Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

15 కోట్లలో అవుతుందా?

15 కోట్లలో అవుతుందా?

ఎప్పటి నుంచో వార్తల్లో వినవస్తున్న సినిమా కార్తికేయ 2. హీరో నిఖిల్-దర్శకుడు కార్తికేయల కాంబినేషన్ లో వచ్చిన హిట్ మూవీ కార్తికేయ కు సీక్వెల్. అయితే వివిధ కారణాల వల్ల ఈ సినిమా అలా అలా వెనక్కు వెళ్తూ వచ్చింది. ఆఖరికి ఇప్పుడు టైమ్ వచ్చింది.

పీపుల్స్ మీడియా ఈ సినిమాను నిర్మించడానికి రెడీ అయింది. స్క్రిప్ట్ వర్క్, ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ సినిమాను 15 కోట్ల ప్యాకేజ్ తో చేయడానికి దర్శకుడు చందు మొండేటి ఒప్పుకున్నట్లు బోగట్టా. అయితే 15 కోట్లు అంటే రెండు పాయింట్లు వున్నాయి.

ఒకటి ఈ సినిమాకు చందు మొండేటి తీసుకున్న స్క్రిప్ట్ కాస్త ఖర్చు డిమాండ్ చేసేదే అని, దేశంలోని పలు చోట్ల షూటింగ్ అవసరం అవుతుందని తెలుస్తోంది. గతంలో ఇదే ప్రాజెక్టుకు 20 కోట్ల బడ్జెట్ లెక్కలు వేసారు. అప్పట్లో అందుకే ఏషియన్ సునీల్ లాంటి వాళ్లు వెనకడుగు వేసారు.

మరి ఇప్పడు 15 కోట్లలో ఫినిష్ అవుతుందా? అన్నది అనుమానం. చందుమొండేటి క్వాలిటీ దగ్గర రాజీపడరు. సవ్యసాచి సినిమాకు ముఫై కోట్లకు పైగా ఖర్చయింది. పైగా కార్తికేయ 2 చాలా సిజి వర్క్ అవీ వున్న సబ్జెక్ట్.

రెండవ పాయింట్. ఇప్పుడున్న మార్కెట్ పరిస్థితుల్లో నిఖిల్ సినిమా మీద 15 కోట్లు పెడితే ఫరవాలేదా అన్నది? హిందీ డబ్బింగ్ మార్కెట్ బాగా వుండి వుంటే ఈ క్వశ్చను రాదు. కానీ ప్రస్తుతం ఆ మార్కెట్ అంతగా లేదు. థియేటర్ మార్కెట్ కూడా నీరసంగానే వుంది.

అయితే సబ్జెక్ట్ కు వున్న క్రేజ్, దమ్ము ఆధారంగా పీపుల్స్ మీడియా సంస్థ ముందుకు వెళ్తోంది. త్వరలో ఈ సినిమా ప్రారంభం అవుతుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?