ఆ హీరోపై 7కోట్ల బెట్టింగ్

కొత్త హీరోతో సినిమా అంటే మహా అయితే రెండు మూడుకోట్లు పెడతారు. లేదా వారసుల సినిమా అంటే స్వంతంగా ఎంతయినా, ఎన్నికోట్లు అయినా పెడతారు. కానీ నిర్మాత సాయి కొర్రపాటి మాత్రం మెగా అల్లుడు…

కొత్త హీరోతో సినిమా అంటే మహా అయితే రెండు మూడుకోట్లు పెడతారు. లేదా వారసుల సినిమా అంటే స్వంతంగా ఎంతయినా, ఎన్నికోట్లు అయినా పెడతారు. కానీ నిర్మాత సాయి కొర్రపాటి మాత్రం మెగా అల్లుడు సినిమా కోసం ఏకంగా ఏడుకోట్లు పెట్టడం విశేషం. విజేత అనే టైటిల్ లో మెగా అల్లుడు కళ్యాణ్ ధేవ్ తో నిర్మించే సినిమాను ఆరంభంలో చిన్నగా చేయాలనే దిగారు. ప్రారంభంలో మూడు నుంచి నాలుగుకోట్ల ప్రాజెక్టుగా డిజైన్ చేసారు. 

కానీ సినిమాటోగ్రాఫర్ గా సెంథిల్ కుమార్ వచ్చి జాయిన్ అయిన తరువాత ప్రాజెక్టు రూపం మారిపోయింది. సినిమాకు టెక్నికల్ కాస్త పెరిగింది. దాంతో టోటల్ ప్రాజెక్టు, రిలీజ్ ఖర్చులు, పబ్లిసిటీ కలిపి ఏడు కోట్లకు చేరింది.

సినిమా అయితే ఇంకా అమ్మలేదు. సాధారణంగా సాయి కొర్రపాటి తన సినిమాలు తానే డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు. నైజాం మాత్రం సురేష్ బాబు చేస్తారు. ఈ సినిమా కూడా అలాగే చేస్తారో? మరి విక్రయిస్తారో చూడాలి.

కళ్యాణ్ సరసన మాళవిక నటిస్తోంది. మెగాస్టార్ అల్లుడు కావడంతో, అడియో ఫంక్షన్ కు రాజమౌళి లాంటి వాళ్లు అంతా రావడంతో సినిమాకు కాస్త బజ్ వచ్చింది. ఈ సినిమాకు పోటీగా ఆర్ ఎక్స్ 100, చినబాబు సినిమాలు రంగంలోకి దిగుతున్నాయి.