మహేష్ కు పాతిక కోట్లు?

హీరోల పారితోషికాల గురించి ఎప్పుడూ ఊహాగానాలే వుంటాయి. అసలు ఫిగర్లు ఆదాయపన్నుశాఖకు తెలుస్తాయి. కానీ అది వైట్..అది కాక బ్లాక్ సంగతి ఎవరికీ తెలియదు..ఇచ్చినవారికి,పుచ్చుకున్నవారికి మినహా. అయినా కూడా చిన్నచిన్న వార్తలు లీక్ అవతూనే…

హీరోల పారితోషికాల గురించి ఎప్పుడూ ఊహాగానాలే వుంటాయి. అసలు ఫిగర్లు ఆదాయపన్నుశాఖకు తెలుస్తాయి. కానీ అది వైట్..అది కాక బ్లాక్ సంగతి ఎవరికీ తెలియదు..ఇచ్చినవారికి,పుచ్చుకున్నవారికి మినహా. అయినా కూడా చిన్నచిన్న వార్తలు లీక్ అవతూనే వుంటాయి. టాలీవుడ్ టాప్ హీరోల్లో పారితోషికం విషయంలో మహేష్ దే పైచేయి అన్నది తెలిసిందే.

అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఆ పక్కనే వుంటున్నారు. నిన్నమొన్నటి దాకా 14 నంచి 16 ఆపై 18 అంట మహేష్ పారితోషికాల లెక్కలు వినిపించాయి. దూకుడు, బిజినెస్‌మేన్, 1 సినిమాల‌కు ఇలా భారీ పారితోషికాలే అందుకున్నాడు  మహేష్. అదే విధంగా పవన్ అత్తారింటికి దారేదికీ అందుకున్నాడు. అంతకు ముందు పవన్ కు అన్నీ మొహమాటం వ్యవహారాలు,.తరువాత ఇంకా సరైన సినిమా లేదు.  అందుకే రేస్ లో కాస్త వెనకే వున్నాడు. 

ఇప్పడు పారితోషికం విషయంలో కొత్త రికార్డు సృష్టించేస్తున్నాడు మహేష్. పివిపి సంస్థ మహేష్ తో నిర్మించే 'బ్రహ్మోత్సవం' సినిమాకు గాను మ‌హేష్‌కు భారీ పారితోషికం ఆపర్ చేసినట్లు తెలుస్తోంది డీల్ అంతా కలిపి పాతిక కోట్లు అట. శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు.  ఇక పవన్ ఈ రికార్డు ఎప్పుడు సమం చేస్తాడో. గబ్బర్ సింగ్ 2 మాత్రం దాదాపు తన స్వంత ప్రాజెక్టు. గోపాల గోపాల కూడా అలాంటి వ్యవహారమే. సరైన నిర్మాత ముందుకు రావాలి. పవన్ ఓకె అనాలే కానీ, అతగాడికీ ఆ రేంజ్ వుంది.