'సర్దార్ గబ్బర్‌సింగ్' సినిమాకి 100 కోట్ల బిజినెస్ జరిగిందన్నారు. బాక్సాఫీస్ దగ్గర హాఫ్ సెంచరీకి సెటిలైపోయింది ఆ సినిమా. డిజాస్టర్‌తో ఆ స్థాయి వసూళ్ళు సాధించడం చిన్న విషయమేమీ కాదు. సినిమా హిట్టయి వుంటే మాత్రం, 100 కోట్లు కొల్లగొట్టేసేవాడే పవన్‌కళ్యాణ్. బ్యాడ్ లక్. మహేష్ కూడా అంతే. కెరీర్లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్‌ని 'బ్రహ్మూెత్సవం' రూపంలో చవిచూసేశాడు. లేదంటే ఇది కూడా వంద కోట్ల క్లబ్లో చేరేంత అంచనాలతో వచ్చిన సినిమానే.
ఫస్టాఫ్ ఇంత ఘోరంగా నిరాశపరిచాక, సెకెండాఫ్‌పై ఆశలు సన్నగిల్లిపోవడం సహజమే కదా. అందుకే టాలీవుడ్లో ఇప్పుడు ఎక్కడా 100 కోట్ల వసూళ్ళ గురించిన మాట విన్పించడంలేదు. రామ్‌చరణ్ 'ధృవ' అయినా, ఎన్టీఆర్ 'జనతా గ్యారేజ్' అయినా స్కై హై రేంజ్లో అంచనాల్ని అయితే సంపాదిస్తున్నాయిగానీ, వాటి చుట్టూ 100 కోట్ల క్లబ్ అనే ప్రచారం కూడా జరగని పరిస్థితి.
ఈ ఏడాది వరకూ అయితే 100 కోట్ల గురించి ఆలోచించడం అత్యాశే అవుతుందని టాలీవుడ్ ప్రముఖులే ఓ అంచనాకి వచ్చేశారు. ఏమో, అద్భుతం జరిగితే జరగొచ్చుగాక. కానీ, రెండు పెద్ద సినిమాలు కొట్టిన దెబ్బతో తెలుగు సినీ పరిశ్రమ షాక్‌కి గురయ్యింది. 2017లో మాత్రం వంద కోట్ల క్లబ్‌పై మళ్ళీ ఆశలు చిగురించొచ్చు. అప్పటిదాకా అంతా కామప్ అంతే.