రెండు సినిమాలు..రెండు తేదీలు

శంకర్-విక్రమ్ కాంబినేషన్ ఐ , పవన్-వెంకీ కాంబినేషన్ 'గోపాల గోపాల' సినిమా ల వ్యవహారం ఇంకా తేలినట్లు కనిపించడం లేదు. డబ్బింగ్ సినిమాలు సంక్రాంతికి విడుదల కాకూడదని నిబంధన పైకి తీసి అడ్డం పడాలని…

శంకర్-విక్రమ్ కాంబినేషన్ ఐ , పవన్-వెంకీ కాంబినేషన్ 'గోపాల గోపాల' సినిమా ల వ్యవహారం ఇంకా తేలినట్లు కనిపించడం లేదు. డబ్బింగ్ సినిమాలు సంక్రాంతికి విడుదల కాకూడదని నిబంధన పైకి తీసి అడ్డం పడాలని చూస్తుంటే, దాన్ని అధిగమించాలని ఐ తెలుగు హక్కులు తీసుకున్నవాళ్లు చూస్తున్నారు. 

దీనిపై చెన్నయ్ లో నిన్న, ఈ రోజు డిస్కషన్లు నడిచినట్లు తెలుస్తోంది. మధ్యే మార్గంగా ఐ సినిమాను 14కు పంపి, గోపాల గోపాలను 9 కి తేవాలని ఓ ఆలోచన చేసినట్లు తెలస్తోంది.అలా అయితే తొలివారం సోలో కలెక్షన్లు, మలివారం పండుగ కలెక్షన్లతో గోపాలగోపాల గట్టెక్కేస్తుంది. 

కానీ ఇందుకు ఐ టీమ్ ఒప్పుకుంటుందా? పైగా 32 కోట్ల తెలుగు హక్కుల కోసం చూసుకుంటే, తమిళనాట ఒక వారం కలెక్షన్లు వదులుకోవాలి కదా. అందుకే కిందా మీదా అవుతున్నారు. మొత్తానికి ఒకటి మాత్రం కన్ ఫర్మ్ అంటున్నారు. ఏదో ఒకటి తొమ్మిదికి వస్తే, రెండవది 14కువస్తుంది. ఏది ఎప్పుడు అన్నది రేపటికి తెలియవచ్చని సినీ వర్గాల బోగట్టా.