౌత్ హీరోయిన్లెవరూ ఇటీవలి కాలంలో క్లిక్ అవలేదు. 

అందులోను ఒక భాషా చిత్ర పరిశ్రమలో క్రేజ్ వచ్చి టాప్‌లోకి వెళ్లిపోయిన తర్వాత హీరోయిన్లు ప్లేస్ మారడానికి ఇష్టపడరు. అనుష్క, సమంత తెలుగు చిత్ర సీమలో అంతకాలం నంబర్‌వన్ హీరోయిన్‌గా వెలిగారంటే ఉత్తర దిక్కుగా చూడకపోవడమే కారణం. 

పూజ హెగ్డేకి ఇక్కడ విపరీతమైన డిమాండ్ వున్నా బాలీవుడ్‌లో కూడా తన రేంజ్ అలాగే వుంది కాబట్టి అటు వెళ్లిందన్నా ఓకే కానీ రష్మిక బాలీవుడ్ సినిమా చేయడమే విచిత్రంగా వుంది. 

అందులోను సిద్ధార్థ్ మల్హోత్రా లాంటి ఫ్లాప్ హీరో సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. తెలుగు చిత్ర సీమలో ఇప్పుడు రష్మిక నంబర్‌వన్ కావడానికి స్కోప్ ఎక్కువ. 

పుష్ప కూడా హిట్టయిందంటే ఆమె డిమాండ్ మామూలుగా వుండదు. యూత్‌తో పాటు ఫ్యామిలీస్‌ని కూడా ఆకట్టుకున్న రష్మిక నంబర్‌వన్ అనిపించుకోవడానికి ఎంతో దూరంలో లేదు. 

ఇలాంటి టైమ్‌లో బాలీవుడ్ మోజుతో అటు వెళ్లి ఇక్కడి అవకాశాలు కొన్ని వదిలేసుకుంది. క్రేజ్‌తో పాటు ఇతర హీరోయిన్ల కెరీర్ గ్రాఫ్, వారి ఎక్స్‌పీరియన్స్ కూడా స్టడీ చేయడం కూడా నంబర్ వన్ హీరోయిన్ల లక్షణం మరి. 

వ్రతం చెడినా, ఫలితమైనా దక్కుతుందా?

దర్శకుడిగా మారుతున్న రవితేజ

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?