రాను రాను సినిమాల లెక్కలు మారిపోతున్నాయి. రెమ్యూనిరేషన్ల రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. అంత డిమాండ్ ఏమిటీ? అని ఎవరైనా అడిగితే, హీరోల వెంట నిర్మాతలను ఎవరు పడమన్నారు అని ఎదురు క్వశ్చను వస్తోంది.
ఒక్క సినిమా హిట్ అయితే చాలు, ఇక అదే కొలమానం అయిపోతోంది. గత రెండేళ్ల కాలంలో హీరోల రెమ్యూనిరేషన్లు అన్నీ డబుల్, త్రిబుల్ అయిపోయాయి.
లేటెస్ట్ గా ఓ యంగ్ హీరో 12 నుంచి 13 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ హీరో రెమ్యూరేషన్ నాలుగైదుకోట్ల రేంజ్ లో వుండేది. సినిమాలు ఫ్లాప్ అవుతున్నా, కాస్త ఓపెనింగ్ వుంటుంది అని నిర్మాతలు ఓకె అనేవారు. మెల్లగా ఒకటి రెండు యావరేజ్ సినిమాలు పడిన తరువాత అది కాస్తా ఎనిమిదికి చేరింది. సరే భారీ కాంబినేషన్ సినిమా అని ఎనిమిది ఇచ్చారు. ఈ లోగా ఓ మాంచి హిట్ పడింది.
దాంతో ఇప్పుడు రెమ్యూనిరేషన్ ను 12 నుంచి 13 కు చేర్చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి కమిట్ అయిన సినిమా ఒకటే. ఆ సినిమాకు ఈ కొత్త రెమ్యూనిరేషన్ కోట్ చేస్తున్నట్లు భోగట్టా. మరి అదే రేంజ్ రెమ్యూనిరేషన్ తో సినిమా చేయాలంటే కనీసం 50 కోట్లకు పైగా ఖర్చు అవుతుంది. ఇది ఎంత వరకు వెయిబుల్ అవుతుందని లెక్కలు కట్టుకోవాల్సిందే.