ఇప్పటికిప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ ఏమిటీ అని ఎవర్ని అయినా అడిగితే గౌతమ్ నందా రిలీజ్ డేట్ అనేటట్లు వుంది పరిస్థితి. యూనిట్ జనాలు మేం కచ్చితంగా జూలై 14 కు వచ్చేస్తున్నాం అంటున్నారు.
సినిమాలు పూర్తయిపోయి, విడుదలకు మంచి డేట్ కోసం చూస్తున్న వారు అడిగితే ఇలాగే చెబుతున్నారు. మళ్లీ వన్ ఆర్ టూ డేస్ లో ఏ సంగతీ చెబుతాం అని కూడా ఆఫ్ ది రికార్డుగా అంటున్నట్లు తెలుస్తోంది.
కానీ ఇండస్ట్రీలో మాత్రం జూలై 28కి వాయిదా పడడానికే చాలా అంటే చాలా వరకు చాన్స్ వుందని టాక్ వినిపిస్తోంది. వాస్తవానికి 14న రావడానికి ఏదైనా కారణాల వల్ల కుదరకపోతే, 21కి వద్దాం అనే ఆలోచనతో యూనిట్ వున్నట్లు వినికిడి. కానీ ఇక్కడ దిల్ రాజు అడ్డం పడుతున్నారు. ఆయన స్వంత సినిమా ఫిదా 21న విడుదల వుంది.
మరి గౌతమ్ నందా నైజాం డిస్ట్రిబ్యూటర్ కూడా ఆయనే. అందువల్ల ఆయన అయితే 14 లేకుంటే 28 అంటున్నారు. చాయిస్ గౌతమ్ నందా యూనిట్ దే. 14 నుంచి ఏకంగా రెండు వారాలు వెనక్కు వెళ్తే అంత బాగుండదని, 21 డేట్ ను తమకు ఇవ్వాలని వాళ్లు దిల్ రాజును అడుగుతున్నట్లు, తాను ముందే డేట్ ప్రకటించేసా కాబట్టి, మరి మార్చే సమస్య లేదని ఆయన చెబుతున్నట్లు టాక్ వినిపిస్తోంది.
ఇంతకీ గౌతమ్ నందా 14 నుంచి ఎందుకు వెనక్కు వెళ్తుంది అన్న దానిపై మాత్రం ఈ గుసగుసల్లో క్లారిటీ రావడం లేదు. వర్క్ ఇంకా కొద్దిగా వుందని, హర్రీ హర్రీగా చేస్తే తప్ప, ఫినిష్ కాదని ఒక కారణం వినిపిస్తోంది. రెబల్ కు సంబంధించిన పాత సెటిల్ మెంట్ డిస్కషన్లు వున్నాయని మరో గుసగుస వినిపిస్తోంది.
ఇదిలా వుంటే గౌతమ్ నందా 14న రాకుంటే తమ సినిమా వదలాలని అనుకుంటున్న జాబితాలో కృష్ణవంశీ కూడా చేరారు. ఆయన కూడా అయిదున ఆడియో ఫంక్షన్ చేసి, 14న తన 'నక్షత్రం' సినిమాను వదలాలని అనుకుంటున్నట్లు బోగట్టా.
నక్షత్రంలో హీరో సందీప్ కిషన్ నటించిన మరో సినిమా శమంతకమణి కూడా 14నే విడుదలవుతోంది. ఇప్పటికే పటేల్ సర్, వైశాఖం కూడా 14 బరిలోకి రెడీ అవుతున్నాయి. మొత్తానికి జూలై 14 పెద్ద క్రేజీ డేట్ గా మారింది.