డిసెంబర్ సెకండాఫ్ లో, ఆపై సంక్రాంతికి కాస్త చెప్పుకోదగ్గ సినిమాలు రానున్నాయి. వీటన్నింటికి ప్రచారం షురూ అయింది. ఇప్పటికే బన్నీ-త్రివిక్రమ్ ల అల వైకుంఠపురములో సినిమాకు రెండుపాటలు వచ్చాయి. మూడో పాట ర్యాప్ సాంగ్ 22 మధ్యాహ్నం రాబోతోంది.
మహేష్ బాబు-అనిల్ రావిపూడిల కాంబినేషన్ లో సరిలేరు నీకెవ్వరూ ప్రచారానికి ఇప్పుడే శ్రీకారం చుట్టింది.అందులో భాగంగా టీజర్ 22న రాబోతోంది. అటు బన్నీ, ఇటు మహేష్ ల పాట, టీజర్లు ఒకే రోజు గంట తేడాతో రాబోతున్నాయి.
చైతన్య-వెంకీ కాంబినేషన్ లోని వెంకీమాట డిసెంబర్ లో విడుదలవుతోంది. ఈ సినిమా ట్రయిలర్ 23న రావడానికి సన్నాహాలు చేస్తున్నారు. వర్క్ అనుకున్నట్లు అయితే 23న ట్రయిలర్ జనంలోకి వస్తుంది.
బాలయ్య-కేఎస్ రవికుమార్ ల రూలర్ సినిమా డిసెంబర్ 20న రాబోతోంది. ఈ సినిమా టీజర్ రేపే అంటే 21న విడుదల చేయబోతున్నారు. ఇలా మొత్తం మీద అన్ని సినిమాల ప్రచార సామగ్రి సోషల్ మీడియా మీదకు వస్తోంది. ఇక సోషల్ మీడియాలో ఈ సినిమాల సందడే ఎక్కువ కనిపిస్తుంది.