10 కోట్ల క్లబ్ లో కొరటాల?

ఒక్కోసారి ఒక్కో డైరక్టర్ కు టైమ్ వస్తుంది. అది దాసరి దగ్గర నుంచి శ్రీనువైట్ల వరకు కామన్ థింగ్. ఇప్పుడు టైమ్ కొరటాల శివది. డిమాండ్ లో వున్న అవుట్ అండ్ అవుట్ కమర్షియల్…

ఒక్కోసారి ఒక్కో డైరక్టర్ కు టైమ్ వస్తుంది. అది దాసరి దగ్గర నుంచి శ్రీనువైట్ల వరకు కామన్ థింగ్. ఇప్పుడు టైమ్ కొరటాల శివది. డిమాండ్ లో వున్న అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ మాస్ డైరక్టర్. ఒక విధంగా చెప్పాలంటే, త్రివిక్రమ్ ను వినాయక్ ను కలిపి ఓ మూసలో పోస్తే రెడీ అయిపోయేది శివ లాంటి డైరక్టరే. 

అందుకే  ఇప్పుడు అతగాడి రెమ్యూనిరేషన్ టాప్ లోకి చేరిపోయిందట. గతంలో వినాయక్, త్రివిక్రమ్, శ్రీనువైట్ల, బోయపాటి, మరో ఒకరిద్దరు పది కోట్ల పారితోషికాన్ని కళ్ల చూసారు. ఇప్పుడు కొరటాల శివ కు కూడా ఎన్టీఆర్ సినిమాకు పది కోట్ల పారితోషికం అందుతోందని వినికిడి.

శ్రీనువైట్ల దూకుడు తరువాత, బోయపాటి లేజండ్ తరువాత, త్రివిక్రమ్ జులాయి తరువాత ఈ రేంజ్ కు వచ్చారు. ఇప్పుడు శ్రీమంతుడు తరువాత శివకు ఇప్పుడు ఆ రేంజ్ వచ్చింది. ఇది కూడా బ్లాక్ బస్టర్ అయిపోతే, శివ రేంజ్ పీక్ కు చేరిపోతుంది. లాభాల్లో వాటా, లేదా 15 కోట్లు అన్నంతగా.