తమరు ఏ లెవెల్లో ఉన్నారు అల్లుడు గారూ…?

అత్త మీద కోపం దుత్త మీద చూపించడం ఒక సామెత. కానీ మామను తిట్టినందుకు అల్లుడు గారు ఎగిరెగిరి పడితే దాన్ని ఏమనాలి? ఏమనాలో.. నందమూరి చైతనకృష్ణ కే తెలియాలి. Advertisement ఎందుకంటే.. వైఎస్సార్…

అత్త మీద కోపం దుత్త మీద చూపించడం ఒక సామెత. కానీ మామను తిట్టినందుకు అల్లుడు గారు ఎగిరెగిరి పడితే దాన్ని ఏమనాలి? ఏమనాలో.. నందమూరి చైతనకృష్ణ కే తెలియాలి.

ఎందుకంటే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొడాలి నాని, వల్లభనేని వంశీ.. చంద్రబాబు మీద రాజకీయ విమర్శలు చేస్తోంటే.. మధ్యలో ఆ రాజకీయాలకు ఏమాత్రం సంబంధం లేని.. చైతన్యకృష్ణ వీడియో హెచ్చరికలు పంపుతున్నారు.

ఇంతకూ చైతన్యకృష్ణ అంటే ఎవరో 90 శాతం తెలుగు రాష్ట్రానికి తెలియకపోవచ్చు. ఆయన ఎన్టీఆర్ మనవడు. జయకృష్ణ కొడుకు.

నందమూరి అనే ప్రిఫిక్సు లేకపోతే.. ఆయన ఎవరో ఎవ్వరికీ తెలియదు. అలాంటి చైతన్యకృష్ణ.. ‘‘కొడాలి నాని, వంశీ ఇవాళ ఈ స్థానంలో ఉన్నారంటే దానికి  మావయ్య చంద్రబాబే కారణం. ఆయన నోటికొచ్చినట్టు దూషిస్తే సహించేది లేదు’’ అని బెదిరిస్తూ ఓ వీడియో రిలీజ్ చేశారు.

అవును గానీ.. చైతన్య గారూ.. మీ మామయ్య పుణ్యమాని వాళ్లు ఈ లెవెల్లో ఉన్నారని అంటున్నారే.. మరి అదే మామయ్య పుణ్యమాని.. తమరు ఎక్కడ ఉన్నారు? తమ సోదరి ఎమ్మెల్యేగా కూడా పోటీచేశారే.. ఆమె ఇప్పుడు ఏ లెవెల్లో ఉన్నారు? ఓసారి వెనక్కి తిరిగి చూసుకోకపోయారా?

వల్లభనేని వంశీ, కొడాలి నానిల్లో తమ సొంత బలం ఉండబట్టే వారిన మీ మామయ్య చేరదీశారు. అంతే తప్ప.. కేవలం మీమామయ్య పుణ్యమాని వారు ఈ లెవెలుకు వచ్చి ఉంటే.. మీరు, మీ చెల్లెలు అందరూ.. ఇప్పటికి ఏయే లెవెల్లో వెలుగొందుతూ ఉండాలో కదా..?

ఇంకో  కొసమెరుపు…

చంద్రబాబునాయుడు విషయానికి వస్తే.. ఇవాళ కొడాలినాని గానీ, నిన్న వంశీగానీ తిట్టిన తిట్లు అసలు ఏపాటివి. మొన్నటికి మొన్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేసీఆర్, చంద్రబాబును ఎన్ని రకాలుగా తిట్టారు? ఎంత నీచంగా తిట్టారు? మామూలు శత్రువులు కూడా తిట్టుకోనంత జుగుప్సాకరమైన పదజాలంతో.. కేసీఆర్ ఎడాపెడా తిట్టారు! మామయ్య మీద ఇవాళ ఇంతగా అభిమానం పొంగి పొరలుతున్న నందమూరి చైతన్యకృష్ణ.. అప్పుడు ఏమయ్మారు? ఇదే స్థాయిలో ఒక వీడియో తీసి తర్జని చూపిస్తూ కేసీఆర్‌ను ఎందుకు బెదిరించలేకపోయారు? ఆయనకే తెలియాలి.