మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్..ఆయన తెలుగులో రెండు స్ట్రయిట్ చిత్రాలు చేస్తున్నారు. మనమంతా..జనతా గ్యారేజ్. ఇప్పటికే మనమంతా టీజర్ బయటకు వచ్చింది. జనతా గ్యారేజ్ ట్రయిలర్ రావాల్సివుంది. నటనపై డెడికేషన్ వున్న నటుడు మోహన్ లాల్. అందుకే పట్టుపట్టి తెలుగులో డబ్బింగ్ కు రెడీ అయ్యారు. మనమంతా టీజర్ లో ఆయనే కొన్ని డైలాగులు చెప్పారు.
అవి విన్న మోహన్ లాల్ తెలుగు అభిమానులు కూడా అంత సంతృప్తి ఫీల్ కాలేదు. బాగా కృతకంగా, విరిచిముక్కలు చేసినట్లు అనిపించింది. దీంతో ఇఫ్పుడు రెండు సినిమాల మేకర్లు పునరాలోచనలో పడినట్లు గ్యాసిప్ లు వినిపిస్తునాయి. కానీ మోహన్ లాల్ తెలుగు ఇంకా సరిగ్గా నేర్చుకోకుండా వుండగానే మనమంతా టీజర్ కట్ చేసి డబ్బింగ్ చెప్పించినట్లు తెలుస్తోంది.
సమస్యను గుర్తించిన మోహన్ లాల్ పట్టుబట్టి మరింతగా తెలుగు నేర్చుకున్నట్లు వినికిడి. అందువల్ల మనమంతా కోసం మోహన్ లాల్ చేతనే డబ్బింగ్ చెప్పించి, మరీ అప్పుడు కూడా బాగా లేకుంటే ఆలోచించాలని మనమంతా దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం చూసి తాము నిర్ణయం తీసుకోవాలని జనతా గ్యారేజ్ దర్శకుడు కొరటాల శివ ఆలోచిస్తున్నట్లు వినికిడి.