11న ఆ సినిమా ప్రారంభం

పాపం, కళ్యాణ్ కృష్ణ..అనుకున్న ప్రాజెక్టు హిట్ కాలేదు. ఆ ప్రాజెక్టు కోసం చూసుకుంటూ మంచి ప్రాజెక్టు మిస్ అయింది. వెంకీ-నాగ్ చైతన్య కాంబినేషన్ లో ఓ సినిమా అన్నది నిర్మాత దగ్గుబాటి సురేష్ ప్లాన్.…

పాపం, కళ్యాణ్ కృష్ణ..అనుకున్న ప్రాజెక్టు హిట్ కాలేదు. ఆ ప్రాజెక్టు కోసం చూసుకుంటూ మంచి ప్రాజెక్టు మిస్ అయింది. వెంకీ-నాగ్ చైతన్య కాంబినేషన్ లో ఓ సినిమా అన్నది నిర్మాత దగ్గుబాటి సురేష్ ప్లాన్. దానికి ముందుగా కళ్యాణ్ కృష్ణనే దర్శకుడు అనుకున్నారు. కానీ రవితేజ నేల టికెట్ ప్రాజెక్టు కారణంగా సెట్ కాలేదు. దీంతో నిర్మాతలు, సమర్పకులు, విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల, కోన వెంకట్ కలిసి వేరే డైరక్టర్ ను పట్టుకువచ్చారు.

ఆ విధంగా జైలవకుశ తరువాత ప్రాజెక్టు కోసం చూస్తున్న డైరక్టర్ బాబీ సీన్ లోకి వచ్చారు. ప్రాజెక్టు పార్టనర్ సురేష్ బాబు కూడా ఓకె అన్నారు. స్క్రిప్ట్ వర్క్ అంతా పూర్తి కావడంతో ఈనెల 11న ముహుర్తం చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. వెంకీమామ అన్నది వర్కింగ్ టైటిల్.

ప్రస్తుతం వెంకీ ఎఫ్ 2 సినిమా చేస్తున్నారు. అలాగే నాగ్ చైతన్య తన రెండు సినిమాలు పూర్తి చేసే ప్రయత్నంలో వున్నారు. ఆ వెంటనే శివనిర్వాణ డైరక్షన్ లో మరో సినిమా స్టార్ట్ చేస్తారు. అలా వెంకీ, చైతన్య సినిమాలు ఓ కొలిక్కి వచ్చాక ఈ సినిమా షూట్ వుంటుంది.